రాందేవ్ 25 ప్రశ్నలు: 'క్రూరులను మళ్లీ మామూలు మనుషులుగా మార్చే మందు అల్లోపతీలో ఉందా'.

ఫొటో సోర్స్, BURHAAN KINU/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
అల్లోపతీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న యోగా గురు రాందేవ్ ఆ తరువాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫార్మా కంపెనీలకు 25 ప్రశ్నలతో ఒక బహిరంగ లేఖ రాశారు.
పతంజలి యోగపీఠ్ తరఫున ఆయన ఈ ప్రశ్నలు అడిగారు. రకరకాల వ్యాధులకు అల్లోపతీలో శాశ్వత పరిష్కారం ఉందా అని రాందేవ్ అందులో ప్రశ్నలు వేశారు.
కొన్ని అనారోగ్య సమస్యలకు మందులు తయారు చేయగలవా అని ఫార్మా కంపెనీలను అడిగారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాందేవ్ అడిగిన కొన్ని ప్రశ్నలు
- అల్లోపతీలో హైపర్‌టెన్షన్(బీపీ), దాని వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్‌కు ఉన్న శాశ్వత పరిష్కారం ఏంటి.
- అల్లోపతీలో టైప్-1, టైప్-2 డయాబెటిస్ కోసం ఉన్న శాశ్వత పరిష్కారం ఏంటి?
- థైరాయిడ్, ఆర్థరైటిస్, డయాబెటిస్, ఆస్థమా లాంటి అనారోగ్య సమస్యలకు ఫార్మా పరిశ్రమ దగ్గర ఉన్న శాశ్వత పరిష్కారం ఏంటి?
- నిద్రలేమికి మీరు ఇచ్చే మందులు ఐదారు గంటలే పనిచేస్తాయి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీనికి అల్లోపతీలో ఏదైన శాశ్వత పరిష్కారం ఉందా?
- ఒత్తిడి తగ్గించి, మనిషికి ప్రశాంతత కలిగించేలా హాపీ, గుడ్ హార్మోన్లు పెంచడానికి ఫార్మా పరిశ్రమ దగ్గర ఏదైనా మందు ఉందేమో చెప్పాలి?
- హార్ట్ బ్లాకేజ్‌ను రివర్స్ చేయడానికి పరిష్కారం ఏంటి. బైపాస్, ఆపరేషన్, యాంజియోప్లాస్ట్ అవసరం లేకుండా ఫార్మా పరిశ్రమ దగ్గర శాశ్వత పరిష్కారం ఏముంది?
లేఖలో మరికొన్ని ప్రశ్నలు
- కొందరు మనుషుల్లో చాలా హింస, క్రూర స్వభావం ఉంటోంది. అలాంటివారిని మళ్లీ మామూలు మనిషిగా మార్చడానికి అల్లోపతీలో ఏదైనా మందు ఉందేమో చెప్పాలి?
- అల్లోపతీ సర్వశక్తివంతమైనది, సర్వగుణ సంపన్నమైనది అయితే అల్లోపతీ డాక్టర్లు అసలు అనారోగ్యానికి గురికాకూడదు కదా?
- ఏజింగ్ ప్రాసెస్‌ను రివర్స్ చేయడానికి ఫార్మా పరిశ్రమ దగ్గర ఏదైనా మందు ఉందా?
- మనుషుల డ్రగ్ అడిక్షన్, మద్యం మత్తు వదిలేలా అల్లోపతీలో ఏదైనా మందు ఉందా?
- అల్లోపతీ, ఆయుర్వేదం మధ్య గొడవ సమసిపోయేలా ఫార్మా పరిశ్రమ దగ్గర ఏదైనా మందుందా?
- కరోనా రోగికి ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండా, ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి ఫార్మా పరిశ్రమ దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పాలి?

ఫొటో సోర్స్, DR. HARSHWARDHAN/TWITTER
ఆరోగ్య శాఖ మంత్రి లేఖ
రాందేవ్ ఈ ప్రశ్నలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
సోమవారం రాత్రి న్యూస్ చానళ్లలో ఐఎంఏ సభ్యులు, రాందేవ్ మధ్య ఈ ప్రశ్నలపై చర్చ జరగడం కూడా కనిపించింది.
అంతకు ముందు ఆదివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాందేవ్‌కు ఒక లేఖ రాశారు. అల్లోపతీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








