మాజీ సీఎం రోశయ్య ఇకలేరు

రోశయ్య

ఫొటో సోర్స్, revanth_anumula/Twitter

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు.

ఆరోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు.

రోశయ్యకు బీపీ డౌన్ అయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన చనిపోయినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టారని, కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రోశయ్య అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రోశయ్య వయసు 88 సంవత్సరాలు.

2009 నుంచి 2010 మధ్యలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు.

2011 నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్‌గా విధులు నిర్వహించారు.

రెండు నెలల పాటు కర్నాటకకు కూడా గవర్నర్‌గా వ్యవహరించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పని చేశారు. సుమారు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు.

రోశయ్య

ఫొటో సోర్స్, ugc

కొణిజేటి రోశయ్య గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. 1933, జూలై 4న జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో చదువుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరపున తొలుత శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. 1968, 1974, 1980లలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేసిన తర్వాత తెనాలి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత, వివిధ ముఖ్యమంత్రుల పాలనలో అనేక కీలక శాఖలను నిర్వహించారు.

1998లో నరసరావుపేట నుంచి రోశయ్య ఎంపీగా గెలిచారు.

2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వైఎస్సార్ క్యాబినెట్‌లో కీలక నేతగా వ్యవహరించారు. అదే సమయంలో మండలి పునరుద్ధరణ తరువాత మరోసారి శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు.

రోశయ్య

ఫొటో సోర్స్, ugc

వైఎస్సార్ మరణించిన తరువాత, 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఏడాదికే తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఎన్.జి.రంగా శిష్యుడిగా ఆయనకు పేరుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా పేరు పొందారు. మొత్తం 15సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడుసార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

రోశయ్య మృతి బాధాకరం

రోశయ్య మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

'ఇద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడిన సందర్బాలను నేను గుర్తు చేసుకున్నాను. ఆయన సేవలు మరువలేనివి' అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేశారు. నాటి తరం నాయకుడిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారన్నారు.

రోశయ్య మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.

పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య.. సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులు చేపట్టిన రోశయ్య చనిపోవడం రెండు రాష్ట్రాలకు తీరని లోటని జగన్ చెప్పారు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు కూడా రోశయ్య మృతికి సంతాపం తెలిపారు.

విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ స్థాయికి అంచలంచెలుగా ఎదిగారని, వివాదరహితుడిగా నిలిచారని కొనియాడారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రోశయ్య మరణంతో గొప్ప రాజనీతిజ్ఞుడిని, ఆదర్శవాదిని కోల్పోయామని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ చెప్పారు.

రోశయ్య మృతి కాంగ్రెస్‌కు, తనకూ తీరని లోటని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రధానమైన ఆర్థిక శాఖలో రోశయ్య అత్యుత్తమ సేవలు అందించారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.

చేపట్టిన ప్రతి పదవికి రోశయ్య వన్నె తెచ్చారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనియాడారు. సమయ స్ఫూర్తికి రోశయ్య మారుపేరని చెప్పారు. ఆయన మృతితో గొప్ప అనుభవంగల నాయకుడిని తెలుగుజాతి కోల్పోయిందన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

రోశయ్య మరణం తనను తీవ్రంగా బాధించిందని, ఆయన తనకు తండ్రి సమానుడని దగ్గుబాటి పురందేశ్వరీ ట్వీట్ చేశారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)