కేంద్ర బడ్జెట్: కోటి రూపాయలు మించిన నగదు విత్‌డ్రాయల్స్‌పై పన్ను

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌ను నగదు రహిత ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచేందుకు నగదు విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు.
ఏడాదిలో బ్యాంకుల నగదు ఉపసంహరణలు కోటి రూపాయలు మించితే 2శాతం పన్ను విధించనున్నారు.
అలాగే 50 కోట్ల కంటే తక్కువ టర్నోవరు ఉన్న సంస్థలకు మర్చంట్ డిస్కౌంటు రేట్ల (ఎండీఆర్)ను రద్దు చేస్తామని ఆర్థికమంత్రి అన్నారు.
క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా వినియోగదారుల నుంచి నగదు స్వీకరించినందుకు వ్యాపారుల వద్ద బ్యాంకులు వసూలు చేసే ఫీజును ఎండీఆర్ అంటున్నారు.
ప్రస్తుతం డెబిట్ కార్డులు, బీమ్, యూపీఐ ద్వారా చేసే రూ.2,000 లోపు చెల్లింపులకు ఎండీఆర్‌ను ప్రభుత్వమే భరిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- నిర్మలా సీతారామన్: "మళ్లీ మూలాలకు వెళ్దాం.. జీరో బడ్జెట్ వ్యవసాయం చేద్దాం"
- కేంద్ర బడ్జెట్: 2022 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు.. వద్దనుకుంటే తప్ప
- బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు.. పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు - నిర్మలా సీతారామన్
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యం: ఆర్థిక సర్వే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- ఆదాయపు పన్ను కడుతున్న వారు ఎంతమంది? వారు కట్టే పన్ను ఎంత?
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




