దిల్లీ హింస: తప్పిపోయిన పది రోజుల తర్వాత తల్లి ఒడికి చేరిన మూడేళ్ల చిన్నారి

ఫొటో సోర్స్, VIJAYTA LALWANI/SCROLL
కొద్ది రోజుల క్రితం అల్లర్ల కారణంగా తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతున్న ఓ కుటుంబానికి మసీదు వద్ద ఓ మూడేళ్ల చిన్నారి కనిపించిందన్న వార్తను బీబీసీ ప్రచురించింది.
మహమ్మద్ సూద్ ఆలమ్, అతని భార్య దిల్లీలోని శివ్ విహార్ ప్రాంతానికి వెళ్తుండగా ఆ చిన్నారిని గమనించారు.
రాళ్ల దాడుల కారణంగా హింస చెలరేగిన సమయంలో తాము ఆ చిన్నారిని మదీనా మసీదు దగ్గర చూశామని.. ఆమె తలకు గాయంకావడంతో ఏడుస్తూ కనిపించిందని ఆలమ్ బీబీసీతో అన్నారు.
ఆమెను తమతో పాటు తమకు ఆశ్రయం కల్పించిన ప్రాంతానికి తీసుకువెళ్లిపోయామని చెప్పారు.

ఇంటింటికీ వెళ్లి విచారించిన దిల్లీ మహిళా కమిషన్
అయితే మీడియాలో ఆ చిన్నారి గురించి కథనాలు ప్రసారంకావడంతో దిల్లీ మహిళా కమిషన్ బృందం ఆ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి విచారించింది. అలాగే ఆ చిన్నారి కనిపించిన మసీదు దగ్గర బహిరంగ ప్రకటనలు చేయించింది కూడా.
బుధవారం ఆ చిన్నారి తాత మహమ్మద్ హరూన్‌కు ఓ స్వచ్ఛంద సేవకుని ద్వారా తన మనవరాలి ఆచూకీ తెలిసింది. దీంతో వెంటనే ఆయన పోలీసుల్ని సంప్రదించారు.
ఆ చిన్నారి పేరు సఫియా అని ఆమె తమ దగ్గరే ఉంటోందని చెప్పారు. సఫియా తల్లిదండ్రులిద్దరూ నగరంలోని వేరే ప్రాంతంలో ఓ డ్రైనేజీ ప్రాజెక్టులో రోజుకూలీలుగా పని చేస్తుండటంతో ఆమె ఆలనా పాలనా తామే చూస్తున్నామని అన్నారు.
ఫిబ్రవరి 24న అల్లర్ల నుంచి తాము తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా సఫియా తప్పిపోయిందని చెప్పారు.
సఫియా తల్లిదండ్రులు ఆమె తమ బిడ్డేనంటూ ఆమెకు సంబంధించిన ఆధారాలను చూపించడంతో పోలీసులు ఆ చిన్నారిని వారికి అప్పగించారు.
తన తల్లిని చూడగానే సఫియా ఒక్కసారిగా ఆమెను హత్తుకొని తన తల్లి ఒడిలో హాయిగా విశ్రాంతి తీసుకుంది. ఈ అపురూపమైన సన్నివేశానికి సాక్ష్యంగా నిలిచామని స్క్రోల్ వెబ్ సైట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి
- దిల్లీ హింస: 20కి చేరిన మృతుల సంఖ్య
- దిల్లీ హింస: వదంతులు ఎంత భయంకరమైనవంటే...
- దిల్లీ హింస: పోలీసుపై తుపాకీ గురిపెట్టిన ఈ వ్యక్తి ఎవరు?
- దిల్లీ హింస: అల్లర్ల నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారా?
- పొత్తూరి వెంకటేశ్వర్రావు (1934-2020): 'వృత్తి ధర్మాన్ని నిష్ఠగా పాటించిన సంపాదకుడు'
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్... మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రేవంత్ రెడ్డి అరెస్ట్: డ్రోన్లతో ప్రైవేట్ ఆస్తులను చిత్రీకరించారనే కేసులో 14 రోజుల రిమాండ్
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










