కరోనావైరస్: కోవిడ్ నుంచి దాదాపు 95% రక్షణ కల్పిస్తున్న మోడెర్నా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళఘర్
- హోదా, బీబీసీ హెల్త్ కరస్పాండెంట్
కోవిడ్ నుంచి రక్షణ కోసం తాము తయారు చేసిన వ్యాక్సీన్ 95% ఫలితాలనిచ్చిందని అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ మోడెర్నా ప్రకటించింది.
ఇటీవలే ఫైజర్ కంపెనీ కూడా తమ వ్యాక్సీన్ 90%శాతం పని చేస్తోందని ప్రకటించిన నేపథ్యంలో మోడెర్నా సంస్థ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రెండు కంపెనీలు తమ వ్యాక్సీన్ పరిశోధన కోసం వినూత్నమైన రీతిలో ప్రయత్నాలు చేశాయి.
ఈ రోజు తమకు వచ్చిన ఫలితాలను ఎంతో విశేషమైనవని, రాబోయే కొద్ది వారాల్లో వ్యాక్సీన్ తయారీకి ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తామని మోడెర్నా తెలిపింది.
అయితే, ఇది ప్రాథమిక సమాచారమే. మరిన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Moderna
ఈ వ్యాక్సీన్ ఎంత వరకు పని చేస్తుంది?
అమెరికాలో 30,000 మందిపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో సగంమందికి నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల వ్యాక్సీన్ ఇచ్చారు. మిగిలిన వారికి డమ్మీ ఇంజెక్షన్లు ఇచ్చారు.
కోవిడ్-19 లక్షణాలను వృద్ధి చేయడానికి తొలి 95మందిపై చేసిన పరీక్షలను ఆధారం చేసుకుని తాజా విశ్లేషణ చేశారు.
ఇందులో కోవిడ్-19 లక్షణాలున్న 5 గురికి వ్యాక్సీన్‌ను అందించారు. మిగిలిన 90మందికి డమ్మీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్ 94.5% ఫలితాలనిచ్చిందని మోడెర్నా తెలిపింది.
ట్రయల్స్‌లో భాగంగా తీవ్రమైన వైరస్ లక్షణాలున్న 11మందికి కూడా వ్యాక్సీన్ ఇచ్చారని అయితే వారిలో ఎలాంటి మార్పు కనిపించలేదని కంపెనీ తెలిపింది.
“మొత్తంగా చూస్తే వ్యాక్సీన్ పనితీరు బాగుంది’’ అని మోడెర్నా కంపెనీ మెడికల్ ఆఫీసర్ టాల్ జాక్స్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా తెలియాల్సింది ఏంటి?
ఈ వ్యాక్సీన్‌ల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందన్నది తెలుసుకోవాలంటే వాలంటీర్లను నిరంతరం పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి చాలా కాలం పడుతుంది.
ఎక్కువ రిస్క్‌లో ఉండే వృద్ధులలో ఇది కూడా ఇది ప్రభావంవంతంగా పని చేస్తోందని గమనించినప్పటికీ, దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
“వయసు కారణంగా ఈ వ్యాక్సీన్ ప్రభావంలో మార్పు ఉంటుందని చెప్పలేము’’ అని జాక్స్ బీబీసీతో అన్నారు.
ఈ వ్యాక్సీన్, ప్రజలు తీవ్రమైన వ్యాధి లక్షణాలబారిన పడకుండా, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించకుండా నిరోధించగలుగుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికితేనే ఈ వ్యాక్సీన్ ఎంత వరకు ప్రయోజనకరమన్నది తెలుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎంత వరకు సురక్షితం?
సేఫ్టీ విషయంలో ఇప్పటి వరకైతే ఎలాంటి సమస్యా ఎదురు కాలేదు. అయితే, మనుషులు తీసుకునే పారసెటమాల్ సహా చాలా మందులు నూటికి నూరు శాతం సేఫ్ కాదు.
ఈ వ్యాక్సీన్ తీసుకున్న వారిలో కొద్ది అలసట, తలనొప్పి ఉన్నట్లు గుర్తించారు.“ ప్రభావ వంతంగా పనిచేసే అన్ని వ్యాక్సిన్‌లలో ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఉంటాయి’’ అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ పీటర్ ఓపెన్‌షా అన్నారు.
ఫైజర్ కంపెనీ వ్యాక్సీన్‌తో పోల్చవచ్చా?
వ్యాధి నిరోధకతను ప్రేరేపించడానికి రెండు కంపెనీలు వైరస్ జెనెటిక్ కోడ్ ఆధారంగా వ్యాక్సీన్‌లు రూపొందించాయి.
రెండు కంపెనీలలో ఫైజర్-బయోఎన్‌టెక్ తమ వ్యాక్సీన్ 90%శాతం పని చేస్తుందని చెప్పగా, మోడెర్నా తమ వ్యాక్సీన్ 95% ప్రభావవంతమని వెల్లడించింది.
కానీ, రెండు కంపెనీలు ఇంకా ట్రయల్స్ కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ గణాంకాల్లో మార్పు ఉండొచ్చు.
మోడెర్నా వ్యాక్సిన్‌ను నిల్వ చేయడం చాలా సులభం. 20డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మోడెర్నా వ్యాక్సిన్ 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే సాధారణ ఫ్రిజ్‌లలో దీన్ని ఒక నెల వరకు నిల్వ చేయవచ్చు.
ఫైజర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సీన్‌ను నిల్వచేయడానికి అల్ట్రా-కోల్డ్ స్టోరేజ్ అవసరం. మైనస్ 75 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర దీన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లో దీన్ని ఐదు రోజులపాటు నిల్వ ఉంచవచ్చు.
తాము తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 92% ప్రభావవంతమైందని రష్యా ప్రకటించింది. అయితే, ఈ డేటా వ్యాక్సీన్ ట్రయల్స్ ఆరంభంనాటిది.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది వివిధ దేశాల భౌగోళిక దూరాలు, అనుమతులను బట్టి ఆధారపడి ఉంటుంది.
రాబోయే కొద్దివారాల్లో అమెరికా ప్రభుత్వం నుంచి చట్టపరమైన అనుమతులకు దరఖాస్తు చేస్తామని మోడెర్నా ప్రకటించింది. అమెరికాలో 2 కోట్ల డోసులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
ఇతర దేశాల నుంచి కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేయబోతున్నామని, వచ్చే ఏడాదికల్లా 100 కోట్లమందికి ఈ వ్యాక్సిన్ అందించేదుకు ప్రయత్నం చేస్తామని మోడెర్నా వెల్లడించింది.
ఈ వ్యాక్సీన్ కోసం బ్రిటన్ ప్రభుత్వం మోడెర్నా కంపెనీతో చర్చలు జరుపుతోంది.
వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తే ఏ ప్రాతిపదికన దాన్ని ప్రజలకు అందించాలన్నదానిపై యూకే ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇవి కూడా చదవండి:
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- 'జో బైడెన్ నాకు అయిదు సార్లు ప్రపోజ్ చేశారు' - అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న జిల్
- జో బైడెన్: అమెరికా 'అత్యుత్తమ ఉపాధ్యక్షుడు' అధ్యక్ష పదవి వరకూ ఎలా చేరుకున్నారు?
- ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరిచిన వారంలోనే పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- రాయల్ ఎన్ఫీల్డ్: ఆసియాలో విస్తరిస్తున్న భారత మోటార్ సైకిల్ బుల్లెట్ అమ్మకాలు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








