మహారాష్ట్ర: బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తెరవెనుక ఏం జరిగింది?

మహారాష్ట్రలో అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు దక్కాయి. మరో 15 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో తగినంత మెజార్టీ లేనప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.
శరద్ పవార్ పాత్ర ఏంటి?
అజిత్ పవార్ నిర్ణయాన్ని సమర్థించటం లేదంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న అజిత్ పవార్ నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిర్ణయం కాదు. ఆయన నిర్ణయాన్ని మేం ఆమోదించట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు'' అని శరద్ పవార్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కానీ, బీజేపీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ పవార్ మద్దతు ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ప్రభుత్వ ఏర్పాటుతో శరద్ పవార్‌కు సంబంధం లేదని, అజిత్ పవార్ తిరగబడ్డారని శివసేన అంటోంది.
ఒకవేళ ఎన్సీపీ కనుక అధికారికంగా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు 54 మందిలో ఎంతమంది అజిత్ పవార్ వెనుక ఉన్నారన్నది ఆసక్తికరంగా మారుతోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తే.. అసెంబ్లీలో ఎన్సీపీ శాసనసభా పక్షం ఆయనదే అవుతుంది. లేదంటే.. కర్ణాటక తరహాలో ఆపరేషన్ కమలం కింద అజిత్ పవార్ సహా ఆయనకు మద్దతు ఇచ్చే ఎన్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా చూడొచ్చు.
అజిత్ పవార్ పాత్ర ఏంటి?
కాగా, శరద్ పవార్‌కూ, అజిత్ పవార్‌కూ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని.. కాంగ్రెస్, శివసేనతో జట్టుకట్టడాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారని వార్తలు వస్తున్నాయి. వారితో కలిస్తే, అధికార పంపకానికి శివసేన అంగీకరించినప్పటికీ, శరద్ పవార్ తనను రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిని చేయరేమోనని అజిత్ పవార్ భావించారన్నది ఆ వార్తల సారాంశం. ఎన్నికల సందర్భంగా కూడా శరద్ పవార్, అజిత్ పవార్'ల మధ్య అభిప్రాయబేధాలు కొనసాగాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యవహారంలో లాభపడిందెవరు? నష్టపోయిందెవరు?
కాగా, ఇప్పటివరకూ చూస్తే మహారాష్ట్రలో శివసేనకే ఎక్కువ నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో బీజేపీతో పాటు అధికారంలో కొనసాగిన ఆ పార్టీ కమలనాథులతో తెగదెంపులు చేసుకుని, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తమ పార్టీ నాయకుడు అర్వింద్ సావంత్ చేత కూడా రాజీనామా చేయించింది. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని శివసేన కోరుతుండగా, బీజేపీ మాత్రం అంగీకరించలేదు. రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని బీజేపీ చెప్పిందని ఉద్ధవ్ థాకరే అంటుండగా, తాము అలా చెప్పలేదని బీజేపీ ఖండిస్తోంది.
బీజేపీ మాత్రం ఈ వ్యవహారంలో లాభపడింది. అజిత్ పవార్'తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏం చేశారన్నది ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరైనా సరే 145 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని ఇప్పటి వరకూ చెప్పిన గవర్నర్.. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా అంగీకరించారనేది కూడా స్పష్టత లేదు.
అయితే, పార్టీలన్నింటి వద్దా తమతమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాలు ఉన్నాయని, ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడైన అజిత్ పవార్ ఆ జాబితానే గవర్నర్‌కు సమర్పించి ఉండొచ్చునని శరద్ పవార్ చెప్పారు. ఈ విషయంపై తాను గవర్నర్‌తో మాట్లాడతానని ఆయన అన్నారు.
తర్వాత ఏం జరుగనుంది?
కొత్త ప్రభుత్వం అసెంబ్లీని సమావేశపర్చి, తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ బలనిరూపణలో నెగ్గేందుకు బీజేపీకి అదనంగా 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎందుకంటే, 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ 145 సాధించాలి. ఆ పార్టీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 15 మంది మద్దతు ఇస్తున్నారని చెబుతోంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు తప్పకుండా బీజేపీని నిలువరించాలని చూస్తాయి. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలను ధిక్కరించి బీజేపీకి మద్దతు ఇస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. విషయం కోర్టుకు చేరుతుంది. అయితే, ఆ కేసు తేలే వరకూ బీజేపీ ప్రభుత్వం మాత్రం కొనసాగుతుంది.
అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ వారికి సమయం ఇచ్చి ఉంటారని, వారు బలాన్ని నిరూపించుకోలేరని శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఆ తర్వాత శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్.. మూడు పార్టీలూ కలసి ముందు నిర్ణయించుకున్నట్లుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు.
ఇవి కూడా చదవండి:
- మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం.. ఎన్సీపీ మద్దతు లేదన్న శరద్ పవార్
- నరేంద్ర మోదీ దూకుడుకు ప్రాంతీయ పార్టీలు కళ్లెం వేయగలవా?
- బీజేపీ విజయాలకు కారణం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లేకపోవడమేనా
- శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే: ‘మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే’
- తెలంగాణ మూలాలున్న హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ను ఇలా స్థాపించారు
- మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఎందుకు కలవాలనుకుంటున్నారు - గ్రౌండ్ రిపోర్ట్
- ప్రణబ్ ముఖర్జీ: ‘నేను బాల్ థాకరేను కలవటం సోనియా గాంధీకి నచ్చలేదు’
- చాయోస్ కేఫ్: చాయ్ ఆర్డరివ్వాలన్నా ఫోన్ నంబర్ చెప్పాలి, లేదంటే ఫేషియల్ రికగ్నిషన్ చేయాలి
- సరోగసీ నియంత్రణ బిల్లు: ఈ బిల్లు ఎందుకు అవసరం?
- హిందూ, ముస్లిం, క్రైస్తవుల తీర్థయాత్రలకు ప్రభుత్వం ఎలా ఆర్థిక సహాయం అందిస్తోంది...
- శ్రీలంకతో సంబంధాలకు భారత్‌కు అంత తొందర దేనికి?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








