మోదీ ఇంటర్వ్యూ: ‘5 రాష్ట్రాలలో గెలుపు మాదే’ అన్న మోదీ - ఓటమి భయంతోనే పోలింగ్‌కు ముందు ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్న కాంగ్రెస్

మోదీ

ఫొటో సోర్స్, ANI

దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్(ఫిబ్రవరి 10) జరగడానికి ఒక రోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వివిధ ఇతర అంశాలపైనా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం కనబరిచారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రజల హృదయాలను గెలుచుకుందని, పారదర్శక పాలన అందిస్తోందని... అక్కడ బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ అన్నారు.

అధికారంలో ఉన్నా లేకున్నా సంక్షేమమే తమ విధానమని ప్రధాని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘యోగి పాలనలో యూపీ మారింది... గూండా రాజ్, మాఫియా రాజ్ అన్నీ పోయాయి’

యూపీ ఎన్నికల గురించి మాట్లాడుతూ మోదీ.... ''గతంలో ఇద్దరు అబ్బాయిలు ఆడిన ఆటను చూశాం. వారికి గర్వం ఏ స్థాయిలో ఉంటుందంటే, గుజరాత్‌కు చెందిన రెండు గాడిదలు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. చివరకు ఏమైంది, యూపీ ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. రెండోసారి బువాజీతో కలిసి పోరాడారు. కానీ, ఫెయిలయ్యారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల సేవలోనే ఉంది'' అన్నారు.

యూపీ ప్రజలు భద్రత అనగానే గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటారని మోదీ అన్నారు. కానీ, ఇప్పుడు వారు చాలా క్షేమంగా ఉన్నారని చెప్పారు.

గతంలో మాఫియా రాజ్, గూండారాజ్ ఉండేదని, బలవంతుడే రాజ్యమేలే వాడని అన్నారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం నుంచి రక్షణ లభించేదని అన్నారు.

గతంలో యూపీలో మహిళలు బయటకు అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదన్నారు.

'గతంలో రౌడీయిజం చెలాయించిన వారంతా ఇప్పుడు ప్రభుత్వానికి లొంగిపోయారు. యోగీ ప్రభుత్వం ప్రజల భద్రతకు పెద్దపీట వేసింది. ఎక్కడా రాజీపడలేదు. గతంలో పగలు కూడా బయటకు రాలేని మహిళలు, ఇప్పుడు రాత్రిపూట కూడా నిర్భయంగా బయటకు రాగలగుతున్నారు'' అన్నారు మోదీ.

మోదీ

ఫొటో సోర్స్, ANI

తన పంజాబ్ పర్యటనలో భద్రత లోపంపై మోదీ ఏమన్నారంటే

పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లో తన భద్రతా లోపాల ఘటనను ప్రస్తావించగగా, '' ఈ విషయం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు దీని మీద సీరియస్‌గా విచారణ జరుపుతోంది. నేను దీనిమీద ఏదైనా ప్రకటన చేస్తే అది విచారణ మీద ప్రభావం చూపుతుంది'' అన్నారు మోదీ.

''మేం రైతుల బాధలను అర్ధం చేసుకున్నాం. ముఖ్యంగా చిన్న రైతుల కష్టాలు తెలుసుకున్నాం. వారికోసమే మూడు చట్టాలు తీసుకొచ్చాం. అవి అమలైతే రైతులకు లాభం కలిగేది. కానీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది'' అన్నారు మోదీ

" బీజేపీ 2014లో విజయం సాధించింది. 2017లో గెలిచింది. 2019లో గెలిచింది. యూపీలో ఒకసారి గెలిచిన వ్యక్తి రెండోసారి అధికారంలోకి రాలేడన్న సిద్ధాంతాన్నిఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మా పని తీరునుబట్టి యూపీ ప్రజలు 2022లో మాకే ఓటేస్తారు'' అన్నారు మోదీ.

Narendra Modi

ఫొటో సోర్స్, ANI

పెట్టుబడులు ఉపసంహరణ గురించి ప్రస్తావించగా,....

''వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు, పేద ప్రజలకు అన్నం పెట్టాలి. ఇళ్లు ఇవ్వాలి. మరుగుదొడ్లు కట్టించాలి. సరైన తాగునీరు ఇవ్వాలి. ఆరోగ్య సంరక్షణ చేపట్టాలి. రైతులను ఆదుకోవాలి. ఇవి ప్రభుత్వ ప్రాధాన్యతలు'' అన్నారు మోదీ

తాము సంధించిన ప్రశ్నలకు మోదీ జవాబివ్వడం లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలపై మోదీ స్పందించారు.

''వినడం తెలియని , పార్లమెంటు సమావేశాలలో పాల్గొనని ఆ వ్యక్తికి ఎలా సమాధానాలు ఇవ్వాలి'' అని ప్రశ్నించారు.

జమ్మూ కశ్మీర్ నుంచి మొదలు పెట్టి తమిళనాడు వరకు కుటుంబ పార్టీలే పాలిస్తున్నాయని మోదీ అన్నారు''

‘‘డినాస్టీలు నడిపే పార్టీలకు డైనమిక్స్ తెలియవు. వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. వారసత్వ రాజకీయాల వల్ల కుటుంబాలను కాపాడుకోవడమే సరిపోతోంది. దేశాన్ని వదిలేస్తున్నారు. వారసత్వ రాజకీయాల వల్ల ప్రధానంగా నష్టపోతున్నది ప్రతిభావంతులే'' అన్నారు.

యువతరం ఈ వారసత్వ రాజకీయాలకు చూసి భయపడి రాజకీయాల్లోకి రావడం లేదని మోదీ అన్నారు.

ఓటమి భయంతోనే పోలింగ్ ముందు రోజు ఇంటర్వ్యూ: కాంగ్రెస్

కాగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముందు రోజు ఇంటర్వ్యూ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓటమి భయంతోనే మోదీ ఇలా పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మోదీ ముఖాముఖిపై సమాజ్‌వాది పార్టీ నేతలూ విమర్శలు కురిపిస్తున్నారు.

మరోవైపు ఇది కోడ్ ఉల్లంఘనేనని, ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని సోషల్ మీడియా వేదికగా ప్రజలూ ప్రశ్నిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘పార్లమెంటు ఉభయ సభల్లో 'మన్ కీ బాత్' చేయలేదు. అందుకే ఇప్పుడు ఓటింగ్‌కు గంట ముందు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మోదీలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకున్నారు. రేపు పేదలు, రైతులు, కూలీలు, యువత, సామాన్య ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''అబద్ధం కూడా సిగ్గుపడింది.. దొడ్డిగుమ్మం నుంచి ముఖం దాచుకుని పారిపోయింది. ఇదంతా ఎప్పుడో తెలుసా? అతను ప్రపంచం మందుకు ముఖాముఖిగా వచ్చినప్పుడు'' అంటూ వ్యంగంగా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పోలింగ్‌కు ముందు ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని నెటిజన్లు అంటున్నారు.

ఇది పూర్తిగా అనైతికమని, ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తున్నారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)