కెఫే కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం

ఫొటో సోర్స్, Getty Images
కెఫే కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్ధ మృతదేహం నేత్రావతి నది ఒడ్డున కనుగొన్నట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ ధ్రువీకరించింది.
వీజీ సిద్ధార్థ మృతదేహం మంగళూరు సమీపంలోని హోగే బజార్ వద్ద నేత్రావతి నది ఒడ్డున లభించిందని ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జి సమీపంలో కెఫే కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతదేహాన్ని కొందరు జాలర్లు బుధవారం ఉదయం 7 గంటల సమయంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
సిద్ధార్థ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ట అల్లుడు.
"సిద్ధార్థ కనిపించకుండా పోయిన ప్రాంతానికి సమీపంలోనే ఆయన మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్షల కోసం హాస్పటల్‌కు తీసుకెళ్తున్నాం" అని సంఘటన స్థలంలో ఉన్న మాజీ మంత్రి యూటీ ఖాదర్ బీబీసీకి తెలిపారు. మంగళవారం రాత్రంతా ఖాదర్ అక్కడే ఉండి సిద్ధార్థను కనుగొనేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
"ముఖంపై రక్తపు మరకలున్నాయి. కానీ శరీరంపై ఎక్కడా గాయాలు లేవు. వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది" అని ఖాదర్ తెలిపారు.
సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఈరోజు ఉదయం మృతదేహాన్ని కనుగొన్నాం. అయితే ఇది సిద్ధార్థదేనా కాదా అనేది గుర్తించాల్సి ఉంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. మృతదేహాన్ని వెన్లాక్ హాస్పటల్‌కు తరలిస్తున్నాం. విచారణను కొనసాగిస్తాం" అని మంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.
ఆత్మహత్యకు ముందు రాసినదిగా భావిస్తున్న లేఖ నిజమైనదేనని పోలీసులు స్పష్టం చేశారు. కెఫే కాఫీ డే కుటుంబం, డైరెక్టర్లను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో... "తాను ఎంతోకాలం పోరాడానని, కానీ ఈరోజు ఆ పోరాటాన్ని వదిలేస్తున్నాను. భాగస్వాముల నుంచి, రుణాలిచ్చిన ఇతర వ్యక్తుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఆదాయపన్ను శాఖ డైరెక్టర్ జనరల్ ఒకరి నుంచి వేధింపులు భరించలేకపోతున్నాను. అందుకే నా పోరాటం ఆపేస్తున్నా" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. తాము చేపట్టే చర్యలను సమర్థించుకుంటూనే, ఈ లేఖ నిజమైనది కాదేమో అనే అనుమానం వ్యక్తం చేసింది. తమ రికార్డుల్లో ఉన్న సిద్ధార్థ సంతకం ఈ లేఖలో ఉన్న సంతకంతో సరిపోవడం లేదని స్పష్టం చేసింది.
"ఇది సరైన చర్య కాదు. జరిగిన తప్పులన్నింటికీ నేనే బాధ్యుడిని. మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఒకరోజు మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అని సిద్ధార్థ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రజలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, తీర ప్రాంత పోలీసు సిబ్బంది, కోస్ట్ గార్డులు... ఇలా 400కు పైగా సిబ్బంది సిద్ధార్థ మృతదేహాన్ని అన్వేషించే ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- వీజీ సిద్ధార్ధ: కెఫే కాఫీ డే యజమాని ఆత్మహత్య చేసుకున్నారా
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- బైట్‌డాన్స్: సొంతంగా స్మార్ట్‌ఫోన్ తయారు చేస్తున్న టిక్‌టాక్ కంపెనీ
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- కశ్మీర్ లోయలో అదనపు బలగాల మోహరింపు దేనికి సంకేతం
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









