జమ్మూకశ్మీర్‌ భూములను ఇక ఎవరైనా కొనుక్కోవచ్చు.. ఇవి కశ్మీర్‌ను కొల్లగొట్టే చర్యలంటూ విపక్షాల ఆగ్రహం

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Subhendu Sarkar/LightRocket via Getty Images

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి

జమ్మూకశ్మీర్‌లో భూముల కొనుగోలుకు సంబంధించిన 11 చట్టాల్లో మార్పులు చేస్తూ కేంద్ర హోంశాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇక్కడి భూములను ఏ భారతీయుడైనా కొనుగోలు చేయొచ్చు. వ్యవసాయ భూములు మాత్రం సాగుచేసే వారు మాత్రమే కొనుగోలు చేయాలి.

గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు అనంతరం హోం శాఖ విడుదలచేసిన తాజా ఉత్తర్వుకు చాలా ప్రాధాన్యముంది. తాజా నోటిఫికేషన్‌పై కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు గట్టిగానే స్పందించాయి. కశ్మీర్‌ను అమ్మకానికి పెట్టేశారని వ్యాఖ్యానించాయి.

జమ్మూకశ్మీర్ డిప్యూటీ గవర్నర్ మనోజ్ సిన్హా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వ్యవసాయ భూమి మాత్రం రైతులే కొనుగోలు చేయాలి. దీనిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు.

జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని మూడో ఆదేశం కింద 11 పాత చట్టాలను రద్దుచేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ నోటిఫికేషన్ తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టంచేశారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

రద్దు చేసిన చట్టాలివే..

జమ్మూకశ్మీర్ ఎలియనేషన్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్, జమ్మూకశ్మీర్ బిగ్ ల్యాండెడ్ ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్, జమ్మూకశ్మీర్ కామన్ ల్యాండ్స్ (రెగ్యులేషన్) యాక్ట్-1956 తదితర చట్టాలు ప్రస్తుతం రద్దయిన చట్టాల్లో ఉన్నాయి.

జమ్మూకశ్మీర్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్-1960 సహా చాలా వరకు పాత చట్టాలను కేంద్ర హోం శాఖ తాజాగా రద్దు చేసింది.

జమ్మూకశ్మీర్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఎలియనేషన్ ఆఫ్ ఆర్చాడ్ యాక్ట్-1975, జమ్మూకశ్మీర్ రైట్ ఆఫ్ ప్రైయర్ పర్చేస్ యాక్ట్-1936, జమ్మూకశ్మీర్ టెనెన్సీ యాక్ట్-1966లోని క్లాస్ 3, జమ్మూకశ్మీర్ యుటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ యాక్ట్-2010, జమ్మూకశ్మీర్ అండర్‌గ్రౌండ్ యుటిలిటీస్ యాక్ట్‌లను కూడా ప్రస్తుతం రద్దుచేశారు.

గతేడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు రాష్ట్రాన్ని.. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ పేరుతో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆర్టికల్ 370 రద్దుకి ముందు, కశ్మీర్‌లోని శాశ్వత నివాసులు మాత్రమే ఇక్కడ భూములు కొనడానికి వీలుండేది.

అయితే, ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని భూములు, ఆస్తులను శాశ్వత నివాసులతోపాటు ఇక్కడ నివాస పత్రం ఉన్నవారు కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం తెలిపింది.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, AFP/getty images

ఘాటుగా ప్రతిస్పందన

ప్రభుత్వ నోటిఫికేషన్‌పై జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు గట్టిగానే స్పందించాయి.

తీవ్ర అంసతృప్తి వ్యక్తంచేస్తూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కేంద్రం చర్యలను విమర్శిస్తూ జమ్మూకశ్మీర్‌ను ఖైదు చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘జమ్మూకశ్మీర్‌లో భూమి యాజమాన్య హక్కుల చట్టాలకు సవరణ చేయడం ఆమోదయోగ్యం కాదు. వ్యవసాయేతర భూముల కొనుగోలుకు అవసరరమైన నివాస పత్రాలు, వ్యవసాయ భూముల బదిలీలను సులభతరం చేసేశారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ చర్యలతో పేదలు, కొంచెం భూమి ఉండే రైతులకు చాలా నష్టం సంభవిస్తుంది’’అని అబ్దుల్లా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జమ్మూకశ్మీర్‌కు వర్తించే ఈ చట్టాలు లద్దాఖ్‌కు కూడా వర్తిస్తాయో లేదో అనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయిందని కూడా అబ్దుల్లా ట్వీట్ చేశారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

స్థానికులకే హక్కులు ఉండాలి..

మరోవైపు ఈ విషయంపై జమ్మూకశ్మీర్ ఆప్నీ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ మొహమ్మద్ అల్తాఫ్ బుఖారీ కూడా స్పందించారు. జమ్మూకశ్మీర్‌కు ఇదివరకటి హోదాలు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భూములపై హక్కులు ఇక్కడి వారికే ఉండాలని, ఉద్యోగాల విషయంలోనూ స్థానికులకే హక్కులు ఉండాలని అన్నారు.

‘‘కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై మా పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘మొదట్నుంచీ ఈ విషయంలో మా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాంగ బద్ధంగా మాకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకున్నారు. గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను రద్దు చేశారు. దీన్ని మా పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇక్కడి ప్రజల హక్కుల కోసం మేం పోరాడతాం. జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులకు వ్యతిరేకంగా తీసుకున్న ఏ నిర్ణయంపైనైనా మేం పోరడతాం’’అని ఆయన వివరించారు.

కేంద్రంలోని భాజపా అధినాయకత్వంతో బుఖారీకి దగ్గరి సంబంధాలున్నాయి. మార్చి నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బుఖారీ కలిశారు. జమ్మూకశ్మీర్‌లో వివాదాస్పద మార్పులేమీ ఇకపై తీసుకురామని ఆ సమయంలో ప్రధాని మాట ఇచ్చినట్లు బుఖారీ వివరించారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, EPA

రోజుకో నోటిఫికేషన్

జమ్మూకశ్మీర్‌లో మార్పులతోపాటు భూమి హక్కుల చట్టాలను రద్దు చేయడంపై మరికొన్ని పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

‘‘రోజూ కేంద్ర హోం శాఖ కొత్త కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో భూమిని ఎవరైనా కొనుగోలు చేసేందుకు వీలుపడుతోంది. తాజా నోటిఫికేషన్‌ను జమ్మూకశ్మీర్ ప్రజలపై జరిగిన కొత్త దాడిగా భావిస్తున్నాం. తాజా చట్టాలు స్థానిక జనాభాలో భారీ మార్పులు తీసుకొస్తాయి. అంతేకాదు కార్పొరేట్ దిగ్గజాలు ఇక్కడ తేలిగ్గా భూములు కొనుగోలు చేసుకోవచ్చు. ఇక్కడి జనాభాలో మార్పులు చేయడమే లక్ష్యంగా, పక్కా ప్రణాళికతో కేంద్ర ముందుకు వెళ్తోంది’’ అని సీపీఎం నాయకుడు మహమ్మద్ యూసుఫ్ తరిగామి వ్యాఖ్యానించారు.

ఇక్కడి సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా తాజా మార్పులు తీసుకొచ్చారని మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

‘‘జమ్మూకశ్మీర్ ప్రజలను విచ్ఛిన్నం చేయడం, హక్కులను కాలరాయడమే లక్ష్యంగా మరో క్రూరమైన చర్యతో కేంద్రం ముందుకు వచ్చింది. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దుచేయడంతో ఇక్కడి సహజ వనరులను కొల్లగొట్టేందుకు వీలుపడింది. ఇప్పుడేమో ఇక్కడి భూములనూ అమ్మకానికి పెట్టేశారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.

జమ్మూకశ్మీర్

ఫొటో సోర్స్, Hilal Shah

మేం ఏమీ చేయలేం

కేంద్ర ప్రభుత్వ చర్యలను కశ్మీర్‌పై బహిరంగంగా జరిగిన దాడిగా సాధారణ పౌరులు అభివర్ణిస్తున్నారు.

‘‘గత ఏడాది నుంచి చాలా చట్టాల్లో మార్పులు తీసుకురావడం మేం చూస్తున్నాం. దీన్ని భారత ప్రభుత్వ బహిరంగ దాడిగా భావిస్తున్నాం. మొదట ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇప్పుడు భూముల హక్కులనూ లాక్కుంటున్నారు. ఇక్కడి భూములను ధనవంతులు కొనుగోలు చేస్తారు. పేదలు చచ్చిపోతారు. కశ్మీరీలందరూ చచ్చిపోతారు. మేం అప్పుడు ఏమీ చేయలేం. ఇప్పటికే మా ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మేం ఏం చేయగలం?’’అని ఖుర్షిద్ అహ్మద్ వ్యాఖ్యానించారు.

పీపుల్స్ అలయన్స్‌లో తరిగామి కూడా సభ్యులు. ఆర్టికల్ 370ను పునరుద్ధరించేందుకు జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి పీపుల్స్ అలయన్స్‌గా ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)