ఆర్థిక సర్వే: 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించడమే లక్ష్యం

ఫొటో సోర్స్, RSTV
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో దేశ ఆర్థిక స్థితి దశ, దిశల గురించి చెప్పే ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. ఇందులో భారత విదేశీ మారక నిల్వలు మెరుగైన స్థితిలో ఉన్నాయని చెప్పారు, కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, విదేశీ రుణాలు తగ్గుతున్నాయని తెలిపారు.
నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) నిష్పత్తిలో క్షీణత వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పనితీరు మెరుగైందని, బ్యాంకులిచ్చే రుణాల్లో వృద్ధి వచ్చిందని ఇందులో చెప్పారు.
ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు.
భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంచనాలను ఇందులో వెల్లడించారు. దానికి ఎదురయ్యే సవాళ్ల గురించి చెప్పారు.
దేశంలోని వివిధ ఆర్థిక రంగాల పరిస్థితి గురించి, వాటిని మెరుగుపరిచే చర్యల గురించి ఈ సర్వేలో చెప్పారు.
భవిష్యత్తులో రూపొందించే విధానాల కోసం ఈ సర్వే ఒక దృష్టికోణంలా పనిచేస్తుందని, ప్రభుత్వం ఏయే రంగాలపై దృష్టి పెట్టాలో కూడా చెప్పారు.
ఈ సర్వే సిఫారసులు మాత్రమే, వీటిని అమలు చేయడానికి ఎలాంటి చట్టపరమైన బాధ్యతలు లేవు. అందుకే ప్రభుత్వం దీనిని కేవలం సూచనలా స్వీకరిస్తుంది.

ఆర్థిక సర్వేలో ప్రధాన అంశాలు
- పెట్టుబడులు, వినియోగంలో వృద్ధి వల్ల 2019-20లో జీడీపీలో 7 శాతం వృద్ధి అంచనా.
- సేవా ఎగుమతులు 2000-01లో 0.746 లక్షల కోట్ల రూపాయలుంటే 2018-19లో 14.389 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి.
- జూన్ 2019లో భారత్ విదేశీ మారక నిల్వలు 422.2 బిలియన్ డాలర్లకు చేరాయి.
- సేవా, ఆటోమొబైల్, రసాయన రంగాల్లో 2015-16 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక రేటు పెరిగింది.
- పెద్ద, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో రుణాల వల్ల వృద్ధి వచ్చింది. మంచి ఉత్పత్తి, నిర్మాణ కార్యకలాపాల వల్ల 2018-19లో పారిశ్రామిక వృద్ధి వేగవంతమైంది.

- 2018-19లో ఆర్థిక వ్యవస్థలో 6.8 శాతం వృద్ధి అంచనా.
- గత ఐదేళ్లలో సామాజిక సేవలపై వ్యయంలో జీడీపీ నిష్పత్తి పరంగా 1 శాతం కంటే ఎక్కువ వృద్ధి వచ్చింది.
- భారత దేశాన్ని 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేసేందుకు వృద్ధి రేటు ఎప్పుడూ 9 శాతం ఉంచాలని ఆర్థిక సర్వేలో చెప్పారు. దాంతోపాటు 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయడానికి ఒక బలమైన ప్రాథమిక మౌలిక సదుపాయాల ఆవశ్యకత ఉందని చెప్పారు.
- ప్రాథమిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల అంతరాన్ని పూడ్చడానికి పీపీపీ కింద ఇన్నోవేషన్ అప్రోచ్ ఉండాలన్నారు. ఇందులో ప్రాథమిక మౌలిక సదుపాయాల రంగంలో వివాదాలను పరిష్కరించడానికి సంస్థాగత ప్రక్రియ అవసరమని తెలిపారు.
- భారతదేశాన్ని ఉన్నత మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి తీసుకురావడానికి ప్రతి వ్యక్తి వాస్తవిక జీడీపీని 500 డాలర్లు పెంచడానికి ప్రతి వ్యక్తి తలసరి శక్తి వినియోగాన్ని రెండున్నర రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది.
- శక్తి వనరుల పొదుపు కార్యక్రమాల ద్వారా భారత దేశంలో 50 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం తగ్గింది. 2017-18లో సుమారు 108.28 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి.
- 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 3 శాతానికి తీసుకురావాలని, 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలను జీడీపీలో 40 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
- 2018-19 బడ్జెట్‌ను 2017-18 సవరించిన అంచనాలతో పోలిస్తే స్థూల పన్నుల ఆదాయం (జీటీఆర్)లో 16.7 శాతం వృద్ధి కనిపించింది. స్థూల పన్ను ఆదాయం 22.7 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని, దాని జీడీపీ 12.1 శాతం ఉంటుందని అంచనా వ్యక్తం చేశారు.
- 2018-19 సంవత్సరంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)ను బట్టి పారిశ్రామిక అభివృద్ధి రేటు 2017-18లో 4.4 శాతంతో పోలిస్తే 3.6 శాతం ఉంది.
- రైలు రవాణా, ప్రయాణికుల రాకపోకలు 2017-18లో 0.64 శాతంతో పోలిస్తే 2018-19లో 5.33 శాతానికి పెరిగాయి.
- భారత్‌లో 2018-19లో మొత్తం టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య 118.34 కోట్ల వరకూ చేరింది.
- విద్యుత్ స్థాపన సామర్థ్యం 2018లో 3,44,002 మెగావాట్ల నుంచి పెరిగి 2019లో 3,56,100 మెగావాట్లకు చేరింది.
- 2018-19లో పారిశ్రామిక రంగం పనితీరు 2017-18తో పోలిస్తే మెరుగుపడింది. స్థూల అదనపు విలువ(జీవీఏ) వృద్ధి రేటు 2017-18లో 5.9 శాతంతో పోలిస్తే 2018-19 సమయంలో పెరిగి 6.9 శాతానికి చేరింది.
- ఐదేళ్లలో అభివృద్ధి రేటు పెరిగింది, పెట్టుబడుల రేటు కూడా పెరిగింది.
- 2019-20లో ఆర్థిక లోటు 5.8 శాతం ఉంటుందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
- విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంపై నమ్మకం పెరిగింది.
- సమగ్రాభివృద్ధి కోసం భారత్‌లో కనీస వేతనాల వ్యవస్థను రూపొందించడానికి కొత్త ఫార్మాట్ తయారు చేయాలని ఆర్థిక సమీక్షలో చెప్పారు.
- కనీస వేతన వ్యవస్థ కోసం సమర్థవంతమైన ఫార్మాట్ తయారు చేసేందుకు విధాన సిఫారసులు సూచించారు.
- కనీస వేతనాలను సమర్థంగా, బాగా అమలు చేస్తే వేతనాలలో ఉన్న అసమానతలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
- కనీస వేతనాలను రెగ్యులర్ చేయడానికి అనుకూలంగా, ఒక కొత్త ప్రక్రియను అభివృద్ధి చేయాలని సూచించారు.
- కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉండేలా ఒక జాతీయ స్థాయి డాష్ బోర్డ్ ఏర్పాటు చేయవచ్చు.
- చట్ట ప్రకారం నిర్ణయించిన కనీస వేతనాల చెల్లింపులు జరగకపోతే ఫిర్యాదులు నమోదు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయాలని సిఫారసు చేశారు.

- రైళ్లు నేరుగా ఢీకొన్న ఘటనలు దేశంలో ఒక్కటి కూడా జరగలేదు.
- 2018-19 మధ్యలో రైల్వే సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంలో 5.33 శాతం వృద్ధి నమోదైంది.
- భారత రైల్వే విద్యుదీకరణ కోసం చర్యలు- 2021 వరకూ 38 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ చేస్తారు. దానిద్వారా బ్రాడ్‌గేజ్ 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని అందుకుంటారు.
- 10 రైల్వే స్టేషన్లు, 34 వర్క్‌షాపులు, 4 ఉత్పాదక యూనిట్లకు గ్రీన్ ఇండస్ట్రీస్ సర్టిఫికెట్ లభించింది.
- దివాలా, దివాలాకోరు నియమావళి 2016(ఐబీసీ) అమలు కావడంతో రుణాల వసూళ్ల వ్యవస్థ బలోపేతం అయ్యింది.
- 1,73,000 కోట్ల రూపాయలకు పైగా క్లెయింలు పరిష్కారం అయ్యాయి.
- నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను విస్తరించవచ్చు.

- స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 9.5 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 5.5 లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందాయి. స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్‌బీఎం) వల్ల 93.1 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు సౌకర్యం లభించింది.
- 30 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం ఇంటి మరుగుదొడ్లు (ఐహెచ్‌హెచ్ఎల్) కవరేజ్ అందేలా చేశారు. బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి (ఓఎఫ్‌డీ) పొందడంతో అతిసారం, మలేరియా కారణంగా సంభవించే మరణాలు తగ్గాయి.
- ఆర్థిక సమీక్ష ప్రకారం దేశంలోని సామాజిక రంగాలు, పేదల సంక్షేమం కోసం డేటా సిద్ధం చేయాలి. సమాజ సంక్షేమం కోసం దీనిని బహిరంగపరచాలి. ప్రజల డేటా, ప్రజల ద్వారా, ప్రజల కోసం అనేది ప్రభుత్వ మంత్రం కావాలి.
- ఎన్‌పిఏలో పతనం, బ్యాంకుల రుణాల్లో వృద్ధి వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరులో మెరుగుదల.
- సామాజిక భద్రత పథకాల ద్వారా జనాభాలోని పెద్ద భాగాలకు ప్రయోజనం లభించింది. పీఎం కిసాన్ యోజన 2019 ప్రకారం 5 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరింది.

ఫొటో సోర్స్, Getty Images
- బ్యాంకింగ్ సౌకర్యం లభించిన మహిళల సంఖ్య 2005-06లో 15.5 శాతం నుంచి పెరిగి 2015-16లో 53 శాతానికి చేరింది.
- భూమి ఉత్పాదకత నుంచి నీటిపారుదల ఉత్పాదకత వైపు వెళ్లడానికి జాతీయ ప్రాధాన్యం ఉండాలి.
- 2018-19లో 10.6 మిలియన్ విదేశీ పర్యాటకులు భారతదేశం వచ్చారు. అదే 2017-18లో వారి సంఖ్య 10.4 మిలియన్లు.
- ఐటీ-బీపీఎం పరిశ్రమ 2017లో 8.4 శాతం వృద్ధితో 167 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2018-19లో 181 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
- 2018-19లో సేవా రంగంలో 7.5 శాతం వృద్ధి జరిగింది. సేవా రంగంలో ఈక్విటీ ఫ్లో 28.26 బిలియన్ అమెరికా డాలర్లు.
ఇవి కూడా చదవండి:
- మోదీ వాగ్ధానాల విలువ రూ.100 లక్షల కోట్లు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
- భారత్ సుంకాలపై ట్రంప్ కఠిన నిర్ణయం.. ఫ్రీ ఆఫర్ బంద్
- ఈ అరుదైన ఖనిజాల ఎగుమతి ఆపేస్తే అమెరికా పని అంతే..
- పంటల బీమా: రైతుల కోసమా - కంపెనీల కోసమా
- ఇది కుందేళ్ల 'దండయాత్ర', కుదేలైన ఆర్థిక వ్యవస్థ
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- ఆర్థిక సర్వే 2017-18: పది ముఖ్యాంశాలు
- భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా...
- భారతదేశం ఆర్థికాభివృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తోందా...
- బాదం, యాపిల్ సహా 28 అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలు..
- బడ్జెట్ 2019: అయిదు లక్షల వరకు వ్యక్తిగత ఆదాయానికి పన్ను లేదు
- అక్కడ లీటరు పెట్రోలు 67 పైసలే
- అడవిని కాపాడే ఉద్యోగులకు ఆయుధాలెందుకు లేవు
- సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరు?
- భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సందడి చేసిన బామ్మ
- జల సంక్షోభం: చెన్నై నగరం ఎందుకు ఎండిపోయింది?
- ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్... బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో విజయం
- గురు గోల్వల్కర్ : 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా...
- ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు.. కానీ, వరల్డ్‌కప్ జట్టులో చోటు.. ఎవరీ మయాంక్ అగర్వాల్
- ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన భారత సంతతివారు కూడా ఆ జట్టుకు మద్దతు ఇవ్వట్లేదు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








