కశ్మీర్: ఆర్టికల్ 370 పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం... అక్కడికి వెళ్ళేందుకు సీతారాం ఏచూరికి అనుమతి

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఇంటర్నెట్, టెలిఫోన్ వంటి సమాచార వ్యవస్థలపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీం కోర్టు బుధవారం నాడు ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనదేనా అని ప్రశ్నిస్తూ దాఖలైన అనేక పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందున్నాయి.
భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఒక పిటిషనర్‌ను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి, ఇది అత్యంత బాధ్యతతో పరిశీలించవలసిన కేసు అని దయచేసి అర్థం చేసుకోండని వ్యాఖ్యానించారు.
పిటిషనర్లలో ఒకరైన మహమ్మద్ అలీం సయ్యద్ తన తల్లితండ్రులను కలుసుకోవడానికి అనంతనాగ్‌కు వెళ్ళవచ్చని ప్రధాన న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారు.
అంతేకాకుండా, పోలీసు రక్షణ కూడా కల్పించాలని జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతించాలని ఈ పిటిషన్ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
అలాగే, సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరిని కూడా జమ్మూకశ్మీర్‌కు వెళ్ళడానికి కోర్టు అనుమతించింది. అక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి పార్టీకి చెందిన నేతను కలుసుకోవచ్చని తెలిపింది. సదరు నేత పోలీసుల నిర్బంధంలో ఉన్నారనే ఆరోపణలున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"మీరు వెళ్ళడానికి అనుమతి ఇస్తున్నాం. మీరు మీ పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆ పని మీదే వెళ్లండి. వేరే ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దు" అని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. రాజకీయ కార్యక్రమాల కోసం కాకుండా ఒక స్నేహితుడిని కలుసుకోవడానికి మాత్రమే ఆయన వెళ్ళాలని సుప్రీం స్పష్టం చేసింది.
కేంద్రానికి, మరి కొంతమందికి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు ఈ వ్యవహారాన్ని అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మానసనం విచారిస్తుందని తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆర్టికల్ 370 రద్దుకు సంబధించిన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేసింది. అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ మొదలవుతుందని వివరించింది.
ఇవి కూడా చదవండి:
- 'కశ్మీర్ పరిణామాలపై ధైర్యంగా మాట్లాడాలనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాను' -కన్నన్
- జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనతో బీజేపీకి కలిగే ప్రయోజనాలేంటి...
- 'కశ్మీర్లో ప్రజాస్వామిక హక్కులను కాలరాశారు' - ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్
- కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్‌లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనతో బీజేపీకి కలిగే ప్రయోజనాలేంటి...
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








