దుబ్బాకలో సత్తా చాటిన రఘునందన్: చివరివరకు దోబూచులాడి వరించిన విజయం

ఫొటో సోర్స్, facebook
దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.
25 రౌండ్లు, పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు ముగిశాక రఘునందన్ రావుకు 63,352 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ నేత సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు వచ్చాయి.
దీంతో 1079 ఓట్ల ఆధిక్యంతో రఘునందన్ రావు గెలిచినట్లయింది.
కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి.
ఇంకా 2 ఈవీఎంలు తెరుచుకోకపోవడంతో వాటిని ఇంకా లెక్కించలేదు. ఆ రెండు ఈవీఎంలలో 800 ఓట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం రఘునందన్ రావు ఆధిక్యం అంతకంటే ఎక్కువే ఉండడంతో ఆయనే విజేతగా తేలారు.

23వ రౌండ్
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలలో రౌండ్‌రౌండ్‌కూ ఆధిక్యాలు మారుతూ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోబూచులాడాయి.
ఫలితాన్ని తేల్చే 23వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు మొత్తం 62772 ఓట్లు సాధించారు.
సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 61,302 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డికి 21,819 ఓట్లు లభించాయి.
ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
20వ రౌండ్
20 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు ఆధిక్యంలోకి వచ్చారు. ఆయనకు 55,733 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 55,493 ఓట్లు వచ్చాయి.
దీంతో రఘునందనరావుకు 240 ఓట్ల ఆధిక్యం లభించింది.

19వ రౌండ్
19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 251 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు.
ఆమెకు 53,053 ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి రఘునందనరావుకు 52,802 ఓట్లు పోలయ్యాయి.

18వ రౌండ్
18 రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ ఆధిక్యం 174కి తగ్గింది.
మొత్తం 1,32,079 ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్ అభ్యర్థికి 50,293.. బీజేపీ అభ్యర్థికి 50,467, కాంగ్రెస్ అభ్యర్థికి 17,389 ఓట్లు వచ్చాయి.
16వ రౌండ్
దుబ్బాకలో లెక్కింపు 16 రౌండ్లు పూర్తయ్యే సరికి మొత్త 1,17,310 ఓట్లు లెక్కించగా అందులో బీజేపీకి 45,994.. టీఆర్ఎస్‌కు 44,260 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 14,832 ఓట్లు పడ్డాయి.
16వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 1,734 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
13వ రౌండు
ఈ రౌండు వరకు లెక్కించిన మొత్తం 96,522 ఓట్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 39,265 ఓట్లు లభించాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపోట సుజాతకు వచ్చిన ఓట్లు: 35,539
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 11,874 ఓట్లు వచ్చాయి.
12వ రౌండు
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 36,745 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆ తరువాత టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 32,715 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఈ రౌండు లెక్కింపు పూర్తయ్యేప్పటికి 10,662 ఓట్లు పోలయ్యాయి.
పన్నెండో రౌండుతో మొత్తం 89,219 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 11 రౌండ్ల లెక్కింపు జరగాల్సి ఉంది.
10వ రౌండ్
పదో రౌండ్ ముగిసే సరికి మొత్తం 74,040 ఓట్లను లెక్కించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన రావుకు 31,783 ఓట్లు వచ్చాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 28,049 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి 6,699 ఓట్లు వచ్చాయి.
బీజేపీ 3,734 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
తొమ్మిదో రౌండ్
తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి మొత్తం 66,807 ఓట్లను లెక్కించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన రావుకు 29,291 ఓట్లు వచ్చాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 25,101 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డికి 5,800 ఓట్లు వచ్చాయి.
బీజేపీ 4,190 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఎనిమిదవ రౌండ్
దుబ్బాకలో ఎనిమిదవ రౌండ్ ముగిసే సరికి మొత్తం 59,665 ఓట్లను లెక్కించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 25,878 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 22,772, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డికి 5,125 ఓట్లు వచ్చాయి. బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఇప్పటి వరకూ పూర్తయిన రౌండ్లు: 8 మొత్తం లెక్కించిన ఓట్లు: 59665టీఆర్ఎస్ కి వచ్చిన ఓట్లు: 22772బీజేపీకి వచ్చిన ఓట్లు: 25878కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు: 5125ఇప్పటి వరకూ అన్ని రౌండ్లూ కలిపి బీజేపీ ఆధిక్యం: 3106 ఓట్లు8వ రౌండ్ ఆధిక్యం: 621 ఓట్లు
ఏడవ రౌండ్:
దుబ్బాకలో ఏడవ రౌండ్ ముగిసే సరికి మొత్తం 52,055 ఓట్లను లెక్కించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన రావుకు 22,762 ఓట్లూ, టిఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 20,277 ఓట్లూ, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస రెడ్డికి 4,003 ఓట్లూ వచ్చాయి. బీజేపీ 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

ఆరవ రౌండ్:
ఆరవ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి మొత్తం 45,175 ఓట్లను లెక్కించారు. వీటిలో, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు 20,226 ఓట్లు వచ్చాయి.
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 17,559 ఓట్లు వచ్చాయి. 3,254 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.

ఈనెల 3వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 82.61 శాతం పోలింగుతో, ఒక లక్షా 64 వేల 192 ఓట్లు నమోదు అయ్యాయి. మొత్తం 23 మంది పోటీ పడగా, ప్రధాన పోటీ టిఆర్ఎస్ అభ్యర్థి, ఇటీవలే మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన రావు, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చెఱకు ముత్యం రెడ్డి కుమారుడు, ఇటీవలే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారిన చెఱకు శ్రీనివాస రెడ్డిల మధ్యే ఉంది.
సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ సభ్యులు చనిపోయి, వారి కుటుంబ సభ్యులే పోటీలో ఉంటే పోరు అంత గట్టిగా ఉండదు. సానుభూతి కార్డు ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో గతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తరహాలో దుబ్బాక ఎన్నిక కూడా హోరాహోరీగా జరిగింది. టిఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర వివాదాలు ఏర్పడ్డాయి. బీజేపీకి సంబంధించినదన్న అభియోగంతో పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకున్నారు.
మొత్తం 315 పోలింగ్ కేంద్రాల మెషీన్లతో పాటూ, పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సి ఉంది. ఈసారి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, కోవిడ్ పాజిటివ్ ఉన్న కొందరికీ, 80 ఏళ్లు దాటిన వృద్ధులు కొందరికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు
దుబ్బాక మరో ప్రత్యేక, అది కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుంది. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, హరీశ్ నియోజకవర్గం సిద్దిపేట, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల - ఈ మూడూ దుబ్బాక సరిహద్దులే, దుబ్బాకకు మూడు వైపులా విస్తరించి ఉన్నాయి. పద్మా దేవేందర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న మెదక్, దుబ్బాకకు మరోవైపు ఉంటుంది.
2009 ఫలితాలు:
మొత్తం పడ్డ ఓట్లు -1,42,535
కాంగ్రెస్ - చెఱకు ముత్యం రెడ్డి - 52,989, 37.18 శాతం
టిఆర్ఎస్ - సోలిపేట రామలింగా రెడ్డి - 50,349, 35.32 శాతం
ప్రజారాజ్యం - మద్దుల నాగేశ్వర రెడ్డి - 19,942
కాంగ్రెస్ మెజార్టీ 2,640 ఓట్లు
2014 ఫలితాలు:
మొత్తం పడ్డ ఓట్లు -1,52,564
టిఆర్ఎస్ - సోలిపేట రామలింగా రెడ్డి - 82,231, 53.37 శాతం
కాంగ్రెస్ - చెఱకు ముత్యం రెడ్డి - 44,306, 28.75 శాతం
బీజేపీ - మాధవనేని రఘునందన రావు - 15,133, 9.82 శాతం
టిఆర్ఎస్ మెజార్టీ 37,925 ఓట్లు
2018 ఫలితాలు:
మొత్తం పడ్డ ఓట్లు -1,63,401
టిఆర్ఎస్ - సోలిపేట రామలింగా రెడ్డి - 89,299, 54.36 శాతం
కాంగ్రెస్ - మద్దుల నాగేశ్వర రెడ్డి - 26,799, 16.31 శాతం
బీజేపీ - మాధవనేని రఘునందన రావు - 22,595 13.75 శాతం
టిఆర్ఎస్ మెజార్టీ 62,500 ఓట్లు
ఇవి కూడా చదవండి:
- 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసిన దిల్లీ కేపిటల్స్
- దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో బీజేపీ ముందంజ.. ఏ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే
- కాంగ్రెస్‌కు 70 సీట్లు ఇచ్చి తేజస్వి యాదవ్ తప్పు చేశారా
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








