CAA - జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిరసనకారులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు

ఫొటో సోర్స్, Reuters
దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి గాయపడ్డాడు.
‘యే లో ఆజాదీ’ (ఇదిగో తీసుకోండి మీ స్వేచ్ఛ) అని కాల్పులు జరిపిన వ్యక్తి అరవడం వీడియోలో రికార్డయింది. చుట్టూ భారీగా పోలీసులు ఉన్నప్పటికీ నల్ల జాకెట్, తెల్ల ప్యాంట్ ధరించిన ఆ వ్యక్తి తుపాకీతో నిరసనకారులను బెదిరించడం వీడియోలో రికార్డయింది.
అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో యూనివర్సిటీ పరిసరాల్లో ఆందోళన నెలకొంది.
గాయపడిన వ్యక్తిని షాదాబ్ అనే విద్యార్థిగా గుర్తించారు. రక్తం మడుగులో ఉన్న ఆ యువకుడిని చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించారు.
యూనివర్సిటీ పరిసరాల్లోని అన్ని రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించారు.
గత నెలలో కూడా జామియా మిలియా యూనివర్సిటీలో హింస చెలరేగింది. విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిపై విమర్శలు ఎదురయ్యాయి.
మరోపక్క ఈ నెలలో కొందరు ముసుగులు ధరించిన దుండగులు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులు, టీచర్లపై దాడి చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.
జామియా మిలియా యూనివర్సిటీకి దగ్గర్లోని షాహీన్ బాగ్ ప్రాంతంలో గత ఆరు వారాలుగా నిరసనల చేపడుతున్న మహిళలు ఈ రోజు షాహీన్ బాగ్ నుంచి మహాత్మగాంధీ స్మారకం అయిన రాజ్‌ఘాట్ వరకు పాదయాత్ర చేపట్టాలని ప్రయత్నించారు. కానీ, దానికి పోలీసులు అనుమతించలేదు.

ఇవి కూడా చదవండి:
- సీఏఏ, ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై ఈయూ పార్లమెంటులో చర్చలు.. భారత్ వ్యతిరేక ప్రతిపాదనలు
- CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- కరోనావైరస్: చైనాలో 80 మంది మృతి... విదేశాలకు విస్తరిస్తున్న భయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








