‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, wtchyd2017/twitter
తెలుగు భాషను తమపై రుద్దవద్దంటూ తమిళనాడుకు చెందిన కొందరు ట్విటర్‌లో గొంతెత్తుతున్నారు.
ఆదివారం రాత్రి నుంచి #StopTeluguImposition అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయానికి ఈ హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్త ట్రెండ్స్‌లోకి వచ్చింది.
ఉలకథ్ తమిళ్ (తమిళ భాష పరిశోధన కేంద్రం)లో అదనపు భాషగా తెలుగును బోధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఈ పరిణామానికి కారణం.
ఈ నిర్ణయంపై చాలా మంది తమిళులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు హిందీ..
ఉలకథ్ తమిళ్‌లో అదనపు భాషగా హిందీని బోధించాలని ఇదివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని తమిళులు తీవ్రంగా వ్యతిరేకించారు.
#StopHindiImposition అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. హిందీకి బదులుగా అదనపు భాషగా తెలుగును బోధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
ఇంతకుముందు హిందీ బోధన కోసం కేటాయించిన రూ.3లక్షలు నిధులను తెలుగు కోసం ఇవ్వనున్నట్లు తెలిపింది.
అయితే, ఈ నిర్ణయాన్ని కూడా తమిళులు వ్యతిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘తెలుగు అవసరం ఏంటి..’
అదనపు భాషగా తెలుగునే బోధించాల్సిన అవసరం ఏముందని కొందరు తమిళులు ప్రశ్నిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తెలుగును నేర్చుకోవడం వల్ల తమకు చేకూరే ప్రయోజనం ఏంటని.. ఆ భాషకు బదులుగా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్‌లను ఎందుకు బోధించకూడదని గురు బాలాజీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలున్నాయని, తమిళనాడు తమిళంపై దృష్టి పెడితే చాలని ఇంకో వ్యక్తి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తమిళులు ఏ భాషకూ, జాతికీ వ్యతిరేకం కాదని.. ఇతర భాషలకు తమిళ పరిశోధన కేంద్రం నిధుల కేటాయింపును వ్యతిరేకిస్తూనే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నామని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/SURESH KOLICHALA
‘ఎందుకు అన్నింటినీ వ్యతిరేకిస్తారు’
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
#StopTeluguImposition హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నవారు మూర్ఖులని, 'గ్లోబలైజేషన్' అన్న పేరుతో ఇంగ్లీష్‌ను మాత్రం వారు అంగీకరిస్తారని రాహుల్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఇంగ్లీష్‌పై ఆధారపడకుండానే చైనా, జర్మనీ, కొరియా, జపాన్ 'గ్లోబలైషన్'లో భారత్ కన్నా చాలా ముందున్నాయని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
తమ భాష తప్పితే మిగతా భాషలన్నింటినీ తమిళులు ఎందుకు వ్యతిరేకిస్తుంటారని రన్‌విజయ్ అనే ఆయన ప్రశ్నించారు. ఈ వైఖరి వల్ల తమిళులపై విద్వేషపూరితమైనవారన్న ముద్ర పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
తమిళం తెలుగు కన్నా గొప్ప కాదని, తెలుగు తమిళం కన్నా గొప్ప కాదని తెలంగాణకు చెందిన శివానీ అనే ఆమె అభిప్రాయపడ్డారు. మిగతా భాషలను గౌరవించని వ్యక్తులు, తమ భాషకు మాత్రం గౌరవం లభించాలని ఎలా కోరుకుంటారని ఆమె ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
తమిళ రాజకీయాల్లోని కీలక నేతల్లో చాలా మందికి తెలుగు మూలాలున్న కారణంగానే కొందరు రాజకీయ ప్రయోజనం కోసం ఈ అంశాన్ని లేవనెత్తారని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. కామరాజ్ తర్వాత మళ్లీ సీఎం పదవి చేపట్టిన తమిళుడు ఎడప్పాడి పళనిస్వామి మాత్రమేనని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
తమిళులు, తెలుగు ప్రజలు ఒకరి భాషను మరొకరు గానీ, ఇంగ్లీష్‌ను గానీ నేర్చుకోకుండా.. హిందీని నేర్చుకోవాలని మరొకరు సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘తెలుగువాళ్లే రుద్దుకోరు..’
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
తెలుగు భాషను తెలుగు వాళ్లే రుద్దుకోరని, అసలు ఈ హ్యాష్‌ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతుందో తనకు అర్థం కావట్లేదని ఓ వ్యక్తి చురక అంటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
ద్రవిడ భాషల మధ్య దగ్గరి సంబంధాలున్న కారణంగా, తెలుగును నేర్చుకోవడం వల్ల తమిళ భాష పరిజ్ఞానం మరింత సుసుంపన్నం అవుతోందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
తమిళ కవి భారతీయార్ చెప్పిన పాఠాలు మరిచి, పెరియార్‌ను అనుసరిస్తున్నవారే ఇప్పుడు తెలుగుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని జయసింహా రెడ్డి అనే యూజర్ అభిప్రాయపడ్డారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
అదనపు ఆప్షన్‌గా తెలుగును నేర్చుకునే అవకాశం ఇవ్వడం భాషను రుద్దడం ఎలా అవుతుందని తేజా కలపాల అనే ఆయన ప్రశ్నించారు. అభద్రతా భావానికి కూడా పరిమితులుంటాయని, భారత్‌లో తమిళం కన్నా తెలుగు ఎక్కువ మంది మాట్లాడే భాష అన్న విషయం విస్మరించరాదని అన్నారు.

ఫొటో సోర్స్, mafoikprajan/twitter
‘తెలుగు, ఫ్రెంచ్ ఉంటాయి.. అవి కూడా తప్పనిసరి కాదు’
ఉలకథ్ తమిళ్‌లో తమిళంతోపాటు అదనంగా మరో స్థానిక భాష, ఇంకో విదేశీ భాషల బోధన కూడా ఉంటుందని, 2014లో ఈ విధానం తీసుకువచ్చారని తమిళనాడు సాంస్కృతిక శాఖ మంత్రి పాండిరాజన్ తెలియజేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా వెబ్‌సైట్ పేర్కొంది.
ఆ రెండు అదనపు భాషలను నేర్చుకోవాలా? వద్దా అన్నది విద్యార్థులే నిర్ణయించుకోవచ్చని పాండిరాజన్ చెప్పారని తెలిపింది.
‘‘అదనంగా బోధించే స్థానిక భాష స్థానంలో హిందీకి బదులుగా తెలుగును తెచ్చాం. ఈ విషయంపై డీఎంకే రాజకీయాలు చేస్తోందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉలకథ్ తమిళ్ విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు. అందుకే ఒక్క తమిళం మాత్రం నేర్చుకుంటే సరిపోదు. మరో స్థానిక భాష, విదేశీ భాష కూడా అవసరం’’ అని పాండిరాజన్ వ్యాఖ్యానించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఉలకథ్ తమిళ్‌లో హిందీ బోధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని డీఎంకే అధ్యక్షుడు ఎమ్‌కే స్టాలిన్ స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు సభలు తేల్చిందేమిటి?
- దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందా?
- ఠాక్రే ట్రైలర్: దక్షిణ భారతీయులంటే బాల్ ఠాక్రేకు ఎందుకు నచ్చదు?
- మనిషి మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టాడు...
- ఏదైనా సరే... 20 గంటల్లోనే నేర్చుకోవడం ఎలా
- ‘ప్రపంచ భాష ఇంగ్లిష్’కు రోజులు దగ్గరపడ్డాయా!
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)