ముంబయి విమానాశ్రయంలో తమిళ యువకుడికి చేదు అనుభవం: ''నీకు హిందీ రాకపోతే తిరిగి తమిళనాడు వెళ్లిపో''

అబ్రహాం సామ్యూల్

ఫొటో సోర్స్, TWITTER/ GETTY IMAGES

    • రచయిత, సాయిరామ్ జయరామన్
    • హోదా, బీబీసీ తమిళ్

''హిందీ భాషను బలవంతంగా రుద్దే విఫల ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం మళ్లీ మళ్లీ చేస్తుంటే.. అది దేశంలో విభజనలకు దారితీస్తుంది'' అని తమిళనాడుకు చెందిన యువకుడు అబ్రహామ్ సామ్యూల్ వ్యాఖ్యానించారు.

ఆయనకు కొద్ది రోజుల కిందట ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.

''ముంబయి సీఎస్‌టీ విమానాశ్రయంలో కౌంటర్ 33 వద్ద ఓ ఇమిగ్రేషన్ అధికారి నాకు క్లియరెన్స్ ఇవ్వటానికి నిరాకరించారు. నాకు కేవలం తమిళం, ఇంగ్లిష్ మాత్రమే రావటం.. హిందీ భాష తెలియకపోవటం దానికి కారణం. ఎంత దారుణం'' అంటూ అబ్రహాం జనవరి 8వ తేదీన ట్వీట్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలను ఆ ట్వీట్‌తో ట్యాగ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆ ఘటనకు సంబంధించి అబ్రహామ్ పలు ట్వీట్లు చేసిన తర్వాత.. తమిళనాడు సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతూ అతడి ట్వీట్‌ని రీట్వీట్ చేశారు.

ఇదే తరహా అనుభవాలు ఎదుర్కొన్న కొంత మంది తమ ఉదంతాలను కూడా వివరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అదే సమయంలో.. ఒక వర్గం జనం అబ్రహాంను ఒక రాజకీయ శిబిరం నడిపిస్తోందని ఆరోపించారు. ఆయన తన ట్వీట్లలో రాజకీయ నాయకులను ట్యాగ్ చేయటానికి కారణమేమిటని ప్రశ్నించారు.

ముంబై విమానాశ్రయంలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవటానికి బీబీసీ తమిళ్ అబ్రహాం సామ్యూల్‌తో మాట్లాడింది. ఆయన ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు.

ముంబై విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

''అసలు ఊహించని సంఘటన''

''న్యూయార్క్‌లోని క్లార్క్‌సన్ యూనివర్సిటీలో నేను ప్రస్తుతం పీహెచ్‌డీ రెండో సంవత్సరం చేస్తున్నాను. తమిళనాడులోని మా ఇంట్లో ఒ నెల రోజులు గడపటానికి ఇండియా వచ్చాను. తిరిగి న్యూయార్క్ వెళ్లటానికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాను. ఎప్పట్లాగానే విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ (విదేశీ ప్రయాణానికి అనుమతి) కోసం లైన్‌లో నిలుచున్నాను'' అని ఆయన చెప్పారు.

''ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కౌంటర్ నంబర్ 33 దగ్గరకు వెళ్లాను. అక్కడున్న అధికారి నా పాస్‌పోర్ట్, వీసా తీసుకుని అదే పనిగా హిందీలో మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు ఒక్క మాట కూడా అర్థం కాకపోవటంతో.. 'సార్, నాకు హిందీ రాదు. తమిళ్, ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడగలను' అని నేను చాలా మర్యాదగా చెప్పాను. ఆయన వెంటనే 'నీకు హిందీ రాదా? అలాగైతే తిరిగి తమిళనాడు వెళ్లు. నీకు నేను క్లియరెన్స్ ఇవ్వను' అన్నారు. తర్వాత సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి 'ఇతడిని తమిళం తెలిసిన అధికారి దగ్గరికి తీసుకెళ్లు' అని వ్యంగ్యంగా చెప్పారు. నా స్వదేశంలో ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అనుకోలేదు'' అని వివరించారు.

విమానాశ్రయం

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడు తాను విమానం ఎక్కాల్సి ఉండటంతో కోపం, నిస్పృహలను నియంత్రించుకున్నానని అబ్రహాం చెప్పారు. ''అదే అధికారి.. క్యూలో నా ముందు ఉన్న ఓ విదేశీ మహిళతో ఇంగ్లిష్‌తో మాట్లాడటం నాకు గుర్తుంది. అంటే భాష ప్రాతిపదికగా నా మీద వివక్ష చూపించినట్లు నాకు అనిపిస్తోంది'' అని అన్నారు.

''నన్ను నేను నియంత్రించుకుంటూ 32వ నంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్లాను. అక్కడున్న ఇమిగ్రేషన్ అధికారి నాతో ఇంగ్లిష్‌లో మాట్లాడారు. రెండు, మూడు నిమిషాల్లో క్లియరెన్స్ వచ్చింది. ఆ తర్వాత నేను విమానాశ్రయం లోపల ఉన్న ఇమిగ్రేషన్ విభాగానికి వెళ్లి నాకు ఎదురైన పరిస్థితిని వివరించాను. వాళ్లు ఉన్నతాధికారులను, నాకు క్లియరెన్స్ ఇవ్వటానికి నిరాకరించిన సదరు అధికారిని పిలిచారు. ఆయన వస్తూనే సీనియర్ అధికారుల ముందు కూడా అలాగే మాట్లాడారు. కానీ, ఆయనను సరిదిద్దాల్సింది పోయి, 'ఆ అధికారి చాలా ఎక్కువ సేపటి నుంచి పని చేస్తున్నారు. ఒత్తిడి, ఆందోళన వల్ల అలా తప్పుగా ప్రవర్తించి ఉంటారు' అంటూ వారు సమర్ధించుకొచ్చారు. వారు చెప్తున్న కారణాలను నేను తిరస్కరించాను. విమానం ఎక్కి వచ్చేశాను'' అని ఆయన వివరించారు.

ఇండియా పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

''రహస్య అజెండా ఏదీ లేదు''

''నేను తమిళుడిని, భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నా. ప్రతి భారతీయుడికీ హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ ఆ అధికారి ప్రవర్తించిన తీరును సహించలేక పోయాను. అందుకే, ఈ అంశాన్ని ట్విటర్‌లో పంచుకున్నాను. హిందీ మాట్లాడని వారు ఇంకొకరికి ఎవరికీ ఇలా జరగకూడదని నేను పోరాడుతున్నాను'' అని చెప్పారు అబ్రహాం.

ఆయన తన ట్వీట్లకు ఒక రాజకీయ పార్టీని, నాయకులను ట్యాగ్ చేయటం గురించి అడిగినపుడు.. ''నేను ఓ సాధారణ ట్విటర్ యూజర్‌ని. నాకు తెలిసినంత వరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ట్విటర్‌లో చాలా క్రియాశీలంగా ఉంటారు. వారితో పాటు.. డీఎంకే చీఫ్ స్టాలిన్‌ను ట్యాగ్ చేశాను. ఎందుకంటే హిందీని బలవంతంగా రుద్దటాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లు మొదటి నుంచీ పోరాడుతున్నారు. ఈ కారణాలు తప్ప రహస్య అజెండా ఏదీ లేదు. నన్ను వెనుక నుంచి ఎవరూ నడిపించటమూ లేదు'' అని తెలిపారు.

అబ్రహాం సామ్యూల్

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్, అబ్రహాం సామ్యూల్

''నేను భారత ద్వేషినీ కాదు.. తమిళ ఛాందసవాదినీ కాదు''

''నేను తరచుగా ప్రయాణిస్తుంటాను. లండన్, పారిస్ విమానాశ్రయాల గుండా ప్రయాణించేటపుడు అక్కడ తమిళం మాట్లాడే అధికారులు కూడా ఎదురవుతుంటారు. కానీ.. తమిళం, ఇంగ్లిష్ కాకుండా మరో భాష మాట్లాడక పోవటం వల్ల నాకు క్లియరెన్స్ నిరాకరించారు. నా సొంత దేశంలో ఇటువంటి పరిస్థితిని నేను అసలు ఊహించనే లేదు'' అని అబ్రహాం వ్యాఖ్యానించారు.

''నేను భారత ద్వేషినీ కాదు.. తమిళ ఛాందసుడినీ కాదు. తమిళుడిని అయినందున నేను ఎంత గర్వపడతానో.. భారతీయుడిని అయినందుకు అంతగా గర్వంగా ఉంటుంది. ఇంతకుముందు నేను బ్రిటన్‌లో చదువుకున్నాను. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నా. కానీ ఈ దేశాల్లో శాశ్వతంగా ఉండిపోవాలని నేను ఎన్నడూ అనుకోలేదు. నా చదువు పూర్తయిన తర్వాత తమిళనాడు తిరిగి వచ్చి ఏదో ఒక రోజు నా సొంత సంస్థను ప్రారంభించాలని నేను కోరుకుంటున్నా'' అని చెప్పారు.

''భారతదేశం విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు గల ఓ విశిష్టమైన దేశం. కానీ కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను రుద్దటానికి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే అది దేశంలో విభజనలను సృష్టిస్తుంది'' అంటారు అబ్రహాం.

సోషల్ మీడియాలో భారీ మద్దతు

దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు అబ్రహాంకు ట్విటర్, ఫేస్‌బుక్‌ల ద్వారా మద్దతు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రత్యేకించి.. పశ్చిమ బంగకు చెందిన విద్యావేత్త, కార్యకర్త గార్గా ఛటర్జీ.. ఇదే తరహా తన స్వీయ అనుభవాన్ని ట్వీట్ చేశారు. ''తమిళ సోదరుడు అబ్రహాంకు హిందీ రానందున ఓ హిందీ ఛాందసవాద నేరస్తుడు ఇమిగ్రేషన్ నిరాకరించాడు. అదే జాతికి చెందిన మరో వ్యక్తి కోల్‌కతాలో నాతో అలాగే ప్రవర్తించాడు. అతడికి నేను బుద్ధి చెప్పాను'' అని వ్యాఖ్యానిస్తూ ఆ సంఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

''నాకు కూడా 2018 డిసెంబర్ 15న చెన్నై విమానాశ్రయంలో ఇలాగే జరిగింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఒకరు 'నీకు హిందీ ఎందుకు రాదు?' అని ప్రశ్నిస్తూ నన్ను బెదిరించాడు'' అని వినోత్ బాబు అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ అంశంపై ఎటువంటి చర్యలు చేపట్టారనేది తెలుసుకోవటానికి ముంబై విమానాశ్రయం ఇమిగ్రేషన్ విభాగాన్ని బీబీసీ తమిళం ప్రతినిధి సంప్రదించగా అధికారులు జవాబు చెప్పటానికి నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)