కరోనా వైరస్: దిల్లీలో భారీగా పెరుగుతున్న కేసులు, 'కరోనా కేపిటల్' కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కాపాడగలరా

కరోనా పరీక్షలు చేయించుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, GETTYIMAGES

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ రాజధాని దిల్లీలో శనివారం నమోదైన కేసుల సంఖ్య 2 వేలు దాటింది. 129 మంది మృతి చెందారు. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకూ అత్యధికం.

వీటితో కలిసి దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 36,824కి చేరగా, మొత్తం మృతుల సంఖ్య 1214కు పెరిగింది.

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండడంతో, దీనిని శుక్రవారం సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నాలుగు రాష్ట్రాలు దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది.

వీటిలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడుతోపాటు దిల్లీ కూడా ఉంది. జస్టిస్ కౌల్ దిల్లీ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు చాల తక్కువగా జరుగుతున్నాయన్నారు.

మీడియా రిపోర్టుల ద్వారా దిల్లీ ఆస్పత్రుల్లో శవాల పరిస్థితి భయానకంగా ఉందని, వాటిని వెయిటింగ్ ఏరియాల్లో పెట్టినట్టు తెలుస్తోందని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.

దిల్లీలో కరోనా స్థితి ఎంత ఘోరంగా ఉందో ఇది చెబుతోంది. దిల్లీ ప్రభుత్వం కూడా అలాంటి భయానక పరిస్థితి గురించే చెప్పింది.

దిల్లీలో జులై చివరి నాటికి కరోనా రోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుతుంది: 2020 జూన్ 9, మనీశ్ సిసోదియా, దిల్లీ ఉప ముఖ్యమంత్రి.

ఈ ప్రకటనతో దిల్లీ ఎన్సీఆర్‌లో భయానక పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఆ భయం నుంచి వారు కోలుకోలేకపోతుంటే, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంతకంటే భయానక ప్రకటన చేశారు.

బయటివారికి దిల్లీలో చికిత్స చేయాల్సి వస్తే దిల్లీలో రెట్టింపు బెడ్స్ అవసరం అవుతాయి. అంటే జులై చివరి నాటికి లక్షన్నర బెడ్స్ అవసరం: 2020 జూన్ 10, అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ఆ తర్వాత దిల్లీలో పెరిగే కేసులను చూశాక, మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం వస్తుందా? అనే చర్చ కూడా మొదలైంది. దీనిపై శుక్రవారం దిల్లీ ఆరోగ్య మంత్రి మరో ప్రకటన చేశారు.

దిల్లీలో లాక్‌డౌన్ ఇక పొడిగించరు: 2020 జూన్ 12, సత్యేంద్ర జైన్, ఆరోగ్య మంత్రి

అలాంటప్పుడు, 68 రోజుల లాక్‌డౌన్‌ సమయంలో దిల్లీ ప్రభుత్వం అసలు ఎలాంటి సన్నాహాలు చేసిందనే ప్రశ్న వస్తుంది.

లోపం ఎక్కడుంది? కేజ్రీవాల్ ఎక్కడ తప్పు చేశారు? ఈ రిపోర్ట్ ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం వెతికాం.

యాప్

ఫొటో సోర్స్, cmo delhi

దిల్లీ కరోనా యాప్

మొదట మనం దిల్లీ కరోనా యాప్ కథ చెప్పుకోవాలి. జూన్ 2న దిల్లీ ప్రభుత్వం ఈ యాప్ లాంచ్ చేసింది. ఉద్దేశం మంచిదే, మరో అభిప్రాయం లేదు.

కానీ ఈ యాప్ ప్రజల సమస్యలు తగ్గడం కంటే సర్కారు కష్టాలు ఎక్కువ పెంచింది.

యాప్ లాంచ్ చేయగానే రోగులు, వారి బంధువులు, జర్నలిస్టులు అందరూ ఆస్పత్రులకు ఫోన్ చేసి ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయో కనుక్కోవడం మొదలెట్టారు.

యాప్‌లో చూపిస్తున్నట్టు ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితి లేదనే విషయం అందరికీ అర్థమైంది.

దిల్లీ కరోనా యాప్ గణాంకాల విషయానికి వస్తే మూడు కీలక విషయాలు కనిపిస్తాయి.

  • మొదటిది – దిల్లీలో కరోనా రోగుల అత్యధిక లోడ్ 10 పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులు, 5 ప్రైవేట్ ఆస్పత్రులపై ఉంది.
  • రెండోది – డిశ్చార్జ్ అయి బయటికి వస్తుండడంతో ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్ ఖాళీ అవుతున్నాయో ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. కానీ రోగులు అక్కడికి వెళ్తున్నప్పుడు వారిని చేర్చుకోవడం లేదు. ఐసీయూ, వెంటిలేటర్ ఉన్న బెడ్స్ దొరకడం లేదు.
  • మూడోది – చికిత్సకు అయ్యే ఖర్చు. చాలా ఆస్పత్రుల్లో ఐసీయూకు లక్షల బిల్లు వేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ముందే డబ్బు జమ చేయాలని చెబుతున్నారు.

సంత్ పరమానంద్ ఆస్పత్రికి ఫోన్ చేస్తే ఐసీయూ కోసం ముందే 9 లక్షల రూపాయలు చెల్లించాలని బీబీసీకి చెప్పారు. ఇక ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆస్పత్రి, న్యూ ఫ్రెండ్స్ కాలనీ బ్రాంచ్ సిబ్బంది కోవిడ్ చికిత్స కోసం ఒక బెడ్‌కు రోజుకు 9 వేలు అవుతుందని, డాక్టర్ ప్రతి విజిట్‌కు 4200 రూపాయలు అవుతుందని చెప్పారు. రోగిని ఐసీయూలో ఉంచాల్సి వస్తే రోజుకు లక్ష అవుతుంది. దానికి 80 వేల వరకూ అడ్మిషన్ సమయంలోనే చెల్లించాలి.

దిల్లీ ప్రభుత్వం యాప్ ఒక భ్రమ అని, దానివల్ల పెద్దగా ఉపయోగంలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

“దిల్లీలో చిన్న ఆస్పత్రులే కాదు, పెద్ద ఆస్పత్రుల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది” అని సుప్రీంకోర్టు వకీల్ అశోక్ అగర్వాల్ చెబుతున్నారు.

వరుసగా ఫిర్యాదులు రావడంతో దిల్లీ ప్రభుత్వం కరోనా యాప్ డేటా, ఆస్పత్రుల్లో ఖాళీ అవుతున్న బెడ్స్ వివరాలు సమన్వయం కోసం ఆస్పత్రుల్లో ఒక నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమిస్తోంది.

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జూన్ 10న ఒక సర్కులర్ జారీ చేస్తూ అన్ని ఆస్పత్రులు, నర్సింగ్ హోంలలో ఖాళీ అయిన బెడ్స్ వివరాలు, చికిత్స ఖర్చుల గురించి చెబుతూబయట బోర్డు పెట్టాలని ఆదేశించారు.

ఈ ఆదేశాలతో దిల్లీలో కరోనా చికిత్స కాస్త మెరుగుపడుతుందనే భావిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రోజూ మారే ప్రభుత్వ ఆదేశాలు

యాప్‌లో బెడ్స్ ఉన్నట్టు ఖాళీలు కనిపిస్తున్నా, ఎవరికీ బెడ్స్ దొరకడం లేదు. పరిస్థితి గురించి తెలుసుకోడానికి మేం రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బీఎల్ షేర్‌వాల్‌తో మాట్లాడాం.

ఆయన మైల్డ్ సింప్టమ్స్ ఉన్న రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదని, ఎవరికి చికిత్స అవసరం ఉంటుందో వారిని మాత్రమే ఆస్పత్రిలో చేర్చుకుంటున్నామని చెప్పారు.

కానీ జూన్ 6న దిల్లీ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కరోనా లక్షణాలున్న ప్రతి రోగికి ట్రీట్‌మెంట్ చేయడం తప్పనిసరి అన్నారు. అంటే దీని ప్రకారం కరోనా ఉంటే ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవాలి. తగ్గిన తర్వాత నాన్ కోవిడ్ వార్డులకు షిఫ్ట్ చేయాలి.

కరోనాతో ప్రతి ఒక్కరూ భయపడిపోయి ఉన్నారు. రిపోర్ట్ పాజిటివ్ రాగానే అందరూ నేరుగా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.

దాంతో, లక్షణాలు కనిపించని కరోనా రోగులు తమ ఇళ్లలోనే ఐసొలేషన్లో ఉండాలని సలహా ఇస్తున్నారు. భయపడిపోయిన వారంతా తమకు చికిత్స అందించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. దీనితోనే అసలు సమస్య వస్తోంది.

ఉత్తర్వులు

ఫొటో సోర్స్, DELHI GOVERNMENT

కోవిడ్ పరీక్షల గురించి ప్రశ్నలు

ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు అపార్థం చేసుకోడానికి ఒక తాజా ఉదాహరణ గంగారామ్ ఆస్పత్రి.

ఇక్కడ కరోనా టెస్ట్ కోసం RT-PCR యాప్ ఉపయోగించడం లేదని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంతో, ఇప్పుడు ఈ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు చికిత్సలు జరుగుతున్నా, వారిని పరీక్షలు మాత్రం చేయడం లేదు.

బీబీసీతో మాట్లాడిన సర్ గంగారామ్ ఆస్పత్రి మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ ఎస్పీ బాయోత్రా “ఒక వైపు లక్షణాలు ఉండేవారిని చేర్చుకోమని చెప్పే ప్రభుత్వం, మరోవైపు మేం టెస్టులు చేయలేమని చెప్పడం హాస్యాస్పదం. అలాంటప్పుడు రోగి ఎవరో మాకెలా తెలుస్తుంది” అన్నారు.

దిల్లీలోని ఆస్పత్రుల్లో ఎవరిని అడ్మిట్ చేసుకుంటారు, ఎవరిని చేసుకోరు అనేదానిపై మూడు రోజులపాటు గందరగోళం కూడా ఏర్పడింది.

అంతేకాదు, ఆరు ప్రైవేట్ ల్యాబ్స్ కరోనా టెస్టులు చేయడాన్ని దిల్లీ ప్రభుత్వం గతవారం అడ్డుకుంది. అవి ఐసీఎంఆర్ నియమాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించింది. ఆ ఆరు ల్యాబుల్లో రోజుకు 4 వేల మంది పరీక్షలు చేయించుకునేవారు.

సుప్రీంకోర్టు శుక్రవారం దిల్లీలో పరీక్షలు తక్కువ చేస్తున్నారనే అంశాన్ని లేవనెత్తింది. ప్రతి పది లక్షల మందిలో ఎక్కువ పరీక్షలు చేసింది తామేనని దిల్లీ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ వాస్తవానికి మొదటి 10-12 రోజులతో పోలిస్తే మే నెలలో పరీక్షల సంఖ్య తగ్గింది. ల్యాబ్స్ పై చర్యలు తీసుకోవడమే దానికి కారణం అని దిల్లీ ఎమ్మెల్యేలు టీవీ చర్చల్లో చెప్పారు.

అంతకు ముందు మే 24న దిల్లీలో 50 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రులన్నీ 20 శాతం పడకలను కరోనా రోగుల కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కానీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఎలాంటి సూచనలూ చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అని పేరు రాయద్దనే షరతుతో కొన్ని ఆస్పత్రులు చెప్పాయి. అలా కేటాయించాలంటే క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉంటాయని. ఆస్పత్రుల్లో ఉండే హార్ట్, కిడ్నీ రోగులను రాత్రికి రాత్రే ఎక్కడకు తరలించాలని ప్రశ్నించాయి.

గత కొన్ని రోజులుగా దిల్లీ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలే వస్తున్నాయి. వాటి ప్రభావం నేరుగా దిల్లీలో కోవిడ్-19 గణాంకాలపై పడుతోంది.

చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొరత

దిల్లీ ప్రభుత్వం మార్చిలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐదుగురు డాక్టర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేసింది. మార్చి 27న మీడియాతో మాట్లాడిన సీఎం కేజ్రీవాల్ ప్రతి రోజూ వెయ్యి కరోనా కేసులు నమోదైనా, దిల్లీ ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందని అన్నారు.

కానీ, గత కొన్నిరోజులుగా దిల్లీలో సగటున వెయ్యి నుంచి 1600 మధ్య కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ కేసుల సంఖ్య 2 వేలు దాటింది.

కేసుల సంఖ్య పెరగడంతో దిల్లీ ఆస్పత్రుల్లో వెటిలేటర్ల కొరత కూడా పెరగనుంది. మొత్తం కరోనా రోగుల్లో 3 నుంచి 5 శాతం రోగులకే వెంటిలేటర్లు అవసరం అవుతాయి.

జులై చివరి నాటికి ప్రభుత్వం చెబుతున్నట్లు ఐదున్నర లక్షల కేసులు నమోదైతే, ఆ సమయానికి కనీసం 16 నుంచి 20 వేల వెంటిలేటర్ బెడ్స్ అవసరం అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆ పరిస్థితిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు.

జనరల్ హెల్త్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్ ప్రసాద్ బీబీసీతో “దిల్లీలో సఫ్దర్ జంగ్, ఆర్ఎంఎల్, ఎయిమ్స్ లో అత్యధిక వెంటిలేటర్లు ఉన్నాయి. ఒక్కో దానిలో దాదాపు 250 వెంటిలేటర్లు ఉండచ్చు” అని చెప్పారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దిల్లీలో మొత్తం 561 వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కూడా వెంటిలేటర్లు ఉంటాయి. డాక్టర్ జగదీశ్ వివరాల ప్రకారం దిల్లీలో మొత్తం వెంటిలేటర్ల సంఖ్య 1200కు మించి ఉండదు. అంటే, దాన్ని బట్టి చూస్తే జులై చివర్లో ఎదురయ్యే పరిస్థితులను తట్టకోడానికి దిల్లీ అసలు సిద్ధంగా లేదు.

అమెరికా న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ యూనివర్సిటీ కూడా భారత్‌లో క్రిటికల్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇదే ఏడాది ఏప్రిల్లో ఒక రీసెర్చ్ ప్రచురించింది. దాని ప్రకారం దిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 986 వెంటిలేటర్లు ఉన్నాయి.

ఇదే ఏడాది డీజీహెచ్ఎస్ పదవి నుంచి రిటైర్ అయిన డాక్టర్ జగదీశ్ 2002 నుంచి 2010 వరకూ సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో పనిచేశారు. ఆయన స్వల్ప, లక్షణాలు కనిపించని రోగులకు ఇంటి దగ్గరే ఉంచి చికిత్స అందించవచ్చని చెప్పారు. కానీ మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్న రోగులకు ఆస్పత్రిలో బెడ్స్ అవసరం ఉంటుందని అన్నారు.

“లక్షణాలు మధ్యస్థంగా ఉండే రోగులకు ఆక్సిజన్ సరఫరా ఉండే పడకలు కావాలి, దానికి దిల్లీ సిద్ధంగా ఉంది. కానీ కరోనా తీవ్రంగా ఉన్న రోగుల కోసం దిల్లీ సిద్ధంగా ఉన్నట్లు అసలు కనిపించడం లేదు, వారికి వెంటిలేటర్ల అవసరం ఉంటుంది” అన్నారు.

దీనిని బట్టి 68 రోజుల లాక్‌డౌన్ సమయంలో వాటిని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదనేది స్పష్టం అవుతుంది.

హాస్పిటల్

ఫొటో సోర్స్, Getty Images

డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత

దిల్లీలో ప్రస్తుతం మరో పెద్ద సమస్య డాక్టర్ల కొరత. దిల్లీలో మెడికల్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం 70 వేల మంది డాక్టర్లు రిజిస్టర్డ్ ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఈ మొత్తం డాక్టర్లలో 15 నుంచి 20 శాతం మంది డాక్టర్లకు మాత్రమే సరైన ప్రాక్టీస్ ఉంది.

కానీ రోజూ కరోనాకు గురవుతున్న డాక్టర్లు, నర్సులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తోంది. దాంతో డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బంది కొరత అనేది నిజంగా ఒక పెద్ద సమస్య. ముందు ముందు దీనిని ఎదుర్కోడం ప్రభుత్వానికి పెను సవాలు కాబోతోంది.

రోజువారీ కేసులను బట్టి కరోనా పడకల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులను కోరుతోంది. దీనిపై మాట్లాడిన ప్రభుత్వ మహేష్ వర్మ కమిటీ “స్టేడియం, ప్రగతి మైదాన్ లాంటి పెద్ద ప్రాంతాల్లో తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాం” అని చెప్పింది.

కానీ, ఇక్కడ మరో సమస్య ఉంది. ఖాళీ ప్రాంతాల్లో తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినా, బెడ్స్ కొనుగోలు చేసినా రాత్రికి రాత్రే నిపుణులైన డాక్టర్లను తీసుకురావడం కష్టం. అలాంటి సమయలో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది పని వేళలు పెరుగుతాయి. వారిపై పనిభారం పెరుగుతోంది.

దిల్లీలో మృతుల గణాంకాలపై ప్రశ్న

దిల్లీ కార్పొరేషన్ గురువారం కరోనా రోగుల దహన సంస్కారాల గణాంకాలు జారీ చేసింది. దీని ప్రకారం మొత్తం 2098 మంది చనిపోయారు. దక్షిణ దిల్లీలో 1080, ఉత్తర దిల్లీలో 976, తూర్పు దిల్లీలో 42 మృతులు నమోదయ్యాయి.

అటు దిల్లీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం శనివారం వరకూ దిల్లీలో కరోనా వల్ల మొత్తం 1214 మంది చనిపోయారు.

శుక్రవారం సుప్రీంకోర్టు కూడా శవాలపట్ల జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం మొత్తం కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు దిల్లీ ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో దిల్లీలో కరోనా వల్ల సంభవించే మరణాలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ డాక్టర్లతో ఒక డెత్ ఆడిట్ కమిటీ ఏర్పాటు చేసింది.

కేజ్రీవాల్

ఫొటో సోర్స్, VIPIN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఆరోగ్య సేవలపై వ్యయం

ఆమ్ ఆద్మీ పార్టీ ఐదేళ్లలో 900 మొహల్లా క్లినిక్ తెరుస్తామని హామీ ఇచ్చింది. 2020 జనవరి వరకూ సగం మొహల్లా క్లినిక్ మాత్రమే తెరిచారు. వీటిల సాధారణ పరీక్షలు, మెడికల్ చెకప్‌లు, ఉచిత మందులు లభిస్తాయి. వీటిని అల్పాదాయ వర్గాల కోసం ఏర్పాటు చేశారు.

కానీ కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి ఇవి ఎలాంటి పాత్ర పోషించాయనేది తెలీలేదు. వీటితో పాటూ ఆప్ 125 పాలీ క్లినిక్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పంది. వాటిలో మహిళా డాక్టర్లు, పిల్లల వైద్య నిపుణులు ఉంటారని చెప్పారు. కానీ ఈ ఏడాది జనవరి వరకూ 25 పాలీ క్లినిక్‌లే ఏర్పాటు చేశారు.

ఆరోగ్య రంగంలో ఆప్ మూడో అతిపెద్ద పథకం ఆస్పత్రుల్లో 30 వేల కొత్త బెడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పడం. కానీ ఆ హామీ నెరవేర్చలేదు. ప్రభుత్వ డేటాను బట్టి 2019 నాటికి కేవలం 3 వేల పడకలు మాత్రమే ఏర్పాటుచేశారు.

పరిష్కారం ఏంటి?

బీబీసీ పరిశోధనలో కరోనా చికిత్సకు సంబంధించి ఎదురవుతున్న ఈ సమస్య ఒక్క దిల్లీదే కాదని తేలింది. కేంద్రం కూడా దానికి సహకరించాలి. ఈ కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కలిసి పనిచేయాలని చాలామంది నిపుణులు కూడా సూచించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)