‘బీబీసీ న్యూస్ తెలుగు’కు ఆదరణ.. 52 శాతం పెరిగిన ఆడియన్స్‌

ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ఆడియెన్స్ పెరుగుదలలో భారతీయ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది
ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ఆడియెన్స్ పెరుగుదలలో భారతీయ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది

బీబీసీ న్యూస్ తెలుగు డిజిటల్ ఆడియన్స్‌లో ఈ ఏడాది 52 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆడియన్స్‌ వివరాలను వెల్లడించే గ్లోబల్‌ ఆడియెన్స్‌ మెజర్ (జీఏఎం) వార్షిక నివేదికను బీబీసీ విడుదల చేసింది.

భాగస్వామ్య చానల్‌లో ప్రసారమయ్యే వార్తా బులెటిన్ వీక్షకులతో కలిపి మొత్తంగా వారానికి సగటున 9.3 మిలియన్ల మంది ఆడియన్స్ ‘బీబీసీ తెలుగు’ కంటెంట్‌ను పొందుతున్నారు.

‘‘ఇంత పోలరైజ్డ్, పోటీ మీడియా వాతావరణంలో బీబీసీ తెలుగు తన వీక్షకుల సంఖ్యను పెంచుకోగలగడం ప్రత్యేకంగా నిలిచే అంశం.

విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన జర్నలిజానికి తెలుగు వీక్షకులు విలువనిస్తారని ఇది నిరూపించింది.

వీక్షకుల అంచనాలను అందుకోవడానికి ‘బీబీసీ తెలుగు’ మరింతగా ప్రయత్నిస్తుంది.

రంగులద్దని వార్తలు, రాజీలేని రిపోర్టింగ్‌తో లోతైన వార్తాకథనాలను, విశ్లేషణలను మీ చెంతకు తెస్తుంది’’ అని బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ అన్నారు.

బీబీసీ న్యూస్ లోగో

ప్రపంచవ్యాప్తంగా 7.2 కోట్ల మంది వీక్లీ ఆడియెన్స్‌తో బీబీసీ ఇండియన్‌ మార్కెట్‌ ఈ రేటింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

భారీగా మార్కెట్ పెరిగిన సైట్లలో బీబీసీ తెలుగు సహా ఇతర భారతీయ భాషల వెబ్‌సైట్లు.. బీబీసీ.కామ్‌, బీబీసీ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌లు ఉన్నాయి. 2020తో పోలిస్తే మొత్తంగా దాదాపు 90 లక్షల మంది ఆడియన్స్‌ పెరిగారు. (గత ఏడాది 6.3 కోట్లమంది ఆడియన్స్‌)

2020-21లో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రతివారం సగటున 48.9 కోట్ల మంది ఆడియన్స్‌ను బీబీసీ చేరుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 2 కోట్లు ఎక్కువ. దీంతో 2022 సంవత్సరంలో తన 100వ వార్షికోత్సవం నాటికి 50 కోట్లమంది ఆడియన్స్‌ను చేరుకోవాలన్న లక్ష్యానికి బీబీసీ చేరువైంది.

ఈ ఏడాది వరల్డ్ సర్వీస్‌ డిజిటల్‌ లాంగ్వేజ్‌ సర్వీసుల్లో అదనంగా 40లక్షల మంది ఆడియన్స్‌ను సంపాదించడం ద్వారా బీబీసీ హిందీ తన పట్టును నిరూపించుకంది. బీబీసీ గుజరాతీ, బీబీసీ పంజాబీ సర్వీసులు కూడా దాదాపు 75 శాతం ఆడియన్స్‌ను పెంచుకున్నాయి.

నిష్పక్షపాత వార్తలు, సాహసోపేత జర్నలిజానికి బీబీసీ మారుపేరుగా నిలుస్తోంది
ఫొటో క్యాప్షన్, నిష్పక్షపాత వార్తలు, సాహసోపేత జర్నలిజానికి బీబీసీ మారుపేరుగా నిలుస్తోంది

"భారతదేశంలో బీబీసీకి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలో పోలరైజేషన్‌, మిస్‌ఇన్‌ఫర్మేషన్‌ వేగంగా విస్తరిస్తున్న కాలంలో ప్రస్తుత పరిణామాలను అర్థం చేసుకోవడంలో ఆడియన్స్‌కు బీబీసీ సహకరిస్తోంది" అని బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్‌ హెడ్‌ రూపా ఝా అన్నారు.

"ఆడియన్స్‌కు సమాచారం అందించడం, అవగాహన కల్పించడం, ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచడంలో బీబీసీ ఇంతకుముందు కంటే మరింత ప్రగతి సాధించింది.

బీబీసీ డైరక్టర్‌ జనరల్‌ టిమ్‌ డేవి
ఫొటో క్యాప్షన్, బీబీసీ డైరక్టర్‌ జనరల్‌ టిమ్‌ డేవి

ప్రపంచవ్యాప్తంగా మా ఆడియన్స్‌ పెరుగుతున్నారు. వచ్చే ఏడాది మా వందో వార్షికోత్సవానికి 50 కోట్లమందిని చేరాలన్నది లక్ష్యం. గత దశాబ్దంలో మా ఆడియన్స్‌ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగారు. దీనినిబట్టి బీబీసీకి ఉన్న ప్రామాణికత, విశ్వసనీయతను ఏంటో అర్ధం చేసుకోవచ్చు"అని బీబీసీ డైరక్టర్‌ జనరల్‌ టిమ్‌ డేవీ అన్నారు.

"ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ఆడియన్స్‌ రికార్డు స్థాయిలో పెరిగారు. నిష్పాక్షికమైన వార్తలు, సమాచారం ఇవ్వడంలో మాకు సాటి మరెవరూ లేరు. కోవిడ్‌-19, సంక్షోభాలు, ఎన్నికల్లాంటి సందర్భాల్లో మేమిచ్చే సమాచారం ఎక్కువమందికి ఉపయోగపడుతోంది" అని బీబీసీ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ సీనియర్ కంట్రోలర్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌ డైరక్టర్‌ లిలియానే ల్యాండర్‌ అన్నారు.

లండన్‌లోని బీబీసీ కార్యాలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని బీబీసీ కార్యాలయం

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ఆరణ పెరగడానికి కారణమైన అంశాలు

  • వరల్డ్ సర్వీస్‌ లాంగ్వేజెస్‌లో వృద్ధి: ఈ సంవత్సరం బీబీసీ ఆడియన్స్‌ పెరుగుదలలో లాంగ్వేజెస్ డివిజన్‌ కీలకంగా మారింది. ఇందులో 2 కోట్లమంది వరకు ఆడియన్స్‌ పెరిగారు (+7%). లాంగ్వేజెస్‌ సర్వీస్‌లలో వీక్లీ ఆడియన్స్‌ 31.3 కోట్లకు పెరిగారు.
  • డిజిటల్‌లో పెరుగుదల: యూకే వెలుపల బీబీసీ డిజిటల్ విభాగంలో వేగవంతమైన పెరుగుదల కొనసాగుతోంది. అన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో 23% పెరుగుదలతో వీక్లీ సరాసరిన 18.6 కోట్లమంది ఆడియెన్స్‌ను చేరుకుంది.
  • కొత్త లాంగ్వేజ్‌ సర్వీసుల్లో మెరుగైన ప్రదర్శన: కొత్త లాంగ్వేజ్‌ సర్వీసుల్లో డిటిజల్‌ సర్వీసుల పెర్ఫార్మెన్స్ బాగుంది. దీంతో వరల్డ్‌ సర్వీస్‌ వీక్లీ రీచ్‌లో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల వాటా 39% ఉంది. (అన్నీ బీబీసీ న్యూస్‌ను కలుపుకొంటే 41%)
  • 2020 నుంచి బీబీసీ.కామ్‌ లో 80 లక్షల ఆడియన్స్‌ పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం అది 4 కోట్ల ఆడియన్స్‌ను చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కవరేజ్‌ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించింది.
  • బీబీసీ స్టూడియోస్‌ ఇంటర్నేషనల్ చానెల్స్‌ 6.5 కోట్ల ఆడియన్స్‌ను చేరుకుంది. ఇందులో 1.6 కోట్ల ఆడియన్స్ వృద్ధి ఉంది.
  • బీబీసీ మీడియా యాక్షన్‌, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక విలువలు, అభివృద్ధి కోసం సమాచారం అందించే బీబీసీ ఇంటర్నేషనల్ చారిటీ సంస్థ జీఏఎంకు తన వాటాను 50 లక్షల నుంచి 2.3 కోట్లకు పెంచింది.
వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌ సంక్షోభం: ‘మానవ హక్కులు, పేదరికం గురించి మాట్లాడే దేశాలు ఎక్కడ?’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)