భారత సైన్యంలో 97,000 పోస్టులు ఖాళీ, అయినా ఎందుకు నియామకాలు చేపట్టడం లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హరియాణాకు చెందిన 23ఏళ్ల పవన్ ఏప్రిల్ 26న ఆత్మహత్య చేసుకున్నారు. భారత సైన్యంలో ఉద్యోగం రాకపోవడంతో ఆయన ఈ విపరీత నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేసుపై విచారణ చేపడుతున్న ఏఎస్ఐ వీరేందర్ సింగ్ బీబీసీతో మాట్లాడారు. సైన్యంలో చేరేందుకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన స్కూల్ గ్రౌండ్‌లోనే ఒక చెట్టుకు పవన్ ఉరి వేసుకున్నట్లు వీరేందర్ చెప్పారు.
‘‘తులు గ్రామానికి చెందిన పవన్ సైన్యంలో చేరేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు ఆయన మెడికల్ రౌండ్ వరకు కూడా వెళ్లారు. కానీ కోవిడ్-19 వ్యాప్తి నడుమ కొత్త నియామకాలు జరగలేదు. అదే సమయంలో సైన్యంలో చేరేందుకు అనుమతించే వయసు దాటిపోయింది. పవన్ మృతదేహానికి సమీపంలో మాకు ఒక లేఖ కూడా దొరికింది. దానిలో నాన్నగారు, నేను ఈ జన్మలో సైన్యంలో చేరలేకపోయాను. వచ్చే జన్మలో కచ్చితంగా సైనికుణ్ని అవుతానని పేర్కొన్నారు’’అని వీరేందర్ చెప్పారు.
ఈ ఆత్మహత్య వార్త వెలుగులోకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్ర ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విమర్శల నడుమ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘‘ఆర్మీలో చేరేందుకు కష్టపడిన ఆ గ్రౌండ్‌లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ జన్మలో సైన్యంలో చేరలేకపోయాను, వచ్చే జన్మలో కచ్చితంగా సైన్యంలో చేరతానని ఆయన అన్నారు. ఆయన కుంగుబాటుతో బాధపడ్డారు. ఇలాంటి యువకుల అభ్యర్థనలను ప్రభుత్వం ఎప్పుడు వింటుంది?’’అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మార్చి 2020 నుంచి నియామకాలు జరగట్లేదు..’’
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘నిరుద్యోగ యువత నిస్సహాయతను మోదీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మార్చి 2020 నుంచి సైన్యంలో నియామకాలు జరగడం లేదు. ఇదివరకు ఏటా 80,000 నియామకాలు జరుగుతుండేవి. ఇప్పుడు నియామకాలే చేపట్టడం లేదు. ప్రస్తుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ యువత మొరను ఎవరు వింటారు. దయచేసి వారు చెప్పేది వినండి’’అని ఆయన ట్వీట్ చేశారు.
సైన్యం నియామకాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడం ఇదేమీ తొలిసారి కాదు.

ఫొటో సోర్స్, Hindustan Times
జంతర్ మంతర్‌లో నిరసనలు
తాజా ఘటనకు మూడు వారాల ముందు, ఏప్రిల్ 5న, దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ నియామక ర్యాలీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వందల మంది యువత నిరసన చేపట్టారు.
అక్కడకు నిరసన చేపట్టడానికి వచ్చిన యువత ఏఎన్ఐతో మాట్లాడారు. గత రెండేళ్ల నుంచి ఎలాంటి నియామక ర్యాలీలు నిర్వహించడంలేదని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మరో నిరసనకారుడు సుదీప్ ఫౌజీ మాట్లాడుతూ.. ‘‘ఆర్మీ ర్యాలీ చేపట్టాలని డిమాండ్ చేసేందుకు మేం ఇక్కడకు వచ్చాం. మాకు వయసు పరిమితి విషయంలోనూ రెండేళ్లు సడలింపు ఇవ్వాలి. కోవిడ్-19 వ్యాప్తి వల్ల రెండేళ్లు నియామకాలు నిర్వహించలేదు. ఇదివరకు నేను ఫిట్‌నెస్ పరీక్షల్లోనూ పాసయ్యాను. కానీ, రాత పరీక్ష నిర్వహించలేదు. ఇంతలోనే రెండేళ్లు గడిచిపోయాయి’’అని ఆయన చెప్పారు.
సైన్యంలో ప్రాథమిక స్థాయి నియామకాల కోసం దేశంలోని భిన్న ప్రాంతాల్లో సైన్యం ర్యాలీలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత ఎక్కువగా వీటిలో పాల్గొంటుంటారు.
హరియాణా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్ లాంటి ఉత్తర రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ర్యాలీలకు పెద్దయెత్తున యువత హాజరు అవుతుంటారు. దీని కోసం వారు ఏళ్లుగా సన్నద్ధం అవుతూ ఉంటారు.
అయితే, నియామకాలు ఆగిపోవడంతో దేశంలోని భిన్న ప్రాంతాల్లో వీరు నిరసనలు చేపడుతున్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times
రాజ్యసభలోనూ ప్రభుత్వానికి ప్రశ్నలు
ఈ అంశంపై రాజ్యసభలోనూ విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. వీటిపై మార్చి 21న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ నియామక ప్రక్రియలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన చెప్పారు.
మరోవైపు కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్ కూడా ఈ అంశంపై స్పందించారు. ‘‘2020-21లో దేశ వ్యాప్తంగా 97 నియామక ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించాం. కానీ, వీటిలో 47 ర్యాలీలు మాత్రమే చేపట్టగలిగాం. వీటిలో రాత పరీక్ష కేవలం నాలుగు ర్యాలీలకే జరిగింది’’అని ఆయన చెప్పారు.
‘‘మరోవైపు 2021-22లో 87 ర్యాలీలు చేపట్టాలని అనుకున్నాం. అయితే, కేవలం నాలుగు ర్యాలీలే నిర్వహించాం. కానీ, వీటిలో ఒక్కదానిలో కూడా రాత పరీక్ష నిర్వహించలేదు’’అని ఆయన వివరించారు.
2018-19లో 53,431 నియామకాలు చేపట్టామని, 2019-20లో 80,572 నియామకాలు చేపట్టామని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
మొత్తంగా సైన్యంలో 2018 నుంచి 2022 వరకు 1,34,003 నియామకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
అయితే, 97,000 పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. 2022-23 సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.
97,000 పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, సైన్యంలో మొత్తంగా 12,29,559 పోస్టులు ఉన్నాయి. వీటిలో 97,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఖాళీల వల్ల అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లతోపాటు పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో త్వరగా నియామక ర్యాలీలు చేపట్టాలని దేశంలోని భిన్న ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
గత ఏడేళ్లలో ఎన్ని ఖాళీలకు భర్తీ చేశారు?
రక్షణ శాఖ సమాచారం ప్రకారం, గత ఏడేళ్లలో సగటున ఏటా 60,000 నియామకాలను సైన్యం చేపడుతోంది.
2013-14లో 54,186, 2014-15లో 31,911, 2015-16లో 67,954, 2016-17లో 71,804, 2017-18లో 52,447, 2018-19లో 50,026 నియామకాలు చేపట్టారు.
అయితే, సైన్యంలో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ, ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఎందుకు వయో పరిమితిని పెంచడంలేదని యువత ప్రశ్నిస్తున్నారు.
అయితే, భారత సైన్యం, భారత వైమానిక దళం వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏమీలేవని కేంద్ర మంత్రి అజయ్ భట్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ఎవరెస్ట్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ శిఖరంపై యుక్రెయిన్ యుద్ధ ప్రభావం
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- 7 లక్షల జనాభా ఉన్న చిన్న దేశంతో చైనా ఒప్పందం: భయపడుతోన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా...
- మెన్స్ట్రువల్ కప్: నెలసరి సమయంలో దీనిని ఎలా వాడాలి? ఇక శానిటరీ ప్యాడ్ల అవసరం ఉండదా? 5 ప్రశ్నలు, సమాధానాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














