వీజీ సిద్ధార్ధ: కెఫే కాఫీ డే యజమాని ఆత్మహత్య చేసుకున్నారా

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో అతిపెద్ద కాఫీ చెయిన్ కెఫే కాఫీ డే.. దీనినే సీసీడీ అనే పేరుతో పిలుస్తారు. ఈ సంస్థ యజమాని, వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ధ కనిపించడంలేదని మంగుళూరు పోలీసులు తెలిపారు.
వీజీ సిద్దార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు కూడా. ఆయన సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదని చెబుతున్నారు.
ఆయన ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నదిలో దూకి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం మంగుళూరు పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.

ఆత్మహత్య చేసుకున్నారా
సిద్దార్థ తన కారులో మంగుళూరు బయటి వరకూ వెళ్లారని, అక్కడ నేత్రావతి నది దగ్గరకు వెళ్లగానే కారును ఆపమని చెప్పి, దిగి వెళ్లిపోయారని చెబుతున్నారు.
తర్వాత డ్రైవరుతో "నువ్వు వెళ్లిపో, నేను నడుచుకుంటూ వస్తాను" అని చెప్పారని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.
ఆ తర్వాత చాలాసేపటి వరకూ సిద్దార్థ తిరిగి రాకపోవడంతో డ్రైవర్ మిగతా వారికి ఆ విషయం చెప్పారు.
ఆయన నంబరుకు కాల్ చేస్తే, ఫోన్ స్విచాఫ్ వస్తోందని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నష్టాల్లో కాఫీ డే
నదిలో సిద్దార్థ గాలింపు చర్యల కోసం రెండు బృందాలను పంపించామని మంగళూరు ఎస్పీ చెప్పారు.
కెఫే కాఫీ డే ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా దాదాపు 1750 కెఫేలు ఉన్నాయి. ఇవి కాకుండా మలేసియా, నేపాల్, ఈజిఫ్టులో కొన్ని అవుట్ లెట్లు ఉన్నాయి.
అయితే, గత రెండేళ్లుగా పోటీ పెరగడంతో దీని విస్తరణ వేగం నెమ్మదించిందని స్థానిక మీడియా చెబుతోంది. కంపెనీ చాలా ప్రాంతాల్లో చిన్న అవుట్ లెట్లను కూడా మూసేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కంపెనీ పరిస్థితిపై సిద్దార్థ తన ఉద్యోగులకు, బోర్డాఫ్ డైరెక్టర్లకు ఒక లేఖ రాసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తన అధికారిక ట్విటర్‌లో చెప్పింది. అన్ని లావాదేవీలకు తనే బాధ్యత వహిస్తున్నట్లు ఆయన అందులో చెప్పారని తెలిపింది.
గత నెల సిద్దార్థ తన కంపెనీలో ఒక వాటాను కోకా-కోలాకు అమ్మేయడానికి చర్చలు కూడా జరిపారని భారత మీడియా కథనాలు సూచించాయి. అయితే దీనిని రెండు కంపెనీలూ ధ్రువీకరించలేదు.
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు మంగళవారం 20 శాతం నష్టపోయినట్లు రాయిటర్స్ తెలిపింది. దాదాపు తన 20 శాతం వాటాను టెక్ కంపెనీ మైండ్ ట్రీకి అమ్మిన సిద్దార్థ ఇటీవల వార్తల్లో నిలిచారని చెప్పింది.
రాయిటర్స్ కథనంపై కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఈ గాయని నోటికి టేప్ అతికించుకుని నిద్రపోతారు.. కారణమేంటో తెలుసా
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- 'నా పాపను బయోవేస్ట్ అన్నారు. ఆ మాటకు నా గుండె పగిలింది‘
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








