గోదావరిలోంచి బోటును బయటకు తీయలేరా?

- రచయిత, బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కందేరి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
గోదావరి పడవ ప్రమాదంలో బోటును ఎలా బయటకు తీయాలన్న విషయం తేలలేదు. గురు, శుక్రవారాల్లో క్షేత్ర స్థాయిలో పెద్దగా పురోగతి లేదు. రకరకాల పద్ధతులపై చర్చలు జరిపారు. దీనిపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికీ ప్రమాదం లేకుండా బోటును బయటకు తీసే ప్రక్రియ గురించి అధికారులు చర్చిస్తున్నారు.
ఇంకా ఆచూకీ తేలని 16 మంది
ఇప్పటి వరకూ మరో 16 మంది ఆచూకీ దొరకలేదు. బోటు బయటకు వస్తే కొన్ని మృతదేహాలు బయటకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ మృతదేహాల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు జరిపారు. పైకి తేలిన, ఒడ్డుకు వచ్చిన మృతదేహాలను తీశారు. ఇకపై అలా వచ్చే మృతదేహాలుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో బోటు బయటకు రావడంపైనే అందరి దృష్టీ నెలకొంది.
"మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అందించడమే మా మొదటి ప్రాధాన్యత. తరువాత బోటు బయటకు తీయడం. బోటు తీస్తే అందులో కూడా కొన్ని మృతదేహాలు ఉండొచ్చని అనుకుంటున్నాం" అని బీబీసీతో చెప్పారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర రెడ్డి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
బోటులో ఎంత మంది ఉన్నారు?
ప్రమాదం సమయంలో బోటులో ఎంత మంది ఉన్నారన్న సంఖ్య అంచనా పెరిగింది. ముందు నుంచీ 73 మంది బోటులో ఉన్నారని అంచనా వేసిన అధికారులు, తరువాత 77 మంది ఉన్నట్టు అంచనాకు వచ్చారు. తమ వారు కనిపించడం లేదు అంటూ అధికారులకు అందిన పేర్లు, దొరికి మృతదేహాలు, బతికిన వారి సంఖ్యనీ కలిపి ఈ లెక్కకు వచ్చారు.
దీంతో బుధ వారం వరకూ 13 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని భావించగా ఇప్పుడది 16కి చేరింది. బోటులో ఎక్కిన వారందరూ ముందుగా టికెట్ తీసుకున్న జాబితాలో ఉండకపోవచ్చనే అంశం, టికెట్ తీసుకున్న వారందరూ బోటు ఎక్కి ఉండకపోవచ్చనే విషయం వల్ల ఈ అంచనాలో తేడాలు వస్తున్నాయి.
ముందుగా 65 మంది ప్రయాణీకులు, 8 మంది సిబ్బంది బోటులో ఉన్నారని భావించారు. ఈ సంఖ్యను సరిగా లెక్కించడం కోసం తమ వారు తప్పిపోయారంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి దగ్గర నుంచి పేర్లు నమోదు చేసుకున్నారు. అప్పటికే బతికిన వారు, దొరికిన మృతదేహాలు, ఈ ఆచూకీ తెలియని వారి సంఖ్యా పెరిగినప్పుడు మొత్తం ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోయింది.
ఈ విషయంలో వేర్వేరు ప్రభుత్వ శాఖల మధ్య కూడా లెక్కల్లో తేడా ఉంది. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి పారదల శాఖ అధికారులూ 75 మంది అని చెప్పగా, రాష్ట్ర మంత్రి కన్నబాబు మాత్రం 77 మంది అని మీడియా ముందు ప్రకటించారు.
ఆచూకీ తెలియాల్సిన 16 మందిలో ఏడుగురు తెలంగాణ, తొమ్మిదిమంది ఆంధ్ర నుంచి ఉన్నారని ఆయన తెలిపారు.
తూర్పు గోదావరి కలెక్టర్ కూడా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది అని ప్రకటించారు.
ప్రస్తుతం అంచనా సంఖ్య - బతికిన వారు 26, మృతదేహాలు 35, మొత్తం 61.
బోటులో ఉన్నవారి సంఖ్య (అంచనా)77
ఆచూకీ తెలియాల్సిన వారు 16
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
బోటు బయటకు రావడం ఎలా
లోతు, నీటి వేగం, నీటి ఒత్తిడి కారణంగా బోటును బయటకు తీయడం ఇబ్బందిగా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకూ ఇలాంటి చోట నుంచి బోటు తీసిన సమాచారం లేదని అధికారులు అంటున్నారు.
బుధవారం ప్రమాద స్థలంలో పర్యటించిన నిపుణులు బోటును ఎలా బయటకు తీయాలి అనేదానిపై కొన్ని ప్రణాళికలు వేస్తున్నారు. గురు, శుక్ర వారాలు అధికారులు, నిపుణుల మధ్య చర్చలు కొనసాగాయి. క్షేత్ర స్థాయిలో పెద్దగా ఏమీ జరగలేదు. ముంబైకి చెందిన గౌరవ్ భక్షి, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, కాకినాడ పోర్ట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులతో జిల్లా యంత్రాంగం సంప్రదింపులు జరుపుతోంది.
"బోటు వెలికితీత నిపుణులకు అప్పగించాం. ఇటుంటి సంఘటన, ఇటువంటి పరిస్థితులు, లోతులో ఎక్కడ బోటు తీసినట్టు లేదు అని చెబుతున్నారు. దీంతో అందరితోనూ మాట్లాడుతున్నాం. అన్ని అవకాశాలూ పరిశీలించి చేస్తాం" అన్నారు కలెక్టర్ మురళీధర రెడ్డి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
"సహాయక చర్యలు కొనసాగుతాయి"
నావికా దళం నుంచి వచ్చిన డీప్ డైవర్స్ అవసరం ప్రస్తుతానికి లేకపోవడంతో ఆ బృందం తమ సామాగ్రితో వెళ్లిపోయింది. మిగిలిన అన్ని విభాగాలకు చెందిన బృందాలూ దేవీపట్నంలో కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో నిరంతరంగా పనిచేస్తోన్న సిబ్బందిని కలిసి అభినందించారు జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి. అందరి ఆచూకీ దొరికే వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయనీ, వీలైనంత త్వరలోనే మిగిలన మృతదేహాలనూ, బోటునూ బయటకు తీస్తామని ఆయన బీబీసీతో చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 4
ఇవి కూడా చదవండి:
- శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?
- ఆంధ్రప్రదేశ్: గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలపై వివాదం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది?
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- 20 ఏళ్లుగా 200 విష సర్పాలతో కాటేయించుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా
- ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం: కులవివక్షను అధిగమించిన ఈ ఆలయంలో 11 తరాలుగా పూజారులంతా దళితులే
- ఇంజినీర్స్ డే: హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)