వైఎస్ విజయమ్మ సారథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్మరణ సభ

వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సమావేశం హైదరాబాద్‌లో కొనసాగుతోంది.
పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులను ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించారు.
అహ్వానాలు అందుకున్న వారిలో వైఎస్‌ఆర్‌తో కలిసి పనిచేసినవారు, ఆయన కుటుంబ సన్నిహితులతో పాటు సినీ, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.
వైఎస్‌ఆర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న కేవీపీ రామచంద్రరావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సునితా లక్ష్మారెడ్డి, కె. ఆర్. సురేష్ రెడ్డి, డి. శ్రీనివాస్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు టి. జీవన్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలతోపాటూ సినీ పరిశ్రమకు చెందిన పలువురికి ఆహ్వానం పంపించారు.

కేవీపీ, రఘువీరారెడ్డి, కోమెట్ రెడ్డి బ్రదర్స్, ఉండవల్లి, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి, కొందరు మాజీ ఐఏఎస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.
500 మందికి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. కానీ వారిలో చాలా మంది సమావేశానికి రాలేదు.
కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లొద్దని టీపీసీసీ సూచించింది. ఒకవేళ ఎవరైనా వెళ్లితే అది వారి వ్యక్తిగతమని పేర్కొంది.

ఓవైపు ఈ ఆత్మీయ సమ్మేళనం రాజకీయేతర సమావేశమని చెబుతున్నా, అంతర్గత ఎజెండా మాత్రం రాజకీయమే అనే చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా తెలంగాణలో కూతురు వైఎస్ షర్మిలను రాజకీయంగా నిలబెట్టేందుకు విజయమ్మ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి.
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








