ఐఆర్‌సీటీసీ: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే

ఫొటో సోర్స్, Getty Images
కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ విధించిన తర్వాత ఆగిపోయిన రైల్వే సేవలను జూన్ 1 నుంచీ మళ్లీ కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, ఇవాళ్టి నుంచి టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.
జూన్ 1 నుంచీ దేశవ్యాప్తంగా 200 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారత రైల్వే బుధవారం రాత్రి ప్రకటించింది.
జోన్లు, మార్గాల ప్రకారం వచ్చే నెల నుంచి నడవనున్న రైళ్లు, వాటి టైం టేబుల్‌ను అన్ని జోన్ల డీజీలకు పంపించింది.
ప్రధానంగా కరోనా లాక్‌డౌన్ సడలింపులతో భారీగా సొంత ప్రాంతాలకు తరలుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ప్రత్యేకంగా కొన్ని మార్గాల్లో రైళ్లను తిరిగి ప్రారంభించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి రోజూ రాకపోకలు సాగించనున్న ఎక్స్ ప్రెస్ రైళ్లు:
- ముంబయి-హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్ ప్రెస్ (02701/02),
- హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్ ప్రెస్ (02703/04),
- హైదరాబాద్- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్ ప్రెస్ (02723/24),
- దానాపూర్- సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92),
- విశాఖపట్నం- దిల్లీ ఏపీ ఎక్స్ ప్రెస్( 02805/06)
- గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ ప్రెస్ (07201/02)
- తిరుపతి- నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ (02793/94)
- హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్ ప్రెస్ (02727/28)
దురంతో రైళ్లు:
- సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) (వారానికి రెండుసార్లు నడుస్తుంది)

ఫొటో సోర్స్, GETTY IMAGES
సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు:
- హౌరా-యశ్వంత్‌పూర్ (విజయవాడ మీదుగా) దురంతో ఎక్స్ ప్రెస్ (02245/46) (వారానికి ఐదు రోజులు)
- ముంబయి CST-భువనేశ్వర్ (సికింద్రాబాద్, విజయవాడ మీదుగా) కోణార్క్ ఎక్స్ ప్రెస్ (01019/20).. (ప్రతిరోజు)
ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఈరోజు (మే 21) నుంచి టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు అయిపోయిన తర్వాత 200 వరకూ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
జూన్ 1 నుంచి నడపనున్న రైళ్లలో ఇంతకు ముందు ఉన్నట్లే స్లీపర్, ఏసీ, జనరల్ బోగీలు ఉంటాయి. రైళ్ల రాకపోకల సమయం, ఆగే స్టేషన్లు అలాగే ఉంటాయి. కానీ వీటిని ప్రత్యేక రైలు సేవలుగా నడిపిస్తారు.

ఫొటో సోర్స్, getty images
నిబంధనలు:
- ప్రయాణికులు రైళ్లలో, స్టేషన్లలో సామాజిక దూరం పాటించాలి.
- ప్రయాణించే ముందు థర్మల్ స్క్రీనింగ్ కోసం ప్రయాణికులు కనీసం 90 నిమిషాల ముందే స్టేషన్లకు చేరుకోవాలి.
- జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు.
- ప్రయాణికులందరూ కచ్చితంగా ఫేస్ మాస్కులు ధరించాలి.
- ఈ ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి(జనరల్) బోగీలో ప్రయాణించేవారు కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- సీట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సిన జనరల్ కోచ్‌లకు రెండో తరగతి సీటింగ్ రుసుము వసూలు చేస్తారు. రైళ్లలో అన్ని బోగీలలో సీట్లకు రిజర్వేషన్ చేసుకోవడం తప్పనిసరి
- రైలు టికెట్లు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి. రిజర్వేషన్ కౌంటర్లలో, రైల్వే స్టేషన్లలో టికెట్లు విక్రయించరు. రైళ్లలో ఎవరికీ టికెట్లు ఇవ్వడం ఉండదు.
- ప్రత్యేక రైళ్లలో వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణ తేదీకి 30 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- ఈ రైళ్లలో ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కూడా నిబంధనల ప్రకారమే జారీ అవుతాయి. అయితే కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తారు.
- ఈ ప్రత్యేక రైళ్లలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు విక్రయించరు.
- ప్రయాణికులందరూ తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- రైళ్లలో ముందుగా బుక్ చేసుకునే ఆహార సౌకర్యం లేదు. ప్రయాణికులు తమ ఆహారం, నీళ్లు స్వయంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్తో సహజీవనం: ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ ఎలా మొదలైంది.. మ్యాచ్‌లు ఎలా ఆడుతున్నారు
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- ఇండియా లాక్‌డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం
- తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?
- ‘20 తుపాన్లు చూశా.. ఈ తుపాను సాధారణంగానే కనిపిస్తోంది’
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




