ఇర్ఫాన్ పఠాన్: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కపిల్ దేవ్ అంతటి ప్రమాదకర స్వింగ్, సీమ్ బౌలర్

ఫొటో సోర్స్, Getty Images
భారత్ 2007 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్ని ఫార్మాట్ల నుంచి శనివారం నాడు రిటైర్మెంట్ ప్రకటించాడు.
"అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి నేను రిటైర్ అవుతున్నా. ఆటలో దిగ్గజాలైన గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి వాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నా అదృష్టం. ఇక వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది" అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.
"నాకు అన్ని సందర్భాల్లో మద్దతునిచ్చిన నా కుటుంబానికి ధన్యవాదాలు. నా అభిమానులకు కృతజ్ఞతలు. నేను మళ్లీ క్రికెట్ ఆడాలని వారంతా కోరుకున్నారు. వాళ్ల తోడ్పాటే నన్ను ముందుకు నడిపించింది" అని ఇర్ఫాన్ అన్నాడు.
భారత్ తరపున ఆడిన 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్.. కపిల్ దేవ్ తర్వాత అంతటి ప్రమాదకర స్వింగ్, సీమ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
2007లో మొదటి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత విజయంలో ఇర్ఫాన్‌ది కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి, కేవలం 16 పరుగులే ఇచ్చిన ఇర్ఫాన్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెల్చుకున్నాడు.

ఫొటో సోర్స్, ANI
భారత్ తరపున టెస్టుల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన ముగ్గురు బౌలర్లలో ఇర్ఫాన్ ఒకడు. అంతేకాదు, మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఆ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 2006లో సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసఫ్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు.
లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ తరపున ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 301 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ సెంచరీ, 11 అర్థ సెంచరీలతో 2821 పరుగులు కూడా సాధించాడు.
2003లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో పఠాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్‌ను భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెల్చుకుంది. పఠాన్ కూడా తన తొలి వికెట్ సాధించాడు.
2012లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ పఠాన్‌కు చివరిది.
ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ జమ్ము, కశ్మీర్ క్రికెట్ జట్టుకు కోచ్-కం-మెంటార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి.
- బీసీసీఐ ప్రెసిడెంట్: నాడు విజయనగరం రాజ కుమారుడు.. నేడు కోల్‌కతా ‘ప్రిన్స్’.. 65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు కెప్టెన్‌కు పగ్గాలు
- ఐపీఎల్ 2020 వేలం: పాట్ కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా
- 2020: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు 'బంగారం' పంట పండిస్తుందా?
- మ్యాచ్ ఫిక్సింగ్పై వ్యవహారంపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్.. ‘అవన్నీ బయటపెట్టడం సరికాదు’
- దానిష్ కనేరియా: షోయబ్ అఖ్తర్ ఏమన్నాడు.. యూసఫ్ ఎందుకు ఖండించాడు...
- డే- నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పింక్ బాల్ ఎందుకు వాడతారు? ఇది ఆటను మార్చేస్తుందా?
- పాకిస్తాన్: 10 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ మ్యాచ్: శ్రీలంక జట్టుకు ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు?
- ఇస్రో: 'గగన్‌యాన్' వ్యోమగాముల ఎంపిక ఎలా జరుగుతుంది?
- 'సూర్యుడు ఓం అంటూ జపం చేస్తున్నాడు’: నాసా వీడియో అంటూ కిరణ్‌బేడి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
- ఇరాన్‌కు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఉందా
- యూపీ పోలీస్, మోదీ ప్రభుత్వంపై మరో ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్
- వివాహ వేదికల నుంచి ఉచిత న్యాయ సేవల వరకు... పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా యువత ఎలా ఉద్యమిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








