కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం - Newsreel

యడియూరప్ప, ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలతో బసవరాజ్ బొమ్మై

ఫొటో సోర్స్, Basavaraj Bommai's office

ఫొటో క్యాప్షన్, యడియూరప్ప, ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలతో బసవరాజ్ బొమ్మై (మధ్యలో)

కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు.

కర్ణాటక బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నిన్న బసవరాజ్ ఎస్.బొమ్మైని తమ నేతగా ఎన్నుకుంది. దీంతో ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కర్ణాటక బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో తదుపరి నేతగా బసవరాజ్ పేరును యడియూరప్ప స్వయంగా ప్రతిపాదించారు.

యడియూరప్ప, బీజేపీ నేషనల్ సెక్రటరీ సీటీ రవితో కలిసి బసవరాజ్ బొమ్మై గవర్నర్ తవార్ చంద్ గహ్లోత్‌ను కలిశారు.

ఇది చాలా పెద్ద బాధ్యతని, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని బసవరాజ్‌ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బసవరాజ్ ఎవరు

ఇటీవల రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్పకు అత్యంత విశ్వాసపాత్రుడిగా బసవరాజ్ బొమ్మైకి పేరుంది. గతంలో ఆయన మంత్రి వర్గంలో బసవరాజ్ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై కుమారుడైన బసవరాజ్, ఇటీవలే జనతాదళ్ (సెక్యులర్) నుంచి బైటికి వచ్చి బీజేపీలో చేరారు.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన బసవరాజ్‌ గతంలో పుణెలోని టాటా మోటార్స్‌లో మూడేళ్ల పాటు పని చేశారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా సీఎం పీఠాన్ని అధిరోహించిన రెండో వ్యక్తి బసవరాజ్‌ బొమ్మై. గతంలో హెచ్‌.డి. కుమారస్వామికి ఆ ఘనత ఉంది.

కంగనా రనౌత్‌ తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ జావేద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేశారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కంగనా తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ జావేద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేశారు

కోర్టుకు రాకపోతే అరెస్టుకు అవకాశం-కంగనా రనౌత్ కు ఆఖరి ఛాన్స్ ఇచ్చిన జడ్జి

పరువు నష్టం కేసులో తదుపరి విచారణకు హాజరు కాకపోతే కంగనా రనౌత్ అరెస్ట్ వారెంట్‌కు పిటిషన్ పెట్టుకోవచ్చని అంధేరి మెట్రోపాలిటన్ కోర్టు జావేద్ అఖ్తర్ కు అనుమతి ఇచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

కంగనా రనౌత్‌పై గీత రచయిత, కవి జావేద్ అఖ్తర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం తన ఎదుట హాజరు అయ్యేందుకు కంగనాకు కోర్టు "చివరి అవకాశం" ఇచ్చింది.

పదేపదే విచారణకు హాజరుకాని కంగనా పై అరెస్టు వారెంట్ జారీ చేయాలని అఖ్తర్ కోర్టును కోరగా అందుకు నిరాకరించిన న్యాయమూర్తి ఆర్ఆర్ ఖాన్ , తదుపరి విచారణకు కంగనా రాకపోతే ఆమె పై అరెస్ట్ వారెంట్‌కు పిటీషన్ పెట్టుకోవచ్చని సూచించారు.

మంగళవారం కోర్టులో అఖ్తర్ పిటిషన్ పై విచారణ జరిగింది. వ్యక్తిగత కారణాల రీత్యా తన క్లయింట్ కంగనా రనౌత్ కోర్టుకు నేరుగా హాజరు కాలేరని, అందుకు మినహాయింపు కోరుతూ ఆమె తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

అయితే, కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. మినహాయింపు దరఖాస్తుకు ఇది "చివరి అవకాశం" అని, తదుపరి విచారణకు కంగనా తప్పనిసరిగా హాజరు కావాలని జడ్జి తెలిపారు.

ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 1వ తేదీన ఉంటుంది.

తన పరువు ప్రతిష్టలను దెబ్బ తీసే విధంగా కంగనా ఒక టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారని గత ఏడాది నవంబర్‌లో జావేద్ అఖ్తర్ కోర్టులో కేసు వేశారు.

కిందటి ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత, కంగనా ఒక టీవీ షోలో మాట్లాడుతూ బాలీవుడ్‌లో ఒక "గుంపు" ఉందంటూ తన పేరు ప్రస్తావించారని అఖ్తర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: