కరోనావైరస్ ప్రభావంతో చైనాకు ఏపీ, తెలంగాణల మిర్చి ఎగుమతులు పడిపోయాయా?

ఫొటో సోర్స్, iStock
తెలుగు రాష్ట్రాల లోని గుంటూరు, వరంగల్, ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి చైనాకు భారీగా ఎగుమతులు జరుగుతాయి. అక్కడి వ్యాపారుల అంచనా ప్రకారం ప్రతి నెల దాదాపు 600-700 కంటైనర్ల మిర్చి చైనాకు ఎగుమతి అవుతుంది.
అందులోనే తేజ రకం మిర్చి కి చైనా లో డిమాండ్ ఎక్కువ. ఒక కంటైనర్ లో దాదాపు 15000 కేజీలు ఉంటాయని మిర్చి ట్రేడర్స్ అసోసియేషన్ కార్యదర్శి తోట రామకృష్ణ అంటున్నారు.


చైనాకు నెలవారీ సగటు ఎగుమతి 600-700 కంటైనర్లు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతుల సీజన్ డిసెంబరులో ప్రారంభం అవుతుంది. కానీ, ఈ ఏడాది మార్కెట్ కు మిర్చి సరఫరా ఆలస్యమైంది. డిసెంబరులో చైనాకు 350 కంటైనర్లు, జనవరిలో 550 కంటైనర్లు ఉంది.
అయితే, ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్‌కు ఎగుమతులు పెరిగాయి. డిసెంబరు ప్రాంతంలో చైనా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఆ దేశానికి ఎగుమతులు తగ్గుతాయని కూడా వర్తకులు చెబుతున్నారు.
ఈ ఏడాది దానికి అదనంగా కరోనావైరస్ ప్రభావం కొంత ఉంది. అంతేకాదు మధ్య ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎర్ర మిర్చి పంట దెబ్బదినడంతో దేశీయ వినియోగం కూడా పెరిగింది. ఎగుమతుల్లో తగ్గుదల లోటును ఈ దేశీయ ఎగుమతులు, బంగ్లాదేశ్ ఎగుమతి పూడుస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుతం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ లో కేజీ మిర్చి ధర 130-140 రూపాయలు ఉంది. గత సంవత్సరం ఇదే సమయం లో ధర 70-80 రూపాయలు ఉండేదని రామకృష్ణ తెలిపారు.
గుంటూరు, కృష్ణ, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో మిర్చి సాగు చేస్తారు. దాదాపు 10-12 రకాల మిర్చి ఇక్కడ పండుతుంది. అందులో తేజ రకం ఒకటి. ప్రస్తుతం మంచి నాణ్యత గల తేజ రకం మిర్చి క్వింటాల్ కు కనిష్ట ధర ౩౦౦౦ రూపాయలు ఉంటె గరిష్ట ధర 17500 రూపాయలు ఉందని మార్కెట్ చైర్మన్ ఏసురత్నం తెలిపారు.
సాధారణంగా మిర్చి పంటా డిసెంబర్ నుంచి మే వరకు మార్కెట్ లో అమ్మకం కొనుగోలు జరుగుతాయి. అయితే డిసెంబర్ నెల ముగిసే సరికి, తేజ మిర్చి రకం గరిష్ట ధర 21,500 రూపాయలు ఉండింది. "దానికి కారణం అప్పుడు మిర్చి పంట ఇంకా మార్కెట్ కి చేరకపోవడం వల్ల సరఫరా దిగువ లో ఉండడం తో ధర ఎక్కువగా ఉండింది" అని వివరించారు ఏసురత్నం. జనవరి నెల నుంచి పంట మార్కెట్ కి రావటం తో మళ్లీ ధరలు నిలకడగా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రాణాంతక కరోనావైరస్ ప్రబలిన చైనాకు తగ్గినా ఎగుమతుల కారణంగా ధరలపై ప్రభావం పడింది అనడం సరికాదని అంటున్నారు మిర్చి వ్యాపారస్తులు. వియత్నాం, శ్రీ లంక దేశాలకు ఎగుమతులు ఏదా విధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అంతేకాకుండా, దేశంలోనే మిర్చికి డిమాండ్ పెరిగిందని కూడా అంటున్నారు. బంగ్లాదేశ్‌కు ఎగుమతులు చైనా వల్ల కలుగుతున్న లోటును భర్తీ చేస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, iStock
అయితే, చైనాకు ఎగుమతులు తగ్గడం వల్ల మిర్చి ధరలు తగ్గాయని అనలేమంటున్నారు ట్రేడర్లు. నిజానికి, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర ఇంకా పెరిగిందని వారంటున్నారు.
అయితే, మిగిలిన దేశాలకు ఎగుమతులు కొనసాగడం తో అలాగే దేశం లోనే మిర్చి కి డిమాండ్ పెరగడం తో మార్కెట్ లో మిర్చి నిలకడగా ఉందని అంటున్నారు

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










