చాయోస్ కేఫ్: చాయ్ ఆర్డరివ్వాలన్నా ఫోన్ నంబర్ చెప్పాలి, లేదంటే ఫేషియల్ రికగ్నిషన్ చేయాలి

ఫొటో సోర్స్, facebook/Chaayos
ఒక ప్రముఖ కేఫ్ చైన్ చాయోస్‌లో.. వినియోగదారులకు బిల్లులు ఇవ్వటానికి ఫేస్ రికగ్నిషన్ (ముఖాన్ని గుర్తించే) సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్నారని వెల్లడవటంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చాయోస్ కేఫ్ సిబ్బంది తనకు బిల్లు ఇవ్వటానికి తన అనుమతి లేకుండా తన ఫొటో తీసుకున్నారని చెప్తూ.. మీడియా పరిశీలన సంస్థ మీడియానామా సంపాదకులు నిఖిల్ పాహ్వా ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
''ఇది అనవసర చొరబాటు. దీనికి దూరంగా ఉండే అవకాశం ఆ కేఫ్ ఇవ్వటం లేదు. అది సమస్యాత్మకం'' అని పాహ్వా బీబీసీతో పేర్కొన్నారు.
చాయోస్.. తన వ్యవస్థను సమర్థించుకుంది. వినియోగదారుల సంరక్షణకు తను కట్టుబడి ఉన్నానని చెప్పింది.
''మా వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో మేం అత్యంత జాగ్రత్తగా ఉన్నాం'' అని ఆ సంస్థ బీబీసీకి పంపిన ఒక ప్రకటనలో పేర్కొంది.
వినియోగదారులు బిల్లు చెల్లించటానికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్‌ను వాడకూడదనుకుంటే.. తమ ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చునని కూడా ఆ సంస్థ తెలిపింది.
అయితే.. చాయోస్ లాయలటీ పథకంలో చేరటానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తప్పనిసరి అని పాహ్వా బీబీసీకి చెప్పారు. ఆ పథకంలో తను లేకపోయినా కూడా తన ఫొటో తీసుకున్నారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకన్నా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. వినియోగదారులు తమ ''వ్యక్తిగత సమాచారం ఎల్లప్పుడూ గోప్యంగానే ఉండాలని ఆశించరాదు'' అని చాయోస్ నియమ నిబంధనలు చెప్తున్నాయని పాహ్వా పేర్కొన్నారు. ఆ నియమ నిబంధనలను బీబీసీ కూడా చూసింది.
లాయలిటీ పథకంలో చేరటం ద్వారా.. వినియోగదారులు ''సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలు లేదా అధీకృత సంస్థలు లేదా క్రెడిట్ బ్యూరోలు లేదా మూడో పక్షానికి వెల్లడించటానికి'' అంగీకరిస్తున్నారని కూడా ఈ నియమ నిబంధనలు చెప్తున్నాయి.
అయితే.. ''సమాచారాన్ని ఎటువంటి అవసరానికైనా కానీ మూడో పక్షంతో పంచుకునేది లేదు. ఈ సమాచారాన్ని చాయోస్ మరే ఇతర అవసరం కోసమూ వినియోగించదు'' అని చాయోస్ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సమాచారం ఇవ్వటం వల్ల తలెత్తగల పరిణామాల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించలేదని.. కాబట్టి ఇది అవగాహన కల్పించి తీసుకున్న అనుమతి (ఇన్‌ఫామ్డ్ కన్సెంట్) కాదని.. ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని పాహ్వా చెప్పారు.
పాహ్వా తన అనుభవాల గురించి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో కదలిక సృష్టించాయి. అనేక మంది యూజర్లు చాయోస్ చైన్‌లో తమ అనుభవాలను పంచుకోవటానికి ముందుకు వచ్చారు. మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనల గురించి వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
బయోమెట్రిక్ డాటా సేకరణను పర్యవేక్షించటానికి భారతదేశంలో చట్టాలు లేవు. అలాగే.. ఇది ఒక్క చాయోస్‌కు మాత్రమే పరిమితమైన విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''ప్రైవేటు సంస్థలు వినియోగదారుల గుర్తింపుకు సంబంధించి బయోమెట్రిక్ సమాచారాన్ని, ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను భారీ మొత్తంలో సేకరిస్తుండటం చాలా ఆందోళనకరం. వందలాది కంపెనీలు బయోమెట్రిక్ డాటా సేకరించి నిల్వ చేస్తున్నాయి. వీటి మీద తరచుగా స్పష్టమైన తనిఖీలు, నియంత్రణలు లేవు. ప్రకటించిన గోప్యతా విధానాలు కూడా ఉండవు. భారతదేశంలో గోప్యతా చట్టం ఏదీ లేని పరిస్థితుల్లో.. ఇదంతా తీవ్ర ఆందోళనకరమైన విషయం'' అని టెక్నాలజీ నిపుణుడు ప్రశాంతో కె రాయ్ బీబీసీతో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''ఉదాహరణకు.. ఉత్తర భారతదేశంలో రియల్ ఎస్టేట్ దిగ్గజమైన డీఎల్ఎఫ్ డజన్ల కొద్దీ వాణిజ్య భవనాలను నిర్మించి నిర్వహిస్తోంది. వాటిని సందర్శించే వినియోగదారులు మొదట తమను తాము ఒక టెక్ట్స్ మెసేజ్ (ఓటీపీ) ద్వారా ధృవీకరించాలని డిమాండ్ చేస్తుంది. ఆపైన ప్రవేశ ద్వారాల దగ్గర కెమెరాలు గల పరికరాలు ఉంటాయి. వినియోగదారుల ఫొటోలను, వారికి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను ఫొటోలు తీసుకుని.. వారి చేత సంతకం చేయించుకుంటుంది'' అని ఆయన చెప్పారు.
ఇక వారి దగ్గర నా పేరు, నా ముఖం, నా డ్రైవింగ్ లైసెన్స్, ధృవీకరించిన ఫోన్ నంబర్, సంతకం అన్నీ ఉంటాయి. వారి భవనాల్లో దేనిలోనైనా అడుగుపెట్టాలంటే ఈ వివరాలేవీ ఇవ్వకుండా వెళ్లే అవకాశం లేదు. వారి దగ్గర ఉన్న నా సమాచారాన్ని తుడిచేసే అవకాశమూ లేదు. ఇటువంటి సమాచార నిల్వలు లీకయ్యే పరిస్థితులు, డబ్బులకు అమ్మే అవకాశాలు, దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి'' అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కాగా, చాయోస్ ఈ వ్యవహారంపై మరింత వివరణ ఇస్తూ ట్వీట్లు చేసింది.
ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తాము సేకరించే డేటాను కస్టమర్ల లాగిన్ సదుపాయం కోసం తప్ప మరే విధంగానూ ఉపయోగించబోమని, థర్డ్ పార్టీకి కూడా ఇవ్వబోమని తెలిపింది. ఈ లాగిన్ సదుపాయం నుంచి ఎవరైనా ఎప్పుడైనా వైదొలగాలనుకుంటే తమ వెబ్‌సైట్‌లో సదుపాయం ఉందని, వాళ్ల డేటాను కూడా తొలగించుకోవచ్చునని చెబుతోంది.
ఇవి కూడా చదవండి
- జార్జి రెడ్డి: కొందరికి అభినవ చేగువేరా, ఇంకొందరికి ఆవేశపరుడు, ఇంతకీ ఆయన కథేంటి?
- శ్రీలంకతో సంబంధాలకు భారత్‌కు ఆతృత ఎందుకు?
- రజనీకాంత్, కమల్ హాసన్ కలిస్తే తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
- విశాఖ, కాకినాడ తీరాల్లో మోహరించిన భారత్, అమెరికా సైనిక బలగాలు
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








