అయోధ్య కేసులో అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

అయోధ్య కేసుకు సంబంధించి దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా(బాల రాముడు)కే చెందుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ 18 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.

అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ), నిర్మోహీ అఖారాతో పాటు దాదాపు 40 వరకు ప్రజాసంఘాలు ఈ పిటిషన్లు వేశాయి.

అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల తుది తీర్పు వెలువరించింది.

ఈ స్థలమంతా హిందువులకే చెందుతుందని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు ఇచ్చింది.

అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అనేక సంస్థలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)