INDvsBAN: మొదటి డే/నైట్ టెస్టులో భారత్‌ ఘన విజయం.. ఇవన్నీ రికార్డులే

పింక్ బాల్

పింక్‌ బాల్‌తో తాను ఆడిన మొదటి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత జట్టు ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో సొంతం చేసుకుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

సమాధానంగా భారత జట్టు తొమ్మిది వికెట్లకు 347 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

బంగ్లాదేశ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒకేఒక్క అర్థ సెంచరీ నమోదైంది. ముష్ఫికర్ రహీం రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో.. ఇషాంత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు.

భారత బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ (136 పరుగులు) చేయగా, పుజారా (55 పరుగులు), రహానే (51 పరుగులు) అర్థ సెంచరీలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బంతితో రాణించిన ఇషాంత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఇవన్నీ విశేషాలే..

  • భారత్ విజయంలో ఫాస్ట్ బౌలర్లు కీలకపాత్ర పోషించారు. మొత్తం 20 వికెట్లు తీసింది వారే. స్వదేశంలో ఒక టెస్టు మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా తీయకుండానే జట్టు గెలుపొందటం విశేషం.
  • ఈ విజయంతో భారత జట్టు వరుసగా 7వ టెస్టు మ్యాచ్ గెలుపొందింది. ఇందులో గత నాలుగు టెస్ట్ మ్యాచుల్ని ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. ఒక జట్టు వరుసగా నాలుగు టెస్టు మ్యాచుల్ని వరుసగా ఇన్నింగ్స్ విజయంతో గెలవడం ఇదే తొలిసారి అని బీసీసీఐ పేర్కొంది.
  • భారత జట్టు స్వదేశంలో వరుసగా 12 టెస్టు సిరీస్‌లను గెలుపొందింది.
  • 2019 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడి, అన్నింటిలోనూ గెలుపొందింది. 360 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (180 పాయింట్లు), న్యూజీలాండ్ (120 పాయింట్లు), ఇతర జట్లు ఉన్నాయి.
  • ఈ టెస్టులో సెంచరీతో విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా పలు రికార్డులు సాధించాడు. క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (100 సెంచరీలు), రికీ పాంటింగ్ (71 సెంచరీలు) తర్వాతి స్థానంలో కోహ్లీ (70 సెంచరీలు) నిలిచాడు. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌ (41 సెంచరీలు)తో సమంగా నిలిచాడు. టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (25 సెంచరీలు) తర్వాత రెండో స్థానంలో కోహ్లీ (20 సెంచరీలు) నిలిచాడు. అలాగే, టెస్టు డే/నైట్ ఫార్మాట్‌లో భారత జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా తన పేరును నమోదు చేసుకున్నాడు.
  • టెస్టు కెప్టెన్‌గా 5 వేల పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ రికార్డు సాధించాడు. అంతర్జాతీయంగా చూస్తే.. 109 టెస్టుల్లో 8659 పరుగులు చేసిన గ్రేమ్ స్మిత్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 53 టెస్టుల్లో ఐదు వేలకు పైగా పరుగులు సాధించి ఆరో స్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)