దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు

ఫొటో సోర్స్, twitter/DelhiAirport
మార్చి 25వ తేదీ నుంచి లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలు ఈనెల 25వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే విమానాలను నడుపుతోంది.
ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రయాణించే వారి నుంచి వసూలు చేయాల్సిన ఛార్జీలను కూడా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) గురువారం ప్రకటించారు. ప్రయాణ సమయాన్ని బట్టి ఈ ధరలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
డీజీసీఏ సర్క్యులర్‌లో దేశంలోని విమాన మార్గాలను ఏడు సెక్టార్లుగా విభజించారు. ఆయా సెక్టార్లు, వాటిలో ప్రయాణ ఛార్జీలు ఇలా ఉన్నాయి.
- సెక్టార్ ఏ - కనిష్ఠ ఛార్జీ రూ.2 వేలు, గరిష్ఠ ఛార్జీ 6 వేలు
- సెక్టార్ బీ - కనిష్ఠ ఛార్జీ రూ.2,500, గరిష్ఠ ఛార్జీ 7,500
- సెక్టార్ సీ - కనిష్ఠ ఛార్జీ రూ.3 వేలు, గరిష్ఠ ఛార్జీ 9 వేలు
- సెక్టార్ డీ - కనిష్ఠ ఛార్జీ రూ.3,500, గరిష్ఠ ఛార్జీ 10 వేలు
- సెక్టార్ ఈ - కనిష్ఠ ఛార్జీ రూ.4,500, గరిష్ఠ ఛార్జీ 13 వేలు
- సెక్టార్ ఎఫ్ - కనిష్ఠ ఛార్జీ రూ. 5,500, గరిష్ఠ ఛార్జీ 15,700
- సెక్టార్ జీ - కనిష్ఠ ఛార్జీ రూ. 6,500, గరిష్ఠ ఛార్జీ 18,600
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్ నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఈ సర్క్యులర్‌ను బట్టి తెలుస్తోంది.
దిల్లీ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ మార్గాలను డీ సెక్టార్‌లో పేర్కొన్నారు. అంటే దిల్లీ నుంచి హైదరాబాద్ లేదా వైజాగ్ అలాగే హైదరాబాద్, వైజాగ్ నుంచి దిల్లీకి విమాన ప్రయాణానికి ఛార్జీ కనిష్ఠంగా రూ.3,500, గరిష్ఠంగా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
సెక్టార్ల వారీగా ఏఏ నగరాలకు హైదరాబాద్, వైజాగ్‌లకు నుంచి విమానాలు ప్రయాణిస్తున్నాయంటే..
సెక్టార్ బీ - కనిష్ఠ ఛార్జీ రూ.2,500, గరిష్ఠ ఛార్జీ 7,500
హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, గోవా, ఇండోర్, కోచి, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, వైజాగ్
అలాగే, పూణే నుంచి హైదరాబాద్, మంగళూరు నుంచి హైదరాబాద్
రాయ్‌పూర్ నుంచి వైజాగ్
సెక్టార్ సీ - కనిష్ఠ ఛార్జీ రూ.3 వేలు, గరిష్ఠ ఛార్జీ 9 వేలు
హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, కోల్‌కతా, పూణే, త్రివేండ్రం
బెంగళూరు నుంచి వైజాగ్
కోయంబత్తూరు నుంచి హైదరాబాద్
కొచ్చి నుంచి హైదరాబాద్
కోల్‌కతా నుంచి వైజాగ్
తిరువనంతపురం నుంచి హైదరాబాద్
సెక్టార్ డీ - కనిష్ఠ ఛార్జీ రూ.3,500, గరిష్ఠ ఛార్జీ 10 వేలు
భువనేశ్వర్ నుంచి హైదరాబాద్
దిల్లీ నుంచి హైదరాబాద్, వైజాగ్
హైదరాబాద్ నుంచి అమృత్‌సర్, దిల్లీ, జైపూర్, లక్నో, పాట్నా, రాంచీ
జైపూర్ నుంచి హైదరాబాద్,
కోల్‌కతా నుంచి హైదరాబాద్,
లక్నో నుంచి హైదరాబాద్
పాట్నా నుంచి హైదరాబాద్
రాంచీ నుంచి హైదరాబాద్
వారణాసి నుంచి హైదరాబాద్
ముంబై నుంచి వైజాగ్
పోర్ట్‌బ్లెయిర్ నుంచి వైజాగ్
సెక్టార్ ఈ - కనిష్ఠ ఛార్జీ రూ.4,500, గరిష్ఠ ఛార్జీ 13 వేలు
అమృత్‌సర్ నుంచి హైదరాబాద్
హైదరాబాద్ నుంచి చండీఘఢ్, డెహ్రడూన్, గువహటి, వారణాసి
పోర్ట్ బ్లెయిర్ నుంచి హైదరాబాద్

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








