‘మోదీతో కలిసి తింటే ఎంతో బాగుండేది’: సమోసాలు తయారు చేసి ట్వీట్ చేసిన ఆస్ట్రేలియా ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images/twitter
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది. ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు జనాలు రకరకాల పనులు చేస్తున్నారు. కొందరు యోగా మొదలుపెడితే, ఇంకొందరు తోట పని చేసుకుంటున్నారు. ఇంకొందరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.
వీటన్నింటి గురించి సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతున్నారు.
సామాన్యులే కాదు, ప్రముఖులు కూడా ఇలా చేస్తున్నారు. కత్రినా కైఫ్ పాత్రలు తోముతూ దర్శనమిచ్చారు. చిరంజీవి, రాజమౌళి లాంటి ప్రముఖులు ఇంటి పనులు చేస్తూ కనిపించారు.
తాజాగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కూడా సమోసాలు తయారు చేసి, ఆ ఫొటోలను ట్విటర్‌లో పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘సమోసాలు, మామిడి చట్నీని పూర్తిగా నాకు నేనే తయారుచేశా. ఈ వారం భారత ప్రధాని మోదీతో వీడియో లింక్ ద్వారా సమావేశం అవుతున్నా. ఈ సమోసాలు పూర్తిగా శాకాహారం. ఆయనతో కలిసి తింటే, ఎంతో బాగుండేది’’ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.
తాను చేసిన సమోసాలకు ‘స్కామోసా’ అని పేరు కూడా ఆయన పెట్టేశారు.
స్నేహితులు సమోసాలు తిందామని అంటే, ఎవరైనా స్పందించకుండా ఉంటారా?
మోదీ కూడా స్పందించారు.
‘‘చూస్తుంటే నోరూరుతోంది. హిందూ మహా సముద్రం మనల్ని అనుసంధానం చేస్తే, సమోసాలు ఏకం చేస్తున్నాయి. కరోనావైరస్‌పై విజయం సాధించాక, కలిసి సమోసాలు తిందాం’’ అని ఆయన బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మోదీ, మోరిసన్ వీడియో లింక్ సమావేశం జూన్ 4న జరగాల్సి ఉంది.
ఈ ఇద్దరు నేతల సంభాషణ తర్వాత ట్విటర్‌లో సమోసా టాప్ ట్రెండ్స్‌లోకి వచ్చింది. జనాలు రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు.
ఎజెండా అయినా, సమోసాలయినా వేడివేడిగానే ఉండాలని విష్ణు అనే వ్యక్తి కామెంట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
భారత్ సాఫ్ట్ పవర్స్‌లో సమోసా ఒకటి కాబోతుందని హర్షిల్ అనే వ్యక్తి చమత్కరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మోరిసన్‌తో సమోసాలు తినే కార్యక్రమంతోపాటు గ్రామాల్లోని జనాలకు కాస్త మజ్జిగ అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని గ్రామీణ్ పేరుతో ఉన్న ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
అసలు సమోసాలు భారత్‌కు ఎలా వచ్చాయి?
సమోసా భారత్‌లోనే పుట్టిందని అందరూ భావిస్తారు. కానీ దానికి మించి ఇంకేదో ఉందని చరిత్ర చెబుతోంది.
నిజానికి సమోసా వేల మైళ్లు ప్రయాణించి భారతదేశం చేరింది. ప్రాచీన ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చింది.
సమోసా తొలిసారి భారతదేశానికి ఎప్పుడొచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ పర్షియన్ పదం 'సనుబాబాద్' నుంచి సమోసా పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
11వ శతాబ్దంలో తొలిసారిగా సమోసా ప్రస్తావన కనిపిస్తుంది. పర్షియన్ చరిత్రకారుడు అబ్దుల్ ఫజల్ బెహౌకీ తన రచనల్లో తొలిసారిగా సమోసా పదం ఉపయోగించారు.
గజాన్వీ సామ్రాజ్యంలోని న్యాయస్థానంలో ఉప్పగా ఉండే పదార్థం వడ్డించేవారని చరిత్రకారుడు అబ్దుల్ ఫజల్ బెహౌకీ పేర్కొన్నాడు. దానిని కరకరలాడేలా నూనెలో వేయించేవారని ఆయన వివరించారు.
ఆ పదార్థమే సమోసాగా మారిందట.
ఇరాన్ నుంచి భారత్‌కు వర్తకుల రాకపోకలు పెరగడంతో సమోసాలో అనేక మార్పులు వచ్చాయి.
ఇప్పుడు అఫ్ఘనిస్తాన్‌గా పిలుస్తున్న మధ్య ఆసియాలోని పర్వతాల మీదుగా సమోసా భారత్ చేరింది. విదేశీయుల రాకపోకలతో భారత్‌లోని అనేకరంగాల్లో మార్పులు వచ్చాయి. సమోసా విషయంలోనూ ఇదే జరిగింది.
కాలక్రమేణా సమోసా తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ చేరింది. అక్కడ పెను మార్పులకు లోనైంది. క్రమంగా సమోసా రైతులకు ప్రధాన ఆహారంగా మారిందని ఆహార నిపుణులు ఫ్రొఫెసర్ పుష్పేష్ పంత్ చెప్పారు.
శతాబ్దాల తర్వాత హిందూకుష్ మంచు పర్వతాల మీదుగా ప్రయాణించి సమోసా భారత ఉపఖండానికి చేరింది.
ఇప్పుడు సమోసా హై కేలరీ వంటకం. మొదట్లో కూరగాయలతో సాదాసీదా సమోసా తయారు చేసేవాళ్లు. ఇప్పుడు మాంసం, డ్రై ఫ్రూట్స్, ఉల్లి మిక్స్ చేసి తగినంత ఉప్పు దట్టించి మరింత స్పైసీగా సమోసా చేస్తున్నారు.
ఫ్రొఫెసర్ పంత్ ప్రకారం సమోసా భారత్ చేరిన తర్వాత సమూలంగా మారిపోయిందట. స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సమోసాను మార్చేశారు. దాంతో ప్రపంచంలోనే తొలి ఫాస్ట్‌ఫుడ్‌గా సమోసా రికార్డు కొట్టింది.
సమోసా తయారీలో అల్లం, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు.. ఇలా ఎన్నో ఉపయోగిస్తారు. సమోసాపై ఎవరికి వారు నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
సమోసా రుచి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల్లో దాని రుచి వేర్వేరుగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఉన్న వేర్వేరు షాపుల్లో కూడా సమోసా రుచి భిన్నంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్‌లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)