ఎన్ఆర్‌సీ తుది జాబితా వెల్లడికి సర్వంసిద్ధం.. అసోంలో భద్రత కట్టుదిట్టం - గ్రౌండ్ రిపోర్ట్

అసోం

ఫొటో సోర్స్, PTI

    • రచయిత, ప్రియాంక దూబే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, గువహాటి నుంచి

జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా శనివారం విడుదలవ్వాల్సి ఉండటంతో అసోంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

హింస, మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

వదంతులు నమ్మవద్దని, సంయమనం పాటించాలని ప్రజలకు పోలీసు విభాగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ విజ్ఞప్తి చేశాయి.

ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు లభించనివారి భద్రత కోసం అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అసోం పోలీసు విభాగం ట్విటర్ ద్వారా తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ట్రాఫిక్, పాలన, న్యాయవ్యవస్థ సజావుగా నడిచేందుకు వీలుగా గువహాటితో పాటు రాష్ట్రంలోని ఇతర సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల నేపథ్యంలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని అసోం డీజీపీ కులాధర్ సాకియా గురువారం సాయంత్రం మీడియాకు చెప్పారు. శనివారం ఆయన పదవీ విరమణ పొందనున్నారు.

ఎన్ఆర్‌సీ జాబితా వెల్లడి ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందన్న విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు.

ఎన్ఆర్‌సీలో చోటు లేనివారిని విదేశీయులుగా ప్రకటించినట్లు కాదని, ప్రజలు ఆందోళనచెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ ట్వీట్ చేసింది.

ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ‘ఫారెనర్ ట్రిబ్యునల్స్‌’ను ఏర్పాటు చేస్తోందని, వాటిలో అప్పీలు చేసుకోవచ్చని వివరించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: ఎన్ఆర్‌సీ తుది జాబితా వెల్లడికి సర్వంసిద్ధం.. అసోంలో భద్రత కట్టుదిట్టం

అరెస్టులు ఉండవు

ప్రజల్లో భయబ్రాంతులను తొలగించేందుకు అసోం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి కుమార్ సింజయ్ కృష్ణ పబ్లిక్ నోటీసును విడుదల చేశారు. ఎన్ఆర్‌సీలో పేర్లు లేని వారందరికీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్‌సీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.

ఫారెన్ ట్రిబ్యునల్‌లో పౌరసత్వం కోసం అభ్యర్థన పెట్టుకునేందుకు, విచారణలో పాలుపంచుకునేందుకు అవసరమైన న్యాయపరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. పేదవారికి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు.

అసోంవ్యాప్తంగా 33 ఫారెన్ ట్రిబ్యునళ్లు ఉన్నాయని, కొత్తగా మరో 200 ఏర్పాటవుతాయని కుమార్ సంజయ్ కృష్ణ చెప్పారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

అప్పీలు చేసుకునే గడువును 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచినట్లు తెలిపారు.

ఎన్‌ఆర్‌సీ జాబితోలో పేర్లులేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయమని ఆయన అన్నారు.

అప్పీలు, విచారణ ప్రక్రియ పూర్తయ్యాక, ఫారెన్ ట్రిబ్యునల్ 'విదేశీ పౌరులు'గా ప్రకటిస్తేనే చర్యలు ఉంటాయని చెప్పారు.

అసోం

ఫొటో సోర్స్, PTI

ఎన్‌ఆర్‌సీ అంటే.

అసోంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులను తిప్పిపంపాలని డిమాండ్ చేస్తూ ఆరేళ్లపాటు ఉద్యమం జరిగింది. ప్రతిఫలంగానే అక్కడ ఎన్ఆర్‌సీని రూపొందిస్తున్నారు. ఇందులో పేరున్నవారు భారతీయ పౌరులు అవుతారు.

తమను తాము అసోం పౌరులుగా పేర్కొంటూ మూడు కోట్ల 29 లక్షల మంది ఎన్‌ఆర్‌సీలో చోటు కోసం దరఖాస్తు చేశారు. 2018 జులై 30న వెల్లడించిన ఎన్ఆర్‌సీ ముసాయిదా జాబితాలో వారిలో దాదాపు 40 లక్షల మందికి చోటు దక్కలేదు.

అసోం

ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

మళ్లీ గత జూన్ 26న వెల్లడించిన అదనపు జాబితాలో మరో లక్ష మంది పేర్లను పక్కనపెట్టారు.

ఆగస్టు 31న ఎన్ఆర్‌సీ తుది జాబితా విడుదల కానుంది. ఇదివరకు తిరస్కరించిన మొత్తం 41 లక్షల మందిలో ఎంత మంది పేర్లను తిరిగి జాబితాలో చేర్చుతారన్నది అప్పుడే వెల్లడి కానుంది.

అసోం

ఇకపై ఏం జరుగుతుంది

ఎన్‌ఆర్‌సీలో పేరు దక్కనివారు ఫారెన్ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకోవచ్చు. ఒకవేళ ట్రిబ్యునల్ వారిని 'విదేశీ పౌరులు'గా ప్రకటిస్తే, వారిని అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరించాలని చట్టం చెబుతోంది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం ఇంతవరకూ అధికారకంగా ఏమీ వెల్లడించలేదు.

దేశపౌరులైనా, కాకపోయినా అందరికీ గౌరవంగా జీవించే హక్కును రాజ్యాంగంలోని అర్టికల్ 21 కల్పిస్తోందని అసోంలో న్యాయవాదిగా పనిచేస్తున్న అమన్ వానుడ్ అంటున్నారు.

''ఎన్ఆర్‌సీలో పేరు లేకపోయినా వాళ్లకు గౌరవంగా జీవించే అధికారం ఉంటుంది. భారత ప్రభుత్వం ఈ హక్కును పరిరక్షిస్తుందన్న విశ్వాసం ఉంది'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)