జీవీకే: ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 74 శాతం వాటా కొనుగోలు చేయనున్న అదానీ గ్రూప్

ఫొటో సోర్స్, facebook/CSMIAOfficial
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట లిమిటెడ్‌లో 74 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది.
ఇందులో 50.5 శాతం జివీకే గ్రూపు నుంచి కొనుగోలు చేస్తుండగా మైనారిటీ భాగస్వాములైన ఎయిర్ పోర్ట్ కంపెనీ ఆఫ్రికా (ఏసీఎస్ఏ)కు చెందిన 10 శాతం, బిడ్‌వెస్ట్‌కు చెందిన 13.5 శాతం వాటా అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది.
మిగతా 26 శాతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంటుంది.
గతంలో అదానీ బిడ్‌వెస్ట్ వాటాను కొనేందుకు ప్రతిపాదించగా జీవీకే గ్రూప్ అడ్డుకుంది. రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణ నేపథ్యంలో జీవీకే గ్రూప్ నిధులు సమకూర్చలేకపోయింది.
"కరోనా ప్రభావం విమానయాన రంగం పై తీవ్రంగా ఉంది. దీంతో ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. కాబట్టి పెట్టుబడులు తీసుకొని రావల్సిన అవసరం ఉంది. అందుకే అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు సహకరించడానికి అంగీకరించాం" అని జీవీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఏమిటీ కేసు?
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ నిధులను దుర్వినియోగం చేశారంటూ జీవీకే గ్రూప్ కంపెనీల చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఎండీ గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి, కొన్ని ఇతర సంస్థలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులు, మరికొందరిపైన సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో.. 2012-18 మధ్య రూ. 705 కోట్లను అక్రమంగా వాడుకున్నారంటూ సీబీఐ ఆరోపించింది.
బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులను అక్రమంగా మళ్లించారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ.
ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్ రెడ్డితో పాటు మరో 12 సంస్థలు/వ్యక్తులపైనా కేసు నమోదైంది.
ఈ మేరకు జూన్ 27 రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కేసులో సీబీఐ బుధవారం ముంబయి, హైదరాబాద్‌లలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడికి చెందిన కార్యాలయాలు.. ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని పలు కార్యాలయాలు సహా మొత్తం 6 ప్రదేశాలలో సోదాలు చేసింది. ఈ సోదాలు కొనసాగనున్నాయి.
దీనిపై ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) స్పందించింది. "ఎంఐఏఎల్ తదితరుల మీద సీబీఐ కేసు నమోదైందని తెలిసి మేం ఆశ్చర్యపోయాం. దీనికి ముందు ప్రాథమిక విచారణ జరిపినా మేం వారు కోరిన అన్ని వివరాలూ అందించి ఉండేవాళ్లం. ఎంఐఏఎల్ చాలా పారదర్శకంగా పని చేసే సంస్థ. నిజానిజాలు బయటకు వచ్చేందుకు మేం దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించేందుకు బద్ధులమై ఉన్నాం" అని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
ఏమిటీ కేసు?
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(ఎంఈఎఎల్) అనేది ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్‌పోర్ట హోల్డింగ్స్ లిమిటెడ్, మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ సంస్థ.
ముంబయి విమానాశ్రయ అభివృద్ది, నిర్వహణ, నవీకరణ కోస దీన్ని ఏర్పాటుచేశారు.
ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ వాటా 50.5 శాతం కాగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటా 26 శాతం.
ఈ వెంచర్ సంస్థపై వచ్చే ఆదాయంలో వార్షిక రుసుముగా 38.7 శాతం మొత్తాన్ని ఎంఏఈఎల్ ఏఏఐకి చెల్లించాల్సి ఉంటుంది.
మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది.సీబీఐ ఆరోపణల ప్రకారం ప్రధానంగా అవినీతి ఇక్కడే జరిగింది.

ఫొటో సోర్స్, facebook/CSMIAOfficial
నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం ఇలా..
*బోగస్ వర్క్ కాంట్రాక్టులతో బురిడీ
నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సిన నిధులను జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ బోగస్ వర్క్ కాంట్రాక్టులను సృష్టించి దారి మళ్లించిందన్నది సీబీఐ ఆరోపణ.
ఇందుకోసం 9 ప్రయివేటు సంస్థలను వాడుకుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
ఇలా రూ. 310 కోట్ల నిధులను దారి మళ్లించి 2017-18 మధ్య ముంబయి విమానాశ్రయ పరిసరాల్లో 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కు జీవీకే వినియోగించుకుందని సీబీఐ ఆరోపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
* రిజర్వ్ నిధుల దుర్వినియోగం
ఎంఐఏఎల్ ప్రమోటర్లలో ఒకటైన జీవీకే గ్రూపు నేరపూరిత ఉద్దేశాలతో 2012 నుంచి ఏఏఐకి ఆర్థిక నష్టం కలిగించింది.
ఎంఐఏఎల్ వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 395 కోట్లను తమ (జీవీకే గ్రూప్) కంపెనీలకు ఆర్థిక సహాయానికి వాడుకుందని.. ఇందుకోసం బోర్డు మీటింగు తీర్మానాలు తప్పుడువి సృష్టించి హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉంచారు.
ఎంఐఏఎల్ ముంబయి బేస్డ్ సంస్థ అయినప్పటికీ దాని మిగులు నిధులను హైదరాబాద్ బ్యాంకుల్లో పెట్టి వాటిపై జీవీకే గ్రూపు రుణాలు, ఓవర్ డ్రాఫ్టు ద్వారా నిధులు పొంది తమ గ్రూపు సంస్థలకు మళ్లించిందన్నది సీబీఐ ఆరోపణ.
ఇది కాకుండా ఎంఐఏఎల్ ఖర్చులను అధికంగా చూపించడం.. ఆదాయాన్ని తక్కువగా చూపించడం.. జీవీకే గ్రూపు ప్రమోటర్లు, ఆ కుటుంబాల్లోని వ్యక్తుల వ్యక్తిగత వ్యయాలకు ఎంఐఏఎల్ నిధులను వాడుకోవడం వంటి ఇతర అక్రమాలనూ సీబీఐ ప్రస్తావించింది.
అన్ని రకాలుగా కలిపి రూ. 705 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది.

ఫొటో సోర్స్, facebook/CSMIAOfficial
ఎవరెవరిపై అభియోగాలున్నాయంటే..
* జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్
* ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్
* గునుపాటి వెంకట కృష్ణారెడ్డి(జీవీకే రెడ్డి). జీవీకే గ్రూప్ చైర్మన్, ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ శాశ్వత కాల డైరెక్టర్.
* జీవీ సంజయ్ రెడ్డి, ఎంఐఏఎల్ ఎండీ.
* ఐశ్వర్యగిరి కనస్ట్రక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్
* కొఠియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్
* ఎస్బీకే ట్రేడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్
* సుభాష్ ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ప్రయివేట్ లిమిటెడ్
* ఆక్వాటెక్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్
* ఎంవీ ఓమ్నీ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
* రిచా ఇండస్ట్రీస్ లిమిటెడ్
* నైస్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
* అదితి ఇన్‌ఫ్రాబిల్డ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్
* ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులు(వీరు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది)
* కొందరు ప్రభుత్వ ఉద్యోగులు(వీరిని గుర్తించాల్సి ఉంది)
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- నైలు నదిపై నీటి యుద్ధం.. భారీ ఆనకట్ట రేపిన వివాదం
- చవగ్గా వచ్చే విద్యుత్‌ను దాచుకోవచ్చు ఇలా..
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








