ఉప ఎన్నికల ఫలితాలు: గుజరాత్‌లో బీజేపీ క్లీన్ స్వీప్.. ఎంపీ, యూపీ, మణిపూర్‌లో మెజారిటీ స్థానాలు కైవసం

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పాటు ఈ స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ఈసీఐ అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం రాత్రి సరికి బీజేపీ అత్యధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకుంది.
గుజరాత్‌లో 8 స్థానాలకు ఎనిమిదీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో 7కి 6.. మణిపూర్‌లో 5 స్థానాల్లో 4 కైవసం చేసుకుంది.
కర్ణాటకలో రెండు సీట్లనూ గెలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
మధ్యప్రదేశ్ (28 నియోజకవర్గాలు)
ఈ రాష్ట్రంలో 28 సీట్లకు ఉప ఎన్నిక జరగ్గా 16 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 3 స్థానాల్లో ముందంజలో ఉంది.
కాంగ్రెస్ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో 2 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది.
గుజరాత్(8)
ఈ రాష్ట్రంలోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ మొత్తం 8 స్థానాలనూ గెలుచుకుంది.
ఉత్తరప్రదేశ్(7)
ఉత్తరప్రదేశ్‌లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగ్గా 6 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో సమాజ్‌వాది పార్టీ గెలిచాయి.
మణిపూర్(5)
మణిపూర్‌లో 5 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరగ్గా బీజేపీ 4 చోట్ల విజయం సాధించింది.
ఒక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Bjd
ఒడిశా(2)
ఒడిశాలోని రెండు నియోజకవర్గాకు ఉప ఎన్నిక జరిగింది. రెండు నియోజకవర్గాలలోనూ పాలక బిజూ జనతాదళ్ విజయం సాధించింది.
కర్ణాటక(2)
కర్ణాటకలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగ్గా రెండు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది.
ఝార్ఖండ్(2)
ఈ రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. ఒక చోట కాంగ్రెస్ పార్టీ, మరో నియోజకవర్గంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా విజయం సాధించాయి.
నాగాలాండ్(2)
నాగాలాండ్‌లోని రెండు స్థానాల్లో ఒకటి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ గెలుచుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
ఛత్తీస్‌గఢ్(1)
ఛత్తీస్‌గఢ్‌లోని మార్వాహి నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే ధ్రువ్ విజయం సాధించారు.
హరియాణా(1)
హరియాణాలోని బరోడా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత ఇందు రాజ్ విజయం సాధించారు.
తెలంగాణ(1)
తెలంగాణలోని దుబ్బాక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు గెలిచారు.
ఇవి కూడా చదవండి:
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








