మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం... సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ప్రమాణాన్ని సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మహారాష్ట్ర గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు దేవేంద్ర ఫడణవీస్‌ను ఆహ్వానించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడాన్ని సవాలు చేస్తూ... ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా శివసేనతో కలిసి జాయింట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ రాత్రికే దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆ పార్టీల తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అయితే, ఈ పిటిషన్‌పై ఆదివారం ఉదయం 11.30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

అంతకుముందు, కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలే ఎన్సీపీ సమావేశానికి రాలేదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మీడియాకు తెలిపారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ప్రకటించారు.

శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అజిత్ పవార్‌ను పార్టీ శాసనసభాపక్షనేత పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నేతను ఎన్నుకునే వరకూ జయంత్ పాటిల్ ఆ బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. అజిత్ పవార్ నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ సమర్థించదని స్పష్టం చేశారు.

శనివారం మధ్యాహ్నం ముంబయిలో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీల నాయకులు కలసి, తాజా పరిణామాలపై చర్చలు జరిపారు.

అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ మీడియాతో మాట్లాడారు.

‘‘కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ నాయకులు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. మాకు అవసరమైన నంబర్లు ఉన్నాయి. అధికారికంగానే మా మూడు పార్టీలకు 44, 56, 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వారు మద్దతు ఇచ్చారు. పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మాతోనే ఉన్నారు. మొత్తంగా మాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 170 వరకు ఉంటుంది’’ అని శరద్ పవార్ చెప్పారు.

అజిత్ పవార్ నిర్ణయం పార్టీ వైఖరికి వ్యతిరేకమని, అది క్రమశిక్షణా రాహిత్యమని శరద్ పవార్ తెలిపారు. ఎన్సీపీ-బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏ ఒక్క ఎన్సీపీ నాయకుడు, కార్యకర్త సుముఖంగా లేరని ఆయన అన్నారు.

పార్టీని వీడి వెళ్లే ఎమ్మెల్యేలంతా ఫిరాయింపు చట్టం ఒకటుందని గుర్తుపెట్టుకోవాలని, వారు శాసనసభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందని పవార్ హెచ్చరించారు.

అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ వారికి సమయం ఇచ్చి ఉంటారని, వారు బలాన్ని నిరూపించుకోలేరని పవార్ తెలిపారు. ఆ తర్వాత తమ మూడు పార్టీలూ కలసి ముందు నిర్ణయించుకున్నట్లుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు.

పార్టీలన్నింటి వద్దా తమతమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాలు ఉన్నాయని, ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడైన అజిత్ పవార్ ఆ జాబితానే గవర్నర్‌కు సమర్పించి ఉండొచ్చునని పవార్ చెప్పారు. ఈ విషయంపై తాను గవర్నర్‌తో మాట్లాడతానని అన్నారు.

అజిత్ పవార్ స్థానంలో మరొక సీఎల్పీ నాయకుడిని ఎన్నుకుంటామని ప్రకటించారు. అజిత్ పవార్‌పై పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఏదో మాట్లాడాలని చెప్పి అజిత్ పవార్ తనను పిలిచారని, మిగతా ఎమ్మెల్యేలతో పాటు రాజ్‌భవన్ వద్దకు తీసుకెళ్లారని, తాము తేరుకునేలోపే ప్రమాణ స్వీకారం జరిగిపోయిందని ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానే తెలిపారు. దీంతో తాను వెంటనే శరద్ పవార్ వద్దకు వెళ్లానని, తాను శరద్ పవార్‌తోనే, ఎన్సీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే వివరించారు.

ఇదో కొత్త ఆట - ఉద్ధవ్ ఠాక్రే

గతంలో ఈవీఎంల ఆట ఆడారని, ఇప్పుడో కొత్త ఆట ఆడుతున్నారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

ఇలాంటప్పుడు ఇకపై ఎన్నికల అవసరం లేదని తనకు అనిపిస్తోందన్నారు. వెనకనుంచి వెన్నుపోటు పొడిచినప్పుడు ఛత్రపతి శివాజీ ఏం చేశారో అందరికీ తెలుసునన్నారు.

‘‘శివసేన ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నించి చూడమనండి. మహారాష్ట్ర నిద్రపోతూ కూర్చోదు’’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడణవీస్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.

శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని తాము ఇస్తామని ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఫడణవీస్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

మహారాష్ట్ర భవిష్యత్ కోసం వారు పాటుపడతారని మోదీ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఎన్సీపీ మద్దతు లేదు - శరద్ పవార్

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.

‘‘మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న అజిత్ పవార్ నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిర్ణయం కాదు. ఆయన నిర్ణయాన్ని మేం ఆమోదించట్లేదు, మద్దతు ఇవ్వట్లేదు’’ అని శరద్ పవార్ ట్వీట్ చేశారు.

‘‘పార్టీలోను, కుటుంబంలోనూ చీలిక’’ అంటూ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే వాట్సప్ స్టేటస్ పెట్టారని, దీనిపై ఆమె కార్యాలయం కూడా ప్రకటన చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

తాము ఎమ్మెల్యేల హాజరు కోసం సంతకాలు తీసుకున్నామని, అయితే ఆ సంతకాలను ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం దుర్వినియోగం చేశారని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ మీడియాతో అన్నారు.

‘‘మోసంతో ఏర్పాటైన ప్రభుత్వం ఇది. ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఓడించి తీరుతాం’’ అని ఆయన తెలిపారు.

ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అజిత్ పవార్

కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలుస్తాయనుకుంటే..

కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.

ఈరోజు ఈ మూడు పార్టీలు కలిసి మిగతా అంశాలపై చర్చించాల్సి ఉంది. కానీ ఉదయాన్నే దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ ముంబై రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

‘‘మాతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన ప్రజాతీర్పును అవమానిస్తూ మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. దానితో రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన అమలు చేయాల్సి వచ్చింది. మహారాష్ట్రలో స్థిర ప్రభుత్వం ఉండాలి. అందుకే ఎన్సీపీ మాతో కలిసి వచ్చింది’’ అని ఫడణవీస్ అన్నారు.

‘‘మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి చాలా రోజులైంది. ప్రభుత్వం ఏర్పడకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యలు. మేం కలిసి ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే అది మహారాష్ట్రకు మంచిది’’ అని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఎన్నికల ప్రచార సమయంలో తమ కూటమి అధికారంలోకి వస్తే దేవేంద్ర ఫడణవీసే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పే మేం ప్రచారం చేశాం. బీజేపీ మద్దతుదారులు, దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కారణంగానే శివసేన ఎక్కువమంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.

శరద్ పవార్

ఫొటో సోర్స్, facebook/PawarSpeaks

ఎన్నికల్లో ఎవరెవరు కలసి పోటీ చేశారంటే..

మహారాష్ట్రలో అక్టోబర్ 21వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదేనెల 24వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి.

ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు కలసి పోటీ చేశాయి. బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు వచ్చాయి.

ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు, ఎన్సీపీకి 54 సీట్లు లభించాయి.

అంతకు 2014లో బీజేపీకి 122 సీట్లు, శివసేనకు 63 సీట్లు వచ్చాయి. ఆ రెండు పార్టీలూ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఐదేళ్లూ దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు

ఫొటో సోర్స్, Gazette of India

రాష్ట్రపతి పాలనకు ముగింపు..

మహారాష్ట్రలో నవంబర్ 9వ తేదీ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన పార్టీలకు గవర్నర్ ఆహ్వానం అందించారు.

కానీ, ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవటంతో నవంబర్ 12వ తేదీన రాష్ట్రపతి పాలన విధించారు.

తాజాగా, బీజేపీ, ఎన్సీపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావటంతో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)