టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియా విజయం - Newsreel

ఫొటో సోర్స్, AAMIR QURESHI/gettyimages
ఐసీసీ ప్రపంచకప్ గ్రూప్-1 లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) అర్ధసెంచరీతో చెలరేగడంతో మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్లతో విజయం సాధించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ 2, దసున్ షనక ఒక వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు సాధించింది బ్యాట్స్‌మెన్ కుశాల్ పెరీరా (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), చరిత్ అసలంకా (27 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), భానుక రాజపక్స (26 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలా 2 వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆడమ్ జంపాకు లభించింది.
వార్నర్ హాఫ్ సెంచరీ
155 పరుగుల లక్ష్యఛేదనను ఆస్ట్రేలియా ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్లు వార్నర్, ఆరోన్ ఫించ్ చెలరేగి ఆడారు.
తొలి ఓవర్లోనే ఫించ్ రెండు బౌండరీలు బాదగా, మరుసటి ఓవర్‌లో మరో ఫోర్ కొట్టాడు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఫించ్ వరుసగా 4,6 ... వార్నర్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి.
ఆ తర్వాతి ఓవర్‌లో ఫించ్ లాంగాన్ మీదుగా మరో సిక్సర్, ఫోర్ బాదడంతో పవర్ ప్లేలో ఆస్ట్రేలియా 63/0 పరుగులు చేసింది.
కాసేపటికే ఫించ్ అవుటైనప్పటికీ, వార్నర్ జోరు మాత్రం తగ్గలేదు. వ్యక్తిగత స్కోరు 18 పరుగుల వద్ద వార్నర్ అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. వికెట్ కీపర్ కుశాల్ పెరీరా క్యాచ్ వదిలేయడంతో వార్నర్ బతికిపోయాడు. పించ్ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ (5) నిరాశపరిచాడు.
స్మిత్ (26 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన వార్నర్ 31 బంతుల్లోనే అర్ధసెంచరీని అందుకున్నాడు. ఓ ఎండ్‌లో స్మిత్ ఆచితూచి ఆడుతున్నప్పటికీ, వార్నర్ అప్పుడప్పుడు బౌండరీలతో అలరించాడు.
ఈ జంట 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక... షనక బౌలింగ్‌లో రాజపక్స అద్భుత క్యాచ్ అందుకోవడంతో వార్నర్ పెవిలియన్ చేరాడు. అప్పటికీ ఆసీస్ విజయానికి 30 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి ఉంది.
ఇక మిగతా లాంఛనాన్ని స్టొయినిస్ (7 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేశాడు. మరో 18 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించాడు.

ఫొటో సోర్స్, Getty Images
లంక జట్టులో రాణించిన అసలంకా, పెరీరా
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మూడో ఓవర్‌లోనే ఓపెనర్ పథుమ్ నిసంక (7) వికెట్‌ను కోల్పోయింది.
వన్‌డౌన్‌లో వచ్చిన అసలంకా దూకుడు ప్రదర్శించాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఫోర్‌తో పాటు మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో 6, 4తో మొత్తం 16 పరుగులు రాబట్టాడు. అనంతరం హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో మరో బౌండరీ బాదాడు.
అసలంకా అండగా పెరీరా కూడా నెమ్మదిగా దూకుడు పెంచాడు. కమిన్స్ బౌలింగ్‌లో ఒక ఫోర్, స్టొయినిస్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు.
ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని జంపా విడగొట్టాడు. జట్టు స్కోరు 78 పరుగుల వద్ద అసలంకా అవుటయ్యాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 44 బంతుల్లో 63 పరుగులు జోడించారు.
మరుసటి ఓవర్లోనే పెరీరా కూడా పెవిలియన్ చేరాడు. స్టార్క్ బౌలింగ్‌లో స్టాండ్స్‌లోకి భారీ సిక్సర్ బాదిన పెరీరా, తర్వాతి బంతికే దొరికిపోయాడు. 144కి.మీ వేగంతో స్టార్క్ సంధించిన అద్భుతమైన ఇన్‌స్వింగింగ్ యార్కర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు.
అవిష్క ఫెర్నాండో (4), వనిందు హసరంగ డి సిల్వా (4) వెంటవెంటనే అవుటయ్యారు.
ఓవైపు దసున్ షనక (12) పరుగులు చేయడానికి తడబడుతుంటే, క్రీజులోకి వచ్చిన రాజపక్స మాత్రం ధాటిగా ఆడాడు. స్టొయినిస్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో చెలరేగాడు. దీంతో ఆ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి.
ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. షనక వికెట్ తీయడంతో పాటు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో చివరి రెండు ఓవర్లలో లంక కేవలం రెండు ఫోర్లు మాత్రమే కొట్టగలిగింది.

ఫొటో సోర్స్, ANI
ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో బెయిల్
ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది.
మంగళవారం నుంచి బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆయనకు బెయిలు మంజూరు చేస్తున్నట్లు కోర్టు గురువారం ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అర్బాజ్ మర్చెంట్, మున్మున్ ధర్మేచాలకు కూడా కోర్టు బెయిలు మంజూరు చేసింది.
ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మూడు రోజుల విచారణ అనంతరం ఆర్యన్, అర్బాజ్, మున్మున్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ముకుల్ రోహత్గీ తెలిపారు. రేపు లేదా శనివారం వీరంతా బయటకు వచ్చే అవకాశముందని రోహత్గీ వివరించారు.

ఫొటో సోర్స్, Instagram
అక్టోబర్ 2 నుంచి..
ముంబయిలోని ఒక క్రూయిజ్ షిప్‌లో అక్టోబర్ 2వ తేదీ అర్థరాత్రి జరిగిన పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు దాడి చేశారు.
ఆ షిప్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారం తమకు అందిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.
ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఆ ఎనిమిది మందిలో ఉన్నట్లు ఎన్‌సీబీ ముంబయి డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు.
అర్యన్ ఖాన్‌తో పాటు అరెస్ట్ అయిన వారిలో అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నారని ఎన్‌సీబీ ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
కిరణ్ గోసావికి 8 రోజుల రిమాండ్
మరోవైపు క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో కీలక సాక్షి కిరణ్ గోసావికి పుణెలోని ఓ న్యాయస్థానం 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
కిరణ్‌ను అరెస్ట్ చేసిన పుణె పోలీసులు ఆయనపై చీటింగ్, ఇతర అభియోగాలతో కేసు నమోదు చేశారు.
ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు కిరణ్ క్రూయిజ్ వద్దే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అనంతరం కిరణ్ పరారు కాగా గురువారం పుణె పోలీసులకు చిక్కాడు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








