ఉత్తరప్రదేశ్ పిల్లల కిడ్నాప్: 23 మంది పిల్లలు క్షేమం... ఎన్‌కౌంటర్‌లో కిడ్నాపర్, అతడి భార్య మృతి

సుభాష్ బాథమ్

ఫొటో సోర్స్, NAVNEET JAISWAL

ఫొటో క్యాప్షన్, నిందితుడు సుభాష్ బాథమ్
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ జిల్లా మొహమ్మదాబాద్ పట్టణంలో 23 మంది పిల్లలను బంధించిన సుభాష్ బాథమ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతిచెందాడు. పిల్లలందరినీ సురక్షితంగా కాపాడారు.

కిడ్నాపర్ సుభాష్ పోలీస్ ఎన్‌కౌంటర్లో చనిపోయాడని, పిల్లలందరినీ కాపాడామని కాన్పూర్ పరిధి పోలీస్ ఐజీ మోహిత్ అగ్రవాల్ బీబీసీకి చెప్పారు.

ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో కిడ్నాపర్ భార్య కూడా చనిపోయిందని ఐజీ చెప్పారు.

గీత
News image
గీత

"పిల్లలను వదలాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని, తనపై ఉన్న హత్య కేసును కూడా వెనక్కు తీసుకోవాలని కిడ్నాపర్ డిమాండ్ చేశాడు" అని ఆయన చెప్పాడు.

రాత్రి అంతకు ముందు కిడ్నాపర్ ఒక్క పిల్లాడిని కూడా విడుదల చేశాడు.

పిల్లల కిడ్నాప్

ఫొటో సోర్స్, SAMEER/BBC

బందీలుగా ఉన్న పిల్లలను విడిపించడానికి ఏటీఎస్ కమాండోలను పిలిపించారు. వారితోపాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.

మొహమ్మదాబాద్ తాలూకాలోని కర్సియా గ్రామంలో పిల్లలను బంధీలుగా ఉంచిన ఇల్లు సుభాష్ బాథమ్‌ సొంత ఇల్లు.

పోలీసుల వివరాల ప్రకారం సుభాష్ బాథమ్ ఒక కరడుగట్టిన నేరస్థుడు. అతడు చాలాసార్లు జైలుకు కూడా వెళ్లాడు. అతడిపై హత్య కేసు కూడా నడుస్తోంది.

"గురువారం మధ్యాహ్నం కూతురి పుట్టినరోజు పేరుతో సుభాష్ భాథమ్ గ్రామంలోని పిల్లలను తన ఇంటికి విందుకు పిలిచాడు. పిల్లలందరూ మధ్యాహ్నం సుమారు 3 గంటలకు అతడి ఇంటికి వెళ్లగానే, సుభాష్ ఇంటి మెయిన్ తలుపును లోపల నుంచి గడియ పెట్టాడు" అని స్థానికులు చెప్పారు.

పిల్లల కిడ్నాప్

ఫొటో సోర్స్, SAMEER/BBBC

సాయంత్రం సుమారు 4.30కు ఒక మహిళ పిల్లలను తీసుకెళ్లడానికి అక్కడికి వెళ్లినప్పుడు, సుభాష్ పిల్లలందరినీ బంధించాడని ఆమెకు తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

"పిల్లల్లో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా పోలీసులు పూర్తిగా ప్రయత్నించారని, కానీ, ఈ మొత్తం ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని" ఫరూఖాబాద్ ఎస్పీ అనిల్ కుమార్ చెప్పారు.

అక్కడికి చేరుకున్న పోలీసులను చూడగానే సుభాష్ బాథమ్ ఫైరింగ్ ప్రారంభించాడని, కొన్ని నాటు బాంబులు కూడా వేశాడని చెబుతున్నారు.

పిల్లల కిడ్నాప్

ఫొటో సోర్స్, SAMEER/BBC

"సుభాష్‌తో మాట్లాడాలని అతడి ఇంటి వైపు వెళ్తున్నప్పుడు, తను నాపై కూడా కాల్పులు జరిపాడు, నా కాలుకు బుల్లెట్ తగిలింది" అని అదే గ్రామానికే చెందిన అనుపమ్ దూబే మీడియాకు చెప్పారు.

ఆ సమయంలో సుభాష్ అందరినీ బెదిరిస్తూనే ఉన్నాడు. తన దగ్గర 30 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని పేల్చేస్తానని భయపెట్టాడు.

పిల్లలను బంధించడం వెనుక అతడి ఉద్దేశం ఏంటో చాలాసేపటివరకు ఎవరికీ తెలీలేదు. ఎమ్మెల్యేలు, అధికారులను అక్కడికి పిలిపించాలని బాథమ్ డిమాండ్ చేశాడు. కానీ తర్వాత పరిస్థితిలో స్పష్టత వచ్చింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)