'సూర్యుడు ఓం అంటూ జపం చేస్తున్నాడు’: నాసా వీడియో అంటూ కిరణ్‌బేడి ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్

ఫొటో సోర్స్, @thekiranbedi
సూర్యుడి 'ఓం' అంటూ జపం చేస్తున్నాడని.. సూర్యుడి ఆ శబ్దాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) రికార్డ్ చేసిన వీడియో ఇది అంటూ.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
అయితే.. ఆ వీడియో బూటకం అంటూ కిరణ్ బేడీ మీద నెటిజెన్లు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో ట్వీట్లు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కిరణ్‌బేడీ శనివారం ఉదయం 8.11 గంటలకు ట్వీట్ చేసిన ఈ వీడియో పోస్టుకు ఏడు గంటల్లో ఏడు వేల కామెంట్లు, ఏడు వేల రీట్వీట్లు వచ్చాయి. అయితే.. అదే సమయంలో దాదాపు 22 వేల మంది ఆ ట్వీట్‌ను లైక్ చేయటం విశేషం.
మొత్తం 1:50 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఏడు గంటల్లో దాదాపు 5.65 లక్షల మంది వీక్షించారు. కిరణ్ బేడీకి ట్విటర్‌లో 1.21 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.
కిరణ్ బేడీ ట్వీట్‌కు.. ప్రొఫెసర్ దిలీప్ మండల్ బదులిస్తూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ కింద గల ప్రాథమిక విధులను ప్రస్తావించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘(హెచ్) శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసను, పరిశోధనా సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవటం’ భారత పౌరులందరి విధి’’ అని చెప్తున్న విషయాన్ని ఉటంకించారు.
‘‘రేడియో తరంగాలు ప్రవహించటానికి ఒక మాధ్యమం అవసరం. కాబట్టి అంతరిక్ష శూన్యంలో అవి ప్రయాణించలేవు. పైగా.. సూర్యుడి నుంచి ‘ఓం’ రూపంలో శబ్ద తరంగాలు వెలువడుతున్నాయనేందుకు ఆధారాలు లేవు’’ అంటూ గూగుల్ సెర్చ్‌లో వచ్చిన ఒక కోరా వివరణను ఒక యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘ఒకప్పుడు కిరణ్ బేడీ అనే ఒక హీరో ఉండేవారు. మీకు గనుక ఆమె కనిపించినట్లయితే నాకు తెలియజేయండి.. ఈ లోగా నాసా నిజమైన వీడియోను ఆస్వాదించండి’’ అంటూ పవన్ సంతోష్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
నాసా 2018 జులైలో సూర్యుడు మౌనంగా లేడని చెప్తూ ‘సూర్యుడి శబ్దాలు’ పేరుతో ట్వటిర్‌లో కూడా పోస్ట్ చేసిన వీడియోను కొందరు యూజర్లు రీట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
వాట్సాప్‌లో ఫేక్ వీడియో...
నిజానికి.. సూర్యుడు ఓం అని శబ్దం చేస్తున్నాడని.. దీనిని నాసా రికార్డు చేసిందని చెప్తున్న సదరు వీడియో కొంత కాలంగా వాట్సాప్‌లో ఫార్వర్డ్ అవుతూ ఉంది. అది నకిలీ వీడియో అని అనేక ‘ఫ్యాక్ట్ చెక్’ వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి కూడా.
అదే వాట్సాప్ వీడియోను కిరణ్‌బేడీ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసి ట్రోలింగ్ బారిన పడ్డారు.
‘‘ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి.. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజీలను వాటి ఆధారాలను పరిశీలించకుండా నమ్మగలిగితే.. సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటి?’’ అని అశోక్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
2014 తర్వాత సూర్యుడు సైతం ‘వా మోదీ జీ వాహ్’ అంటూ జపం చేయటం ప్రారంభించాడని ఎద్దేవా చేస్తూ.. ఏజీ అనే యూజర్ ఒక వీడియోను పోస్టు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
మరోవైపు కిరణ్‌బేడీ ట్వీట్‌ను సమర్థిస్తూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీని విమర్శిస్తూ కూడా కొంత మంది పోస్టులు పెట్టారు.
కిరణ్‌బేడీ ట్వీట్‌లో చెప్పిన విషయాన్ని ‘నా చెంచాలు నమ్మరు’ అని రాహుల్ చెప్తున్నట్లుగా రిషబ్ అనే యూజర్ పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
"దీనిని ఒక కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ నిజంగా విశ్వసిస్తున్నారా? ఆదర్శనీయులైన వారు.. తాము ట్వీట్ చేస్తున్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని గోపీ మీనన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
ఆయనకు ఎన్.భట్టాచార్జీ అనే ట్విటర్ యూజర్ బదులిస్తూ.. ‘‘భారతదేశంలో అత్యంత కష్టమైన పరీక్షను ఆమె పాసై ఐపీఎస్ అధికారి అయ్యారు. ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్‌ని ఆమె లేదా అతడి జ్ఞానం గురించి ఎన్నడూ సవాల్ చేయవద్దు. ఆమె యూనిఫాం మీద ఉన్న పతకాలు.. ఆమె ధైర్యసాహసాలకు లభించాయి. ప్రతి ఒక భారతీయ బాలికకూ ఆమె ఆదర్శం’’ అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
కిరణ్‌బేడీ ‘సూర్యుడి ఓం జపం’ ట్వీట్‌కు జవాబుగా చేసిన ట్వీట్లలో అత్యధిక శాతం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వచ్చినవే.
ఇవి కూడా చదవండి:
- కిరణ్ బేడీని ఇందిరా గాంధీ లంచ్‌కు ఎందుకు ఆహ్వానించారు?
- నిత్యానంద: కోతులకు సంస్కృతం నేర్పించానంటారు... సూర్యుడిని ఆపేశానని చెబుతారు
- ఉదయించే సూర్యుడు ఉన్న ఈ జెండాపై వివాదమెందుకు?
- అత్తల పెత్తనం కోడళ్లకు ‘శాపం’గా మారుతోందా.. అత్తలతో కలిసి ఉండటంపై కోడళ్లు ఏమన్నారు
- ఏడు దశాబ్దాల కిందట సముద్రంలో అణుబాంబు పేలుడు.. ఇంకా మానని గాయం
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)