మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

సైన్యంలో మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్, కమాండింగ్ రోల్స్ ఇవ్వాల్సిందేనని, దానిపై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

భారత సైన్యంలో పనిచేస్తున్న అందరు మహిళాధికారులకు వారు ఎన్ని సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా శాశ్వత కమిషన్ వర్తింప చేయాలని కోర్టు వెల్లడించింది.

ఈ ఆదేశాలను మూడు నెలల్లో అమలుచేయాలని సూచించింది.

అడ్డగీత
News image
అడ్డగీత

దిల్లీ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.

దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

"సైనికులు తమ బాధ్యతలను నిర్వహించడానికి శారీరక సామర్థ్యం కావాలి. సైన్యంలో మహిళలు ఇప్పుడు పరిణామ ప్రక్రియ" అని తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

మహిళలకు శాశ్వత కమిషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు చాలా ప్రత్యేకమైనవని ఆయన వ్యాఖ్యానించారు.

దిల్లీ హైకోర్టు తీర్పు అనంతరం మహిళా అధికారులకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత కమిషన్‌ను ఇచ్చి ఉండాలి అని సుప్రీం కోర్టు తెలిపింది.

"మహిళలకున్న శారీరక పరిమితులు, సామాజిక కట్టుబాట్ల ఆధారంగా వారి అవకాశాలకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం ఇబ్బంది కలిగిస్తోంది, దీన్ని అంగీకరించలేం. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఇవ్వకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో పక్షపాతంతో వ్యవహరించింది. మహిళలకు సంబంధించి కేంద్ర తన ఆలోచనలను మార్చుకోవాలి. వారికి పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలి" అని కోర్టు స్పష్టం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇదో చారిత్రక తీర్పు అని, మహిళకు సమాన అవకాశాలు కల్పించాలని లెఫ్టినెంట్ కల్నల్ సీమా సింగ్ అభిప్రాయపడ్డారు.

అంతకుముందు, సర్వీస్ నిబంధనలను పూర్తి చేసిన మహిళాధికారులకు పెన్షన్ ప్రయోజనాలు కల్పించేందుకు ఆర్మీ సానుకూలంగా ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

భారత సైన్యంలో మహిళలను చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతోందని, వారికి సరిపడే, వారు నిర్వర్తించగలిగే అన్ని రకాల బాధ్యతలనూ వారికి అప్పగిస్తామని ఆర్మీ తెలిపింది.

దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది మహిళలకు, సైన్యానికి కూడా ప్రయోజనం కలిగించేలా ఉంటుందని స్పష్టం చేసింది.

మిలిటరీ పోలీస్ విభాగంలో మహిళలను జవాన్లుగా చేర్చుకునే ప్రక్రియకు గత సంవత్సరం ఏప్రిల్‌లో ఆర్మీ శ్రీకారం చుట్టింది.

సైన్యంలో మహిళలు

ఫొటో సోర్స్, AFP

సైన్యంలో పదాతి దళ పోరాట విధుల్లో మహిళల నియామకంపై ఉన్న నిషేధం ఎత్తివేసి, కమాండర్ల పోస్టుల్లో వారిని నియమించే విషయాన్ని పరిశీలించాలని గత నెలలో భారత సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

పురుషులతో సమానంగా వారిని పరీక్షించాలని, వారిని ఓ వర్గంగా పక్కన పెట్టొద్దని సూచించింది. ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలని వ్యాఖ్యానించింది.

అయితే, కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం దీనిపై తమ స్పందనను సుప్రీం కోర్టుకు తెలియజేసింది. క్షేత్ర పోరాట విధులకు మహిళలు తగినవారు కాదని పేర్కొంది.

'మహిళా అధికారులను కమాండర్లుగా అంగీకరించేలా పురుష జవాన్లు ఇంకా మానసికంగా సన్నద్ధం కాలేదని , 'మాతృత్వం, ప్రసూతి, పిలల్ల పోషణ లాంటి సవాళ్లు' కూడా ఉన్నాయని తెలిపింది.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)