Idli: దక్షిణ భారతదేశ ఆహారాన్ని అవమానించేలా బ్రిటిష్ చరిత్రకారుడి ట్వీట్.. దేశవిదేశాల్లోని ఇడ్లీ ప్రియుల ఆగ్రహం

ఇడ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుధా తిలక్
    • హోదా, బీబీసీ కోసం

దక్షిణ భారతీయులకు ప్రీతిపాత్రమైన ఇడ్లీని ఏమాత్రం ఆసక్తి కలిగించని ఆహార పదార్థంగా ఒక విద్యావేత్త, చరిత్రకారుడు ట్వీట్ చేయడంతో దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.

భారతీయులు.. ముఖ్యంగా దక్షిణాదిలో ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీని బ్రిటన్‌కు చెందిన ఓ విద్యావేత్త "ఆసక్తి" లేని ఆహార పదార్థంగా పేర్కొంటూ ట్వీట్ చేశారు.

"ప్రపంచంలో అత్యంత అనాసక్తమైన ఆహారం ఇడ్లీ" అంటూ ఎడ్వర్డ్ ఆండర్సన్ అనే చరిత్రకారుడు ట్వీట్ చేశారు.

దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు, కొందరి ఆగ్రహానికి దారితీసింది.

ఇడ్లీ

ఫొటో సోర్స్, Getty Images

మినప పప్పు, బియ్యంలను రుబ్బి ఆ పిండిని ఆవిరిపై ఉడికించి చేసే ఇడ్లీలను చట్నీతో కానీ, సాంబారుతో కానీ తింటారు.

దీనిని ఆరోగ్యానికి ఉపకరించి శరీరానికి మేలు చేసే అల్పాహారంగా చెబుతారు. ముఖ్యంగా దక్షిణాదిలోఇడ్లీలను ఎక్కువగా తింటారు.

ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ఆహార పదార్ధం ఇడ్లీ అని ప్రముఖ ఫుడ్ రచయత వీర్ సింఘ్వి చెబుతారు.

అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టమట. సెలవుల్లో చెన్నై వచ్చినప్పుడు తల్లి తనకు ఇడ్లీపై ఇష్టం కలిగేలా చేసేవారంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.

కమలా హారిస్ తల్లి తమిళనాడుకి చెందిన వారు కాగా తండ్రి జమైకా దేశస్థులు.

రానున్న అధ్యక్ష ఎన్నికలలో అమెరికాలో నివసిస్తున్న భారతీయ ఓటర్లను ఆకర్షించేందుకు ఇడ్లీ గురించి మాట్లాడుతున్న ఏకైక రాజకీయ నాయకురాలు ఆమె మాత్రమే కాదు.

మహమ్మారి సమయంలో తమిళ నాడులోని సేలంలో, భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా 'మోదీ ఇడ్లీ'లనే పేరుతో చవకగా ప్రజలకు ఇడ్లీలను పంచుతున్నారు.

పాలక పార్టీ వారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పేరుతో 'అమ్మ ఇడ్లీల' పేరుతో చేస్తున్న కార్యక్రమానికి ఇది పోటీ కార్యక్రమం లాంటిది. జయలలితను ఆమె అభిమానులు ప్రేమతో అమ్మ అని పిలుచుకుంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘చాలామంది ఆ ఆహారపదార్థాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు అనిపించే ఫుడ్ ఏది?’ అని ఒక ఫుడ్ డెలివరీ సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ ఆండర్సన్ ఈ సమాధానాన్ని ట్వీట్ చేశారు.

ఆండర్సన్ వ్యాఖ్యలు ఇడ్లీ ప్రియులను బాగా బాధించాయి. దీంతో ఇడ్లీ అభిమానులంతా తమ సమాధానాలతో ట్వీట్ల వర్షం కురిపించారు.

శశిథరూర్ ట్వీట్

ఫొటో సోర్స్, Twitter

ఇషాన్ థరూర్ అనే రచయత "నేను ట్విటర్లో చాలా అవమానపరిచే ట్వీట్‌ని చూసినట్లున్నాను" అని కామెంట్ చేశారు.

ఆ వెంటనే ఇషాన్ అభిప్రాయానికి మద్దతు పలుకుతూ తండ్రి శశి థరూర్ సమాధానం చెప్పారు.

"అవును! ఈ ప్రపంచంలో కొంతమందికి నిజంగానే ఏమీ తెలియదు. సంస్కృతిని అలవర్చుకోవడం కష్టం. ఇడ్లీల రుచిని ప్రశంసించడానికి, క్రికెట్‌ని ఆస్వాదించటానికి, కేరళ సాంప్రదాయ నృత్యం ఒట్టంతుల్లాల్ ని వీక్షించడానికి ప్రతి జీవికీ అదృష్టం ఉండదు. జీవితం అంటేఎప్పటికీ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోలేని ఈ వ్యక్తి గురించి జాలిపడు" అని సమాధానం ఇచ్చారు.

"ఒక ప్లేట్ వేడి వేడి ఇడ్లీలను ఆవాలు,ఎండు మిర్చి , ఉల్లిపాయతో పోపు పెట్టిన చట్నీ , ఇడ్లీ పొడి, నేతితో తిని చూడండి. ఇడ్లీ పిండి సరైన రీతిలో పిలిస్తే ఆ రుచి స్వర్గానికి దగ్గరగా ఉంటుంది. బహుశా దీనిపై పాఠం చెప్పాల్సి ఉంటుందేమో " అంటూ ఆండర్సన్‌కు నేరుగా ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చారు.

దక్షిణాది వారికి ప్రీతి పాత్రమైన ఇడ్లీ

ఫొటో సోర్స్, Getty Images

"ఇప్పటికే ఈ సంవత్సరం తెచ్చి పెట్టిన కష్టాలు చాలవన్నట్లు ఇడ్లీ మీద కూడా సోషల్ మీడియా లో దాడి జరుగుతోంది. వారానికి ఒక్కరోజైనా ఇడ్లీ తినకపోతే నాకు జీవితం అసంపూర్ణంగా తోస్తుంది" అని గౌరవ్ బగారియా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.

"ఈ ట్వీట్ చూడగానే నేను సగం చచ్చిపోయాను" అంటూ హేమ మీనన్ ట్వీట్ చేశారు

"నా క్లాసుమేట్ ఈ ట్వీట్‌ని పంపగానే కేవలం ఈ విషయం గురించి ట్వీట్ చేయడానికే నేను ట్విటర్ అకౌంట్ తెరిచి ఇడ్లీల గురించి చెప్పడం ప్రారంభించాను.

ఇడ్లీలకు ఆత్మ ఉంటుంది. వాటిని ప్రేమతో చేస్తారు. అవి అనాసక్తి కలిగించేవి కావు. మీరెప్పుడూ సరైన ఇడ్లీలు తిని ఉండరు.

మీరెప్పుడైనా జర్మనీ వస్తే చెప్పండి. మేము మీకు వండి పెడతాం" అని అంటూ అనా సూసన్ థామస్ అనే ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే,ఇదంతా చూసిన ఆండర్సన్ తన మాటలను వెనక్కి తీసుకోలేదు. ఆయన మధ్యాహ్న భోజనంలో ఇడ్లీ తెప్పించుకుని తిని, ఇడ్లీపై నా అభిప్రాయం ఏమి మారలేదు" అని మళ్లీ ట్వీట్ చేశారు.

భారతదేశంలో ఉన్నప్పుడు చాలా సార్లు ఇడ్లీలు తిన్నానని, తన భార్య కేరళకు చెందినవారని ‘బీబీసీ’కి చెప్పారు ఆండర్సన్. ఆయన అత్తగారింటిలో ఇడ్లీలు తరచుగా వండేవారని చెప్పారు.

ఇడ్లీలు రకరకాల చట్నీలతో తినాల్సిన పద్దతుల గురించి ట్విటర్ యూజర్లు ఆండర్సన్‌కి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. అరటి ఆకుల్లో ఆవిరి పెట్టిన ఇడ్లీలను వేడివేడిగా ఇడ్లీ కారంతో, అప్పుడే రుబ్బిన కొబ్బరి చట్నీతో, వేడి వేడి సాంబారుతో ఎలా తినాలో వివరించారు.

"నిజానికి ఇడ్లీలను సరైన చట్నీలతో తింటే చాలా బాగుంటాయి. దోస, వడ, అప్పం అయితే ఇంకా రుచిగా ఉంటాయి".

"ఆహారం వ్యక్తుల ఉనికిని , ప్రాంతీయ భావాలను, భావోద్వేగాలను ఎలా ప్రతిబింబిస్తుందో" ఇడ్లీ మీద జరిగిన ఈ చర్చనిరూపిస్తుంది" అని ఆండర్సన్ అన్నారు.

"నాకు వచ్చిన చాలా సమాధానాలలో, యూజర్లు ఇడ్లీలను ఇంటా బయటా ఎలా తినేవారో గుర్తు చేసుకున్నారు.

అందులో చాలా మంది భారతదేశం వదిలి పెట్టి ఇతర దేశాలలో నివసిస్తున్న వారే ఉన్నారు.

చాలా మంది వారి భూభాగపు ఆహారంతో తమకున్న బంధాన్ని విడదీయలేని అనుబంధం గా భావిస్తారు" అని ఆయన అన్నారు

కొంత మంది యూజర్లు ఇచ్చిన సమాధానాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన అన్నారు.

"ఈ విషయాన్ని కొంత మంది సీరియస్ గా తీసుకున్నారు. కానీ 99 శాతం మంది హాస్యంతో కూడిన సమాధానాలు ఇచ్చారు" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)