విరాట్ కోహ్లీ: ‘వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు చెప్పారు’

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ను ఎంపిక చేయడానికి గంటన్నర ముందు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు.
టూర్‌కు వెళ్లే ముందు బుధవారం మీడియాతో మాట్లాడిన కోహ్లీ, తనను తప్పించడానికి ముందు బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని వెల్లడించారు.
''టెస్టు టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు నాకు చెప్పారు. టెస్టు జట్టులోని ఆటగాళ్ల ఎంపికపై చీఫ్ సెలక్టర్ నాతో మాట్లాడారు. ఇకపై వన్డేలకు నువ్వు కెప్టెన్‌గా ఉండకూడదని ఐదుగురు సెలక్టర్ల కమిటీ నిర్ణయించిందని ఫోన్ పెట్టేయడానికి ముందు నాకు చెప్పారు. అంతకు ముందు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ నాతో ఎలాంటి చర్చలు జరపలేదు'' అని ఆయన వెల్లడించారు.
సౌతాఫ్రికా టూర్‌కు వన్డే కెప్టెన్‌గా విరాట్ స్థానంలో రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ డిసెంబర్ 8న నిర్ణయం తీసుకుంది.
తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు బీసీసీఐ బాగానే రిసీవ్ చేసుకుందని ఆయన తెలిపారు.
అయితే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తాను సూచించినట్లు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ‘‘ఒకే తరహా క్రికెట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండటం అంత బాగుండదని సెలెక్టర్లు భావించారు’’ అంటూ కోహ్లీని తప్పించడంపై గంగూలీ వ్యాఖ్యానించారు.
కోహ్లీ విజయాల రేటు 70% ఉందని, అయితే, తాత్కాలిక కెప్టెన్‌గా 10 మ్యాచుల్లో 8 మ్యాచులు గెలిపించిన సమర్ధత రోహిత్ శర్మలో ఉందని గంగూలీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
రోహిత్, కోహ్లీల మధ్య విభేదాలున్నాయా?
దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటానని కోహ్లీ స్పష్టం చేశారు. కెప్టెన్సీ వివాదం తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తాయంటూ ఊహాగానాలపై కోహ్లీ స్పష్టత ఇచ్చారు. రోహిత్ శర్మతో తనకు ఎలాంటి సమస్యా లేదని, రెండేళ్లుగా దీనిపై క్లారిటీ ఇస్తూనే ఉన్నానని కోహ్లీ అన్నారు.
వన్డే మ్యాచ్ నుంచి విశ్రాంతి కావాలని తాను బీసీసీఐ ని కోరినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని విరాట్ స్పష్టం చేశారు. అలాగే గాయాల కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడటం లేదని, అతను త్వరగా కోలుకుంటాడని తాను ఆశిస్తున్నట్లు విరాట్ అన్నారు.
వన్డే కెప్టెన్ గా తనన తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించడంపై విరాట్ అలిగారని, అందుకే రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడటానికి విముఖత చూపుతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్పష్టత ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాల గురించి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ ట్వీట్ చేశారు.
''విరాట్ కోహ్లీ వన్డే నుంచి విశ్రాంతి కావాలంటున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండనని చెప్పాడు. ఆటలో విశ్రాంతి కోరుకోవడం తప్పేం కాదు. కానీ, టైమింగ్ చాలా ముఖ్యం. ఇలాంటి నిర్ణయాలు ఊహాగానాలను మరింత పెంచుతాయి'' అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రోహిత్, విరాట్ కలిసి ఆడబోవడం లేదని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మంగళవారం వ్యాఖ్యానించారు.
ఈ మొత్తం వివాదంపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన కేంద్ర క్రీడల శాఖామంత్రి మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆట కంటే ఏ ఆటగాడు పెద్దవాడు కాదన్నారు. ఆటగాళ్ల మధ్య ఏం జరుగుతుందో సంబంధిత క్రీడా సంఘాలు చూసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.
డిసెంబర్ 26 నుంచి భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఆ తర్వాత జనవరి 19-23 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తుండగా, వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.
ఊహించని నిర్ణయం
విరాట్ కోహ్లీని నుంచి వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ సెలక్టర్ల కమిటీ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాలను, కోహ్లీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 95 వన్డేలకు నాయకత్వం వహించిన విరాట్ 65 మ్యాచుల్లో జట్టును గెలిపించారు. 2019లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్‌లో జట్టును సెమీఫైనల్ వరకు తీసుకెళ్లారు.
ఈ ఏడాది నవంబర్‌లో టీట20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు. వన్డే, టెస్ట్ సిరీస్‌ల సమర్ధవంతంగా ప్రిపేర్ కావడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని విరాట్ ప్రకటించారు. అయితే, ఆయన ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని వారాలకే ఆయన్ను వన్డే కెప్టెన్సీ తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయ కుటుంబాల నెలసరి ఆదాయం రూ. 10 వేలు – ఆరేళ్లలో రైతుల ఆదాయం, అప్పులు ఎంత పెరిగాయి? - కేంద్ర ప్రభుత్వ తాజా సర్వే
- 2021లో ప్రజలు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసినవి ఇవే
- కోవిడ్డెంగీ అంటే ఏంటి? తెలంగాణలో ఏం జరుగుతోంది? మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు
- పుష్ప-సమంత: ‘ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? ‘మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక ‘చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండా, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
- పల్నాడు: ఈ పేరు ఎలా వచ్చింది, పల్నాడు ఉత్సవాల వెనుక కథ ఏంటి?
- అనకాపల్లి బెల్లం మార్కెట్లో వ్యాపారం ఎందుకు తగ్గుతోంది?
- లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ అక్కడికి ఎందుకెళ్లారు
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- చైనా కోసం పాకిస్తాన్ అమెరికానే వదులుకుంటోందా.. ఇమ్రాన్ ఖాన్ తాజా నిర్ణయ ఫలితం ఎలా ఉండనుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








