రాయల్ వశిష్ట: గోదావరిలోంచి బయటపడ్డ బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నెల రోజుల కిందట మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును బయటకు తీసే ప్రయత్నాలు ఫలించాయి.
సోమవారం బోటుకు సంబంధించిన కొంత భాగాన్ని ఒడ్డుకు లాగారు. వెలికితీత ప్రయత్నంలో బోటు పైకప్పు విడిపోయి బయటకు వచ్చింది.
మంగళవారం (22.10.2019) బోటుకు సంబంధించిన మిగిలిన భాగాన్ని కూడా బయటకు తీశారు.
38 రోజుల పాటు కొనసాగిన ఆపరేషన్
77మందితో పాపికొండల విహారానికి బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు సెప్టెంబర్15న ప్రమాదానికి గురయింది.
ప్రయాణీకుల్లో 26మందిని స్థానికులు రక్షించారు. మిగిలిన వారిలో 51మంది ప్రాణాలు కోల్పోగా బోటులో11 మృతదేహాలు ఇరుక్కున్నాయి.
బోటును వెలికితీసేందుకు గత 38 రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి మంగళవారం బోటు బయటపడింది.
బోటును పూర్తిగా వెలికితీయగా, అందులో ఇరుక్కున్న మృతదేహాలు వెలికితీసే కార్యక్రమం కొనసాగుతోంది.

బోటును ఇలా బయటకు తీశారు..
వారం రోజులుగా గోదావరిలో నీటిమట్టం తగ్గుతుండడం వెలికితీత ప్రయత్నాలకు అనుకూలించింది.
విశాఖపట్నం ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టడంతో బోటు పైభాగం కొంత బయటకు లాగగలిగారు.
ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు రెండు దఫాలుగా సాగాయి.
విశాఖకు చెందిన శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ సంస్థ డైవర్స్ మూడు రోజుల పాటు ప్రయత్నించారు.నదిలో దిగి బోటుకి తాడు కట్టారు. బోటును వెలికితీసే ప్రయత్నాలు రెండుసార్లు విఫలమయ్యాయి

బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో ఒకేసారి రాలేదని ధర్మాడి సత్యం తెలిపారు.
ఈ ప్రమాదంలో 51మంది మరణించగా ఇప్పటి వరకూ 11 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. బోటు బయటకు తీసే క్రమంలోనే మృతదేహాల నుంచి దుర్వాసన రావడంతో మొత్తం మృతదేహాలు లభిస్తాయనే అంచనాతో ఉన్నారు. బోటు అడుగున క్యాబిన్ లో ఇరుక్కున్న వారి మృతదేహాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంగళవారం 8 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?
- #గ్రౌండ్‌రిపోర్ట్: ‘బోటు తలుపులు వేయడంతో ఈత వచ్చినా మునిగిపోయారు’
- గోదావరిలోంచి బోటును బయటకు తీయలేరా?
- గోదావరి పడవ ప్రమాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?
- దేవీపట్నం: బోటు ప్రమాదాలు ఆపాలంటే ఎవరెవరు ఏమేం చేయాలి?
- గోదావరిలో పడవ ప్రమాదం: బోటును బయటకు తీయడంలో ఆలస్యం ఎందుకు?
- గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్
- కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








