ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు: 81 శాతానికి పైగా పోలింగ్, కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం పోలింగ్ నమోదయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరుపట్ల ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరిగింది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమయ్యింది. 6.30 నుంచే పోలింగ్ బూత్ లలోకి ఓటర్లను అనుమతించారు. ఆ తర్వాత పలు చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
మొదటి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 525 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. 32,502 వార్డు మెంబర్లకు గాను 12,185 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 2,723 గ్రామపంచాయతీలకు, 20,157వార్డు మెంబర్ల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ జరుగుతోంది. నోటా అవకాశం కూడా కల్పించారు.
ఈ ఎన్నికల కోసం 29,732పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధిత ఓటర్ల కోసం చివరి గంట కేటాయించారు. పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యవేక్షించారు. అన్ని చోట్ల పోలింగ్ బూత్ లలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

3.30 గంటల సమయానికి జిల్లాల వారీగా పోలింగ్ శాతం..
శ్రీకాకుళం 77.04%
విశాఖ 82.86%
తూ.గో 82.80%
ప.గో 80.29%
కృష్ణా 85.06%
గుంటూరు 83.04%
ప్రకాశం 80.89%
నెల్లూరు 80.62%
చిత్తూరు 83.47%
కడప 78%
కర్నూలు 83.55%
అనంతపురం 82.30%

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









