కరోనావైరస్: దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు ‘రెడ్ జోన్' హాట్‌స్పాట్స్

దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెడ్ జోన్లుగా ప్రకటించిన ఆరు ప్రధాన నగరాల్లో దేశ రాజధాని దిల్లీ ఒకటి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

హైదరాబాద్, ముంబయి, దిల్లీ సహా భారత్‌లోని ఆరు ప్రధాన నగరాలను కేంద్ర ప్రభుత్వం కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి ‘రెడ్ జోన్లు’గా గుర్తించింది.

కరోనావైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి దేశంలోని వివిధ ప్రాంతాలను వివిధ రంగుల్లో జోన్లుగా గుర్తించేందుకు ప్రబుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇన్ఫెక్షన్ల వ్యాప్తి అత్యధికంగా ఉన్న హాట్‌స్పాట్లను రెడ్ జోన్లుగా గుర్తిస్తారు. ఇన్ఫెక్షన్లు కొంత మేర ఉంటే ఆరెంజ్ జోన్లుగా, మొత్తానికే లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా వర్గీకరిస్తారు.

line

భారతదేశంలో కరోనావైరస్ హాట్‌స్పాట్ జిల్లాలను సూచించే మ్యాప్

Sorry, your browser cannot display this map

రెడ్ జోన్లు ఏవంటే?

హైదరాబాద్, ముంబయి, దిల్లీలతోపాటు బెంగళూరు, కోల్‌కతా, చెన్నై కూడా రెడ్ జోన్ల జాబితాలో ఉన్నాయి.

వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామిక, తయారీ రంగ కేంద్రాలుగా ఉన్న చాలా ప్రాంతాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.

రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ల గుర్తింపు, పరీక్షల నిర్వహణను ముమ్మరం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. వచ్చే వారానికి వీటిని ఆరెంజ్ జోన్లుగా మార్చి, ఆ తర్వాత గ్రీన్ జోన్లుగా మార్చేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలు 14 రోజులపాటు కొత్త కరోనావైరస్ కేసులు రాకుండా ఉంటే ఆరెంజ్ జోన్‌లుగా మారతాయని, 28 రోజులపాటు ఇన్ఫెక్షన్లు నమోదవ్వకపోతే గ్రీన్ జోన్‌గా మారతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

హైదరాబాద్, ముంబయి, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై ఈ రెడ్ జోన్ల జాబితాలో ఉన్నాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్, ముంబయి, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై ఈ రెడ్ జోన్ల జాబితాలో ఉన్నాయి

ఏం చేస్తారంటే...

రెడ్ జోన్లలో పరీక్షల తీవ్రతను పెంచుతారు. వాటిలో ఎక్కడెక్కడ కరోనావైరస్ ప్రభావం ఎంతగా ఉందో గుర్తిస్తారు. పెద్దఎత్తున ‘పూల్ టెస్టింగ్’ నిర్వహించే ప్రణాళికలను ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ప్రకటించాయి.

‘పూల్ టెస్టింగ్’ అంటే చాలా మంది నుంచి సేకరించిన శాంపిల్స్ అన్నీ ఓ ట్యూబ్‌లో తీసుకుని, దాన్ని ఒకేసారి పరీక్షిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందుకోసం ఓ ప్రక్రియను సూచించింది.

పరీక్షలో ఫలితం ‘నెగిటివ్’ వస్తే, వాళ్లందరికీ వైరస్ లేనట్లే. ఒకవేళ ‘పాజిటివ్’ వస్తే, వాళ్లందరిపై విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు.

పెద్ద సంఖ్యలో జనాన్ని పరీక్షించేందుకు ఈ ‘పూల్ టెస్టింగ్’ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఏప్రిల్ 20 తర్వాత లాక్‌డౌన్ విషయంలో కొన్ని ప్రాంతాల్లో మినహాయింపులు ఇస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికి రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాలు, జిల్లాలకు మాత్రం ఈ మినహాయింపులు ఇవ్వరు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)