కరోనావైరస్ వ్యాక్సీన్: ప్రపంచవ్యాప్తంగా టీకాల పంపిణీ ఎలా సాగుతోంది?

కోవిడ్‌-19, వ్యాక్సినేషన్‌, కోవ్యాక్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేద దేశాలకు వ్యాక్సీన్‌లు ఆలస్యంగా అందుతున్నాయి.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుండగా చాలామంది నుంచి ఒక ప్రశ్న వినిపిస్తోంది. 'నావంతు ఎప్పుడు' అని.

కోవిడ్‌కు వ్యాక్సీన్‌ పొందడమనేది ఇప్పుడు చాలామందికి జీవన్మరణ సమస్య. చాలా కొద్దిదేశాలు ఇప్పటికే టార్గెట్‌లు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం టీకా ప్రక్రియను నడిపిస్తుండగా, చాలా దేశాలలో ఈ ప్రణాళికలు అంత స్పష్టంగా లేవు.

నాకు వ్యాక్సీన్‌ ఎప్పుడు ఇస్తారు ?

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీన్ల ప్రక్రియ ప్రారంభం

స్క్రోల్ టేబుల్
ప్రపంచం
61
12120524547
చైనా
87
3403643000
భారత్
66
1978918170
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
67
596233489
బ్రెజిల్
79
456903089
ఇండోనేసియా
61
417522347
జపాన్
81
285756540
బంగ్లాదేశ్
72
278785812
పాకిస్తాన్
57
273365003
వియత్నాం
83
233534502
మెక్సికో
61
209179257
జర్మనీ
76
182926984
రష్యా
51
168992435
ఫిలిప్పీన్స్
64
153852751
ఇరాన్
68
149957751
యునైైటెడ్ కింగ్‌డమ్
73
149397250
టర్కీ
62
147839557
ఫ్రాన్స్
78
146197822
థాయిలాండ్
76
139099244
ఇటలీ
79
138319018
దక్షిణ కొరియా
87
126015059
అర్జెంటీనా
82
106075760
స్పెయిన్
87
95153556
ఈజిప్ట్‌
36
91447330
కెనడా
83
86256122
కొలంబియా
71
85767160
పెరూ
83
77892776
మలేసియా
83
71272417
సౌదీ అరేబియా
71
66700629
మియన్మార్
49
62259560
చిలీ
92
59605701
తైవాన్
82
58215158
ఆస్ట్రేలియా
84
57927802
ఉజ్బెకిస్తాన్
46
55782994
మొరాకో
63
54846507
పోలండ్
60
54605119
నైజీరియా
10
50619238
ఇథియోపియా
32
49687694
నేపాల్
69
46888075
కంబోడియా
85
40956960
శ్రీలంక
68
39586599
క్యూబా
88
38725766
వెనెజువెలా
50
37860994
దక్షిణాఫ్రికా
32
36861626
ఈక్వెడార్
78
35827364
నెదర్లాండ్స్
70
33326378
ఉక్రెయిన్
35
31668577
మొజాంబిక్
44
31616078
బెల్జియం
79
25672563
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
98
24922054
పోర్చుగల్
87
24616852
రువాండా
65
22715578
స్వీడన్
75
22674504
ఉగాండా
24
21756456
గ్రీస్
74
21111318
కజకిస్థాన్
49
20918681
అంగోలా
21
20397115
ఘానా
23
18643437
ఇరాక్
18
18636865
కెన్యా
17
18535975
ఆస్ట్రియా
73
18418001
ఇజ్రాయెల్
66
18190799
గ్వాటెమలా
35
17957760
హాంకాంగ్
86
17731631
చెక్ రిపబ్లిక్
64
17676269
రొమేనియా
42
16827486
హంగేరీ
64
16530488
డొమినికన్ రిపబ్లిక్
55
15784815
స్విట్జర్లాండ్
69
15759752
అల్జీరియా
15
15205854
హోండూరస్
53
14444316
సింగపూర్
92
14225122
బొలీవియా
51
13892966
తజకిస్తాన్
52
13782905
అజర్‌బైజాన్
47
13772531
డెన్మార్క్
82
13227724
బెలారస్
67
13206203
ట్యునీషియా
53
13192714
ఐవరీ కోస్ట్
20
12753769
ఫిన్లాండ్
78
12168388
జింబాబ్వే
31
12006503
నికరాగువా
82
11441278
నార్వే
74
11413904
న్యూజీలాండ్
80
11165408
కోస్టారికా
81
11017624
ఐర్లాండ్
81
10984032
ఎల్ సాల్వడార్
66
10958940
లావోస్
69
10894482
జోర్డాన్
44
10007983
పరాగ్వే
48
8952310
టాంజానియా
7
8837371
ఉరుగ్వే
83
8682129
సెర్బియా
48
8534688
పనామా
71
8366229
సూడాన్
10
8179010
కువైట్
77
8120613
జాంబియా
24
7199179
తుర్కమెనిస్తాన్
48
7140000
స్లొవాకియా
51
7076057
ఒమన్
58
7068002
ఖతార్
90
6981756
అఫ్ఘానిస్తాన్
13
6445359
గినియా
20
6329141
లెబనాన్
35
5673326
మంగోలియా
65
5492919
క్రొయేషియా
55
5258768
లిథువేనియా
70
4489177
బల్గేరియా
30
4413874
సిరియా
10
4232490
పాలస్తీనా భూభాగం
34
3734270
బెనిన్
22
3681560
లిబియా
17
3579762
నైజర్
10
3530154
కాంగో
2
3514480
సియెర్రా లియోన్
23
3493386
బహ్రెయిన్
70
3455214
టోగో
18
3290821
కిర్గిస్తాన్
20
3154348
సోమాలియా
10
3143630
స్లొవేనియా
59
2996484
బుర్కీనా ఫాసో
7
2947625
అల్బేనియా
43
2906126
జార్జియా
32
2902085
లాత్వియా
70
2893861
మౌరిటానియా
28
2872677
బోట్స్‌వానా
63
2730607
లైబీరియా
41
2716330
మారిషస్
74
2559789
సెనెగల్
6
2523856
మాలి
6
2406986
మడగాస్కర్
4
2369775
చాద్
12
2356138
మలావి
8
2166402
మాల్డోవా
26
2165600
ఆర్మేనియా
33
2150112
ఎస్తోనియా
64
1993944
బోస్నియా & హెర్జ్‌గొవీనా
26
1924950
భూటాన్
86
1910077
ఉత్తర మాసిడోనియా
40
1850145
కామెరూన్
4
1838907
కొసావో
46
1830809
సైప్రస్
72
1788761
తిమోర్-లెస్టె
52
1638158
ఫిజీ
70
1609748
ట్రినిడాడ్ & టొబాగో
51
1574574
జమైకా
24
1459394
మకావొ
89
1441062
మాల్టా
91
1317628
లక్సెంబర్గ్
73
1304777
దక్షిణ సుడాన్
10
1226772
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
22
1217399
బ్రూనై
97
1173118
గయానా
58
1011150
మాల్దీవులు
71
945036
లెసోతో
34
933825
యెమెన్
1
864544
రిపబ్లిక్ ఆఫ్ కాంగో
12
831318
నమీబియా
16
825518
గాంబియా
14
812811
ఐస్‌లాండ్
79
805469
కేప్ వర్డి
55
773810
మాంటినిగ్రో
45
675285
కొమొరోస్
34
642320
పపువా న్యూగినీ
3
615156
గినియా-బిస్సావు
17
572954
గబాన్
11
567575
ఇ స్వటిని
29
535393
సురినామ్
40
505699
సమోవా
99
494684
బెలిజ్
53
489508
ఈక్వటోరియల్ గినియా
14
484554
సోలొమన్ దీవులు
25
463637
హైతీ
1
342724
బహమాస్
40
340866
బార్బడోస్
53
316212
వనౌతు
40
309433
టోంగా
91
242634
జెర్సీ
80
236026
జిబౌటీ
16
222387
సీషెల్స్
82
221597
సావొటోమ్ & ప్రిన్సిపె
44
218850
ఐల్ ఆఫ్ మన్
79
189994
గెర్న్‌సే
81
157161
ఆండొరా
69
153383
కిరిబాతి
50
147497
కేమెన్ దీవులు
90
145906
బెర్ముడా
77
131612
ఆంటిగ్వా& బార్బడా
63
126122
సెయింట్ లూసియా
29
121513
జిబ్రాల్టర్
123
119855
ఫారో దీవులు
83
103894
గ్రెనడా
34
89147
గ్రీన్‌లాండ్
68
79745
సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్
28
71501
లిక్చిమ్‌స్టెయిన్
69
70780
టర్క్స్ & కైకోస్ దీవులు
76
69803
శాన్ మారినో
69
69338
డొమినికా
42
66992
మొనాకో
65
65140
సెయింట్ కిట్స్ & నెవిస్
49
60467
బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్
59
41198
కుక్ దీవులు
84
39780
అంగ్విల్లా
67
23926
నౌరూ
79
22976
బురుండి
0.12
17139
టువలు
52
12528
సెయింట్ హెలినా
58
7892
మాంట్‌సెరాట్
38
4422
ఫాక్‌లాండ్ దీవులు
50
4407
నియూ
88
4161
టొకెలు
71
1936
పిట్ కెయిర్న్
100
94
ఉత్తర కొరియా
0
0
ఎరిత్రియా
0
0
దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు
0
0
బ్రిటిష్ హిందూ మహాసముద్ర భూభాగం
0
0
వాటికన్
0
0

పూర్తిస్థాయి ఇంటరాక్టివ్ చూసేందుకు దయచేసి మీ బ్రౌజర్‌ని అప్‌గ్రేడ్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ఎలా కొనసాగుతుందో ఒక్కసారి చూద్దాం.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీన్ల ప్రక్రియ ప్రారంభం

అమెరికా, ట్రంప్‌, బ్రిటన్‌, కోవిడ్‌ వ్యాక్సీన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్‌ను పొందడంలో అమెరికా, బ్రిటన్‌లు ముందున్నాయి.

ఇప్పటి వరకు ఎన్ని వ్యాక్సీన్‌లు ఇచ్చారు?

ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో వివిధ కంపెనీలు తయారు చేసిన సుమారు 300 మిలియన్‌ డోసుల కరోనా వైరస్‌ను ఇప్పటి వరకు ఇచ్చారు. ఇది చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమంగా చెబుతున్నారు.

చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్‌ బైటపడి ఏడాది గడవక ముందే దానికి వ్యాక్సీన్‌ సిద్ధమైంది. చాలా దేశాల తమ జనాభాకు తగినట్లుగా టీకా డోసులను తెప్పించుకోగా, మరికొన్ని దేశాలకు అది ఇంకా చేరలేదు.

తొలిదశలో భాగంగా చాలా దేశాలు ఒక క్రమపద్ధతిలో వ్యాక్సీన్‌లను ఇచ్చుకుంటూ వచ్చాయి. ఆ క్రమం ఇలా ఉంది.

  • 60 ఏళ్లు పైబడిన వారు
  • ఆరోగ్య కార్యకర్తలు
  • తీవ్ర ఆరోగ్య సమస్యల్లో ఉన్నవారు

ఇప్పటికే వ్యాక్సీన్‌ కార్యక్రమం నడుస్తున్న ఇజ్రాయెల్, యూకేలాంటి దేశాలలో ఆసుపత్రులకు వచ్చే కోవిడ్‌ రోగుల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. అలాగే మరణాలు, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ సంఖ్య కూడా తగ్గింది.

అయితే యూరప్‌, అమెరికా ఖండాల్లోని చాలా దేశాల్లో వ్యాక్సినేషన్‌ నడుస్తుండగా, ఆఫ్రికా ఖండంలోని చాలా కొద్దిదేశాల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ)కు చెందిన అగాథే డెమరైజ్‌ సమగ్ర పరిశోధన చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంత టీకా తయారవుతోంది, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఆయా దేశాల జనాభా ఎంత, వ్యాక్సీన్‌ను కొనగల సమర్ధత ఎంత అన్న అంశాలను ఈ రీసెర్చ్‌ పరిశీలించింది.

టీకా విషయంలో పేద-ధనిక దేశాల మధ్య అంతరాలు ఉంటాయన్న ఊహాగానాలకు తగ్గట్టుగానే ఈ పరిశోధనా ఫలితాలు కూడా కనిపించాయి. యూకే, యూఎస్‌ దేశాలలో సరిపడినంత వ్యాక్సీన్ ఉంది.

ఈ రెండు దేశాలు వ్యాక్సీన్‌ తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. సహజంగానే వీరికి అగ్రభాగం దక్కింది. కెనడా, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన దేశాలు వీటి తర్వాతి స్థానంలో నిలుస్తున్నాయి.

చాలా పేద దేశాలలో ఇంకా వ్యాక్సీనేషన్‌ ప్రక్రియ మొదలే కాలేదు.

అడార్‌ పూనావాలా, సీరం ఇనిస్టిట్యూట్‌. ఆస్ట్రాజెనెకా, కోవిడ్‌ వ్యాక్సీన్‌
ఫొటో క్యాప్షన్, అడార్‌ పూనావాల కంపెనీ సీరం ఇనిస్టిట్యూట్‌ భారీ ఎత్తున వ్యాక్సీన్‌ తయారు చేస్తోంది

ధనిక దేశాలు టీకాను నిల్వ చేస్తున్నాయా?

దేశ జనాభాకన్నా ఐదింతలు ఎక్కువ వ్యాక్సీన్‌ను నిల్వ చేసిందని కెనడాపై విమర్శలు వచ్చాయి. అయితే వారికి అందాల్సినంత వ్యాక్సీన్‌ ఇంకా అందనేలేదు.

అమెరికా నుంచి ఎక్స్‌పోర్ట్‌పై ట్రంప్‌ బ్యాన్‌ విధిస్తారనే అనుమానంతో వ్యాక్సీన్‌ సరఫరాకు ఐరోపా దేశాలను నమ్ముకుంది కెనడా. అక్కడి ఫార్మా కంపెనీలకు ఆర్డర్‌లు ఇచ్చింది.

కానీ కెనడా ఆలోచన ఫలించ లేదు. ఆ దేశానికి అవసరమైన వ్యాక్సీన్‌ను అందించడంలో ఫార్మా కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి.

చిత్రంగా అమెరికాకన్నా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలే వ్యాక్సీన్‌ ఎగుమతులపై నిషేధాలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు టీకా ఎగుమతిని ఇటలీ ఇప్పటికే బ్యాన్‌ విధించింది.

కరోనా వ్యాక్సీన్‌, వ్యాక్సినేషన్‌, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌
ఫొటో క్యాప్షన్, వ్యాక్సీన్‌ పొందడంలో పేద ధనిక దేశాల మధ్య అంతరం కనబడిందని ఈఐయూ గుర్తించింది.

కొన్నిదేశాల్లో ఉధృతంగా వ్యాక్సినేషన్‌

యూరోపియన్‌ యూనియన్‌లోని సైబీరియా తమ దేశంలో ఎక్కువమందికి ఇప్పటికే టీకాను ఇవ్వగలిగింది. అయితే ఇది ఆ దేశపు సమర్ధత అనడంకన్నా వ్యాక్సీన్‌ డిప్లొమసీ కారణంగా పొందిన లబ్ధి అనవచ్చు.

తూర్పు ఐరోపా దేశాలకు వ్యాక్సీన్‌ సరఫరా చేయడంలో రష్యా, చైనాలు పోటీపడ్డాయి. సైబీరియాకు చైనా నుంచి సినోఫామ్‌, రష్యా నుంచి స్ఫుత్నిక్‌-వి, జర్మనీ, అమెరికాల నుంచి ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌లు అందాయి. అయితే ఎక్కువమంది చైనా తయారీ సినోఫామ్‌ టీకానే పొందారు.

వ్యాక్సీన్‌ దౌత్యం అంటే ఏంటి?

చైనా ఎప్పటిలాగా తన వ్యాక్సీన్‌ను మార్కెట్‌ చేసుకోవడంలో ముందుంది. ఆ దేశం నుంచి మొదటి రెండు టీకాలను పొందిన దేశాలు భవిష్యత్‌లో అవసరమైతే బూస్టర్‌ వ్యాక్సీన్‌లను కూడా అక్కడి నుంచే పొందనున్నాయి.

సినోఫామ్‌ టీకాను సౌదీ అరేబియా తమ దేశంలోని 80%శాతం మందికి ఇవ్వడమే కాకుండా, అక్కడ కంపెనీ స్థాపనకు చైనాకు అనుమతినిచ్చింది.

"చైనా తమ ఫార్మా కంపెనీలను స్థాపించడం, మానవ వనరులను సమకూర్చడానికి కూడా ముందుకు వస్తుండటంతో దీని ప్రభావం దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది" అని అగాథే డెమరైజ్‌ అన్నారు.

"భవిష్యత్తులో చైనాను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏర్పడుతుంది" అని ఆమె అన్నారు.

ప్రపంచంలో అత్యధిక వ్యాక్సీన్‌ను తయారు చేసిన దేశం తమ దేశంలో అందరికీ ముందుగానే టీకా ఇవ్వగలుగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేస్తున్న భారత, చైనాలు తమ తమ దేశాలలో వ్యాక్సీనేషన్‌ను 2022నాటికిగానీ పూర్తి చేయలేవని ఈఐయూ పరిశోధన వెల్లడించింది.

ఈ రెండు దేశాలో ఎక్కువ జనాభా, తక్కువ వైద్య సిబ్బంది ఉండటమే దీనికి కారణం.

వ్యాక్సినేషన్‌, కోవిడ్‌-19, టీకా,
ఫొటో క్యాప్షన్, కొన్ని దేశాలు వ్యాక్సీన్‌ పట్ల ఆసక్తి చూపించడం లేదు

ఎదురయ్యే సవాళ్లు?

వ్యాక్సీన్‌ తయారీ విషయంలో భారత దేశపు విజయమంతా ఒక వ్యక్తి మీదే ఆధారపడింది. ఆయన పేరే అడార్‌ పూనావాలా. ఆయన నడుపుతున్న సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సీన్‌ తయారీ కంపెనీ.

వ్యాక్సీన్‌లు అసలు పని చేస్తాయో లేదో తెలియని సమయంలో ఆయన తన సొంత డబ్బును పెద్ద ఎత్తున పెట్టుబడిగా పెట్టారు. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబం కూడా ఆందోళన చెందింది.

అయితే ఈ ఏడాది జనవరినాటికి ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సీన్‌ను ఆయన భారత ప్రభుత్వానికి అందించగలిగారు. ప్రస్తుతం ఆయన కంపెనీ రోజుకు 2.4 మిలియన్‌ డోసుల టీకాను తయారు చేస్తోంది.

"భయాలు, ఒత్తిళ్లన్నీ తొలగిపోయాయి. వ్యాక్సీన్‌ను తయారు చేయగలిగాం. కానీ అందరినీ సంతృప్తిపరచడం అసలైన సవాలు" అన్నారు అడార్‌ పూనావాలా.

మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేసుకోవడం ఆయన సక్సెస్‌లో ప్రధాన భూమిక పోషించాయి. వ్యాక్సీన్‌ తయారీ సందర్భంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఏదో ఒకటి ఏ క్షణంలోనైనా ఎదురు కావచ్చు.వాటికి సిద్ధపడి ఉండాలి.

"దీన్ని సైన్సు అనడంకన్నా ఒక కళ అనడం సరిగ్గా సరిపోతుంది" అన్నారు పూనావాలా. టీకాతోపాటు అవసరమైతే కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు బూస్టర్‌లను కూడా తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఆస్ట్రా జెనెకా, సీరం ఇనిస్టిట్యూట్‌

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత్‌, చైనాలలో వ్యాక్సినేషన్‌ పూర్తి కావడానికి 2022 వరకు పట్టవచ్చని అంచనా

కోవాక్స్‌ స్కీమ్‌తో వ్యాక్సినేషన్‌ వేగవంతమవుతుందా?

కోవాక్స్‌ ఫెసిలిటీ అనే స్కీమ్‌ ద్వారా కోవాక్స్‌ టీకాను ముందు భారత్‌కు, ఆ తర్వాత ఆఫ్రికాకు సరఫరా చేసేందుకు తాము కట్టబడి ఉన్నామని పూనావాలా చెప్పారు.

కోవాక్స్‌ టీకా కోసం చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రపంచమంతటికీ ఈ వ్యాక్సీన్‌ అందేలా ఒక ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోంది.

ఐక్య రాజ్య సమితి, గ్లోబల్‌ వ్యాక్సీన్‌ అలయన్స్‌(గావి), కోయిలిషన్‌ ఫర్‌ ఎపిడిమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సెపి) అనే మూడు సంస్థలు సంయుక్తంగా ఈ స్కీమ్‌ను ప్రకటించాయి.

ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలలోని 20% మందికి వ్యాక్సీన్ అందేలా చూడటమే తమ లక్ష్యమని ఈ స్కీమ్‌ ప్రకటించింది. ఈ కోవాక్స్‌ స్కీమ్‌ ద్వారా లబ్ధి పొందిన తొలిదేశం ఘనా.

ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను అందించాలని ఈ స్కీమ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చాలా దేశాలు స్వయంగా ఒప్పందాలకు దిగుతుండటంతో ఈ ప్రయత్నానికి పెద్దగా గుర్తింపు రావడం లేదు.

సొంతంగా వ్యాక్సీన్‌ పొందడానికి ప్రయత్నిస్తున్న పలు ఆఫ్రికన్‌ దేశాలు అడార్‌ పూనావాలాను నిత్యం సంప్రదిస్తున్నాయి. అయితే ఏం జరిగినా కోవాక్స్‌ స్కీమ్‌ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయని అగాథే డెమరైజ్‌ అన్నారు.

అంతా సవ్యంగా జరిగితే ఈ స్కీమ్‌ ఈ ఏడాది చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో 20-27శాతం జనాభాకు వ్యాక్సీన్‌ను అందించే అవకాశం ఉంది.

"ఇది చరిత్ర సృష్టించే అంశం కాకపోవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంటుంది" అని అగాథే అన్నారు. ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ అంచనా ప్రకారం ప్రపంచంలోని పలు పేదదేశాలు 2023నాటి వరకు లేదంటే అసలే టీకాను అందుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు.

టీకా కావాలని అన్ని దేశాలు కోరుకోవడం లేదు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఉన్న కొన్ని దేశాలలో కోవిడ్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. అలాంటి దేశాలు టీకా కోసం తొందర పడటం లేదు.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, టీకాను వద్దంటున్న దేశాలలో కోవిడ్‌ ఎక్కువకాలం మనుగడ సాగిస్తూ కొత్త రూపంలో మిగతా ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. వ్యాక్సీన్‌ తట్టుకునే కొత్త వైరస్‌లు వృద్ధి చెందవచ్చు.

అయితే ఈ వ్యాక్సీన్‌ను అందరికీ ఇవ్వడం అసాధ్యమేమీ కాదు. ప్రస్తుత ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లకు పైగా ఉంది. ఇంత పెద్ద స్థాయిలో టీకాల తయారీ, పంపిణీ చేసిన సందర్భాలు గతంలో లేవు.

వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించాలని అగాథే అంటున్నారు. 'మేం టీకా ఇవ్వలేము' అని ప్రభుత్వాలు ప్రకటించే పరిస్థితి లేదని అగాథే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)