కరోనావైరస్: భారత్‌లో బయటపడిన తొలి కేసు.. చైనా నుంచి వచ్చిన విద్యార్థికి ఇన్ఫెక్షన్

కరోనా వైరస్

ఫొటో సోర్స్, MOHFW_INDIA

ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న కరోనా వైరస్ ప్రకంపనలు భారత్‌లోనూ మొదలయ్యాయి.

కేరళలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది.

చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఓ విద్యార్థికి కరోనావైరస్ సోకినట్లు గుర్తించామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆసుపత్రిలో ఆ రోగిని విడిగా ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

రోగి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది.

Presentational grey line
News image
Presentational grey line

కరోనావైరస్ బారిన పడి ఉండొచ్చన్న అనుమానంతో కేరళలో 400కుపైగా మందిని వారి ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

దిల్లీ, ముంబయిలోనూ కొన్ని అనుమానిత కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 1 తర్వాత చైనా నుంచి వచ్చినవారు ఎవరైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ సూచించింది.

దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో దాదాపు 30 వేల మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు.

వుహాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చైనాతో భారత్ సంప్రదింపులు కూడా జరుపుతోంది.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ వల్ల చైనాలో వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్‌ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి.

ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు చైనా అధికారులు కొన్ని నగరాలను దేశంలోని మిగతా ప్రాంతాలతో వేరు చేశారు.

ఇది చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సమయం. కానీ మారిన పరిస్థితులతో ఎన్నో కార్యక్రమాలను రద్దు చేశారు.

చైనాకు దాదాపు మధ్యలో ఉండే హుబే ప్రాంతంలో కరోనావైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది.

దీంతో, చైనా అధికారులు మిగతా నగరాల నుంచి హుబే ప్రాంతానికి రాకపోకలు నిషేధించారు.

ముందు ముందు కరోనావైరస్‌ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ప్రస్తుతం చైనాలో ఆంక్షల జాబితా పెరుగుతూ పోతోంది. ఎక్కువ దేశాల్లో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను ఇంకా 'అంతర్జాతీయ అత్యవసరస్థితి'గా ప్రకటించలేదు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)