India Vs Bangladesh: ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్... బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో విజయం

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
315 విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఈ విజయంతో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది.
భారత్ తన తర్వాత మ్యాచ్ శ్రీలంకతో శనివారం ఆడనుంది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ 286 ఆలౌట్...
బంగ్లాదేశ్ ఆటగాళ్లలో షాకిబ్ అల్ హసన్(66), మహమ్మద్ సైఫుద్దీన్(51 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు.
ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(22), సౌమ్యా సర్కార్(33) బంగ్లాదేశ్‌కు మంచి ప్రారంభం ఇచ్చారు.
ముష్ఫికర్ రహీమ్(24), లిటన్ దాస్(22), షబ్బీర్ రహ్మాన్(36) జట్టు విజయం కోసం పోరాడారు.
48వ ఓవర్లో వరసగా రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
చివరి వరకూ పోరాడిన మహమ్మద్ సైఫుద్దీన్ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో భుమ్రా 4 విగెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్య 3, భువనేశ్వర్, మహమ్మద్ షమీ, యజువేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
సెంచరీ చేసిన రోహిత్ శర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
భారత్ 314/9...
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జోరుతో 350 దాటుతుందని భావించిన టీమిండియా స్కోరు, వెంటవెంటనే వికెట్లు పడడంతో 314 పరుగులకే పరిమితమైంది.
రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్‌లో 4వ సెంచరీ(104) చేయగా, అతడికి అండగా నిలిచిన కేఎల్ రాహుల్ 77 పరుగులు చేశాడు.
ఓపెనర్లు 180 పరుగుల భాగస్వామ్యం అందించగా, తర్వాత వచ్చిన వారిలో రిషబ్ పంత్(48), ఎంఎస్ ధోనీ(35) మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 పరుగులకే పెవిలియన్ చేరడం, హిట్టింగ్ చేస్తాడనుకున్న హార్దిక్ పాండ్య డకౌట్ కావడంతో భారత్ ఆశించిన స్కోరు సాధించలేకపోయింది.
చివరి ఓవర్లో పరుగులు పెంచే క్రమంలో టీమిండియా వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది.
బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్ 5 వికెట్లు తీశాడు. షాకిబ్ అల్ హసన్, రూబెల్ హసన్, సౌమ్యా సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఫొటో సోర్స్, Reuters
48వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆలౌట్
48వ ఓవర్ ఐదో బంతికి రూబెల్ హొస్సేన్(9)ను ఔట్ చేసిన బుమ్రా చివరి బంతికి ముస్తఫిజుర్ రహ్మాన్(0) వికెట్ తీశాడు.
ఇద్దరినీ యార్కర్ బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇదే ఓవర్లో మహమ్మద్ సైఫుద్దీన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
47 ఓవర్లలో 279/8...
బంగ్లాదేశ్ లక్ష్యం 18 బంతుల్లో 36 పరుగులు
46 ఓవర్లలో 272/8...
బంగ్లాదేశ్ లక్ష్యం 24 బంతుల్లో 43 పరుగులు
సైఫుద్దీన్ 40, రూబెల్ హొస్సేన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
45 ఓవర్లలో 264/8...
భువనేశ్వర్‌కు వికెట్...
45వ ఓవర్లో మష్రఫే మొర్తాజా ఔట్ అయ్యాడు.
అదే ఓవర్లో మొర్తాజా స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు.
ఈ వికెట్ 257 పరుగుల దగ్గర పడింది.
44 ఓవర్లలో 251/7...
బంగ్లాదేశ్ ఏడో వికెట్ డౌన్...
44వ ఓవర్లో బంగ్లాదేశ్ షబ్బీర్ వికెట్ కోల్పోయింది.
బుమ్రా బౌలింగ్‌లో షబ్బీర్ రహ్మాన్(36) బౌల్డ్ అయ్యాడు.
43 ఓవర్లలో 245/6...
42 ఓవర్లలో 240/6...
45 బంతుల్లో 75 పరుగులు కావాలి
41 ఓవర్లలో 229/6...
40 ఓవర్లలో 225/6...
40 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.
సైఫుద్దీన్(19), షబ్బీర్ రహ్మాన్(30) క్రీజులో ఉన్నారు.
విజయం కోసం బంగ్లాదేశ్ 60 బంతుల్లో 90 పరుగులు చేయాలి.
39 ఓవర్లలో 219/6...
ఈ ఓవర్లో 2 ఫోర్లు కొట్టారు.
చాహల్ వేసిన ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి.
షబ్బీర్ రహ్మాన్ 29, మహమ్మద్ సైఫుద్దీన్ 14 పరుగులతో ఆడుతున్నారు.
38 ఓవర్లలో 208/6...
38వ ఓవర్లో బంగ్లాదేశ్ 200 పరుగుల మైలురాయి చేరుకుంది.
ఈ ఓవర్లో మొత్తం నాలుగు ఫోర్లు వచ్చాయి.
సైఫుద్దీన్ రెండు ఫోర్లు, షబ్బీర్ రెండు ఫోర్లు కొట్టారు.
37వ ఓవర్లో చాహల్ ఒక్క పరుగే ఇచ్చాడు.
36 ఓవర్లలో 190/6...
షబ్బీర్ రహ్మాన్(14), మొహమ్మద్ సైఫుద్దీన్(1) క్రీజులో ఉన్నారు.
35 ఓవర్లలో 182/6...
షాకిబ్ అల్ హసన్ ఔట్...
34వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆరో వికెట్ పడింది.
179 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ షాకిబ్ అల్ హసన్ వికెట్ కోల్పోయింది.
హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో షాకిబ్(66) కొట్టిన షాట్ దినేశ్ కార్తీక్ చేతుల్లో పడింది.
ఇది హార్దిక్ పాండ్యకు మూడో వికెట్
30 ఓవర్లలో 177/5...
173 దగ్గర ఐదో వికెట్ డౌన్...
జస్‌ప్రీత్ బుమ్రాకు వికెట్ పడింది.
33వ ఓవర్లో మొసద్దెక్ హొస్సేన్‌ను(3) బౌల్డ్ చేశాడు.
ఒక వైపు వికెట్లు పడుతున్నా షాకిబ్ అల్ హసన్ ధాటిగా ఆడుతున్నాడు.
30 ఓవర్లలో 163/4...
హార్దిక్ పాండ్యకు రెండో వికెట్
162 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ నాలుగో వికెట్ పడింది.
హార్దిక్ పాండ్య వేసిన 30వ ఓవర్లో లిటన్ దాస్ఎ(22) దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇదే ఓవర్లో లిటన్ దాస్ సిక్స్ కూడా కొట్టాడు.
29 ఓవర్లలో 156/3...
28 ఓవర్లలో 147/3...
ఇదే ఓవర్లో షాకిబ్ అల్ హసన్ హాఫ్ సెంచరీ పూర్తైంది.
షాకిబ్ 50, లిటన్ దాస్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
27 ఓవర్లలో 139/3...
25 ఓవర్లలో 127/3...
3 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 25 ఓవర్లకు 127 పరుగులు చేసింది.
షాకిబ్ అల్ హసన్(42), లిటన్ దాస్(3) క్రీజులో ఉన్నారు.
24 ఓవర్లలో స్కోరు 125/3...
యజువేంద్ర చాహల్‌కు వికెట్
121 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ మూడో వికెట్ పడింది.
24 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీమ్ షమీకి క్యాచ్ ఇచ్చాడు.
23వ ఓవర్ చివరి బంతికి ఈ వికెట్ పడింది.

ఫొటో సోర్స్, AFP
23 ఓవర్లలో స్కోరు 121/3...
20 ఓవర్లలో 104/2...
20 ఓవర్లలో బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
ఇదే ఓవర్లో బంగ్లా వంద పరుగులు మైలురాయిని దాటింది.
ముష్ఫికర్ రహీమ్(17), షాకిబ్ అల్ హసన్(29) ఆడుతున్నారు.
19 ఓవర్లలో 98/2...
చాహల్ వేసిన 19వ ఓవర్లో ముష్ఫికర్ రహీమ్ వరసగా రెండు ఫోర్లు కొట్టాడు.
ఈ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి.
18 ఓవర్లకు 88/2...
ముష్పికర్ రహీమ్(6), షాకిబ్ అల్ హసన్(24) పరుగులతో క్రీజులో ఉన్నారు.
17 ఓవర్లకు 80/2...
16 ఓవర్లకు 75/2...
హార్దిక్ పాండ్యకు వికెట్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
16వ ఓవర్లో 74 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ రెండో వికెట్ పడింది.
హార్దిక్ పాండ్య తన తొలి ఓవర్ తొలి బంతికే సౌమ్యా సర్కార్(33)ను ఔట్ చేశాడు.
సౌమ్య సర్కార్ కొట్టిన షాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల్లో పడింది.
15 ఓవర్లకు 73/1...
14 ఓవర్లకు 69/1...
13 ఓవర్లకు 59/1...
షాకిబ్(13), సౌమ్యా సర్కార్(22) పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లకు 53/1...
12వ ఓవర్లో భారత్ రివ్యూ కోల్పోయింది.
షమీ బౌలింగ్‌లో షాకిబ్ ఎల్బీడబ్ల్యు అయినట్లు భావించిన కోహ్లీ అంపైర్‌ను రివ్యూ అడిగాడు
కానీ రీప్లే చూసిన అంపైర్లు ఇన్‌సైడ్ ఎడ్జ్ ఉందని దానిని నాటౌట్‌గా ఖరారు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
10 ఓవర్లకు 40/1...
10 ఓవర్లలో బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది.
సౌమ్యా సర్కార్(16), షాకిబ్ అల్ హసన్(1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మహమ్మద్ షమీకి తొలి వికెట్
ఇదే ఓవర్లో 39 పరుగుల దగ్గర బంగ్లాదేశ్ తొలి వికెట్ పడింది.
ధాటిగా ఆడుతున్న ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(33) షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
9 ఓవర్లకు 38/0
8 ఓవర్లకు 34/0
8వ ఓవర్ మహమ్మద్ షమీ వేశాడు. బంగ్లాదేశ్ ఓ
సౌమ్య సర్కార్(13), తమీమ్ ఇక్బాల్(20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
6 ఓవర్లకు 24/0
ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
హార్దిక్ పాండ్య త్రో ఫోర్ వెళ్లడంతో బంగ్లాదేశ్‌కు 4 పరుగులు అదనంగా వచ్చాయి.
4 ఓవర్లకు 16/0
బంగ్లాదేశ్ 4 ఓవర్లకు 16 పరుగులు చేసింది.
ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(15), సౌమ్యా సర్కార్(1) క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్ 315 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది.
భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా మొదటి స్పెల్ వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మూడు ఘనతలు సాధించాడు.
ఈ ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వార్నర్‌ను అధిగమించిన రోహిత్, నాలుగో సెంచరీతో సంగక్కర రికార్డును సమం చేశాడు.
ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు(228) బ్రేక్ చేసాడు.
రోహిత్ శర్మ వన్డేల్లో మొత్తం 230 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
భారత్ బ్యాటింగ్ సాగిన తీరు....
50వ ఓవర్లో మూడు వికెట్లు డౌన్
చివరి బంతి ఆడడానికి క్రీజులోకి వచ్చిన బుమ్రా ముస్తఫిజుర్ బంతికి బౌల్డ్ అయ్యాడు.
ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్ రనౌట్ అయ్యాడు.
50వ ఓవర్ మూడో బంతికి ఏడో వికెట్ పడింది.
పరుగులు పెంచే ప్రయత్నంలో ధోనీ ఔట్ అయ్యాడు.
311 పరుగుల దగ్గర ముస్తఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో షాకిబ్ అల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
49 ఓవర్లకు 311/6...
ఈ ఓవర్లో ధోనీ రెండు ఫోర్లు కొట్టాడు.
ధోనీ 35, భువనేశ్వర్ కుమార్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
48 ఓవర్లకు 300/6...
48వ ఓవర్లో భారత్ స్కోరు 300 పరుగుల దాటింది.
ఇదే ఓవర్లో ఆరో వికెట్ పడింది.
298 పరుగుల దగ్గర దినేశ్ కార్తీక్ ఔట్ అయ్యాడు.
48వ ఓవర్లో షాట్ కొట్టబోయిన దినేశ్ (8) మొసదిక్ హొస్సేన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ముస్తఫిజుర్ రహమాన్‌కు ఇది మూడో వికెట్
47 ఓవర్లకు 297/5...
46 ఓవర్లకు 288/5...
పంత్ ఔట్ కావడంతో దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
దినేష్ కార్తీక్ 2, ధోనీ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
277 దగ్గ రిషబ్ పంత్ ఔట్...
45 ఓవర్లకు 279/5...
45వ ఓవర్ తొలి బంతికి భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
48 పరుగులు చేసిన పంత్ షకిబ్ హసన్ బౌలింగ్‌లో మొసదిక్ హుస్సేన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
పంత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
44 ఓవర్లకు 277/4...
ఈ ఓవర్ చివరి బంతికి ధోనీ 4 కొట్టాడు.
43 ఓవర్లకు 268/4...
42 ఓవర్లకు 265/4...
రిషబ్ పంత్ 44, ధోనీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
41 ఓవర్లకు 255/4...
40 ఓవర్లకు 251/4...
40వ ఓవర్లో రిషబ్ పంత్ వరసగా మూడు ఫోర్లు కొట్టాడు.
39వ ఓవర్లో కోహ్లీ, పాండ్యా ఔట్...
అదే ఓవర్ నాలుగో బంతికి పాండ్య పరుగులేమీ చేయకుండానే ఫస్ట్ స్లిప్‌లో ఉన్న సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చాడు.
39వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు.
26 పరుగులు చేసిన కోహ్లీ ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్‌లో రూబెల్ హొస్సెన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
38 ఓవర్లకు 237/2...
కోహ్లీ, పంత్ స్కోరుబోర్డును మెల్లగా పరిగెత్తిస్తున్నారు.
37 ఓవర్లకు 227/2...
ఈ ఓవర్లో పంత్, కోహ్లీ చెరో ఫోర్ కొట్టారు.
పంత్ 16, కోహ్లీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
36 ఓవర్లకు 217/2...
కోహ్లీ, రిషబ్ పంత్ ఆచితూచి ఆడుతున్నారు.
ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
35 ఓవర్లకు 211/2...
34 ఓవర్లకు భారత్ 200 పరుగుల మైలురాయి దాటింది.
ఈ ఓవర్లో రిషబ్ పంత్ సిక్స్ కొట్టాడు.
రిషబ్ 8, కోహ్లీ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
33 ఓవర్లకు 196/2
కేఎల్ రాహుల్ ఔటవడంతో రిషబ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

ఫొటో సోర్స్, Getty Images
33వ ఓవర్లో రెండో వికెట్
195 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్ ఔటయ్యాడు.
77 పరుగులు చేసిన రాహుల్ రూబెల్ హొస్సేన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
32 ఓవర్లకు 190/1
31 ఓవర్లకు 184/1
కేఎల్ రాహుల్ 74, విరాట్ కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
30వ ఓవర్లో భారత్ తొలి వికెట్ డౌన్
180 పరుగుల దగ్గర ఓపెనర్ రోహిత్ శర్మ ఔటయ్యాడు.
92 బంతుల్లో 104 పరుగులు చేసిన రోహిత్ శర్మ సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5
రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
29 ఓవర్లకు 176/0
రోహిత్ శర్మ ప్రపంచకప్ టోర్నీలో నాలుగో సెంచరీ చేశాడు.
2015 ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలు చేసిన సంగక్కరతో కలిసి అగ్ర స్థానంలో నిలిచాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
28 ఓవర్లకు 173/0
రోహిత్ శర్మ 98, కేఎల్ రాహుల్ 70 పరుగులతో ఆడుతున్నారు.
27 ఓవర్లకు 169/0
ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి.
25 ఓవర్లకు 162/0
రోహిత్ శర్మ 92, కేఎల్ రాహుల్ 66 పరుగులతో క్రీజులో ఉన్నారు.
24 ఓవర్లకు 158/0
ఈ ఓవర్ తొలి బంతికి రోహిత్ శర్మ స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు.

ఫొటో సోర్స్, Getty Images
23 ఓవర్లకు 147/0
ఈ ఓవర్లో రోహిత్ ఫోర్ కొట్టాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అయ్యాడు.
ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 520 పరుగులు దాటాడు.
ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులతో ఉన్న డేవిడ్ వార్నర్‌ను అధిగమించాడు.
రోహిత్ 81, రాహుల్ 62 పరుగులతో ఆడుతున్నారు.
22 ఓవర్లకు 139/0
ఈ ఓవర్లో రోహిత్ శర్మ భారీ సిక్సర్, ఒక ఫోర్ కొట్టాడు.
ఇది ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌కు నాలుగో సిక్స్
రోహిత్ 75, కేఎల్ రాహుల్ 60 పరుగులతో ఆడుతున్నారు.
21 ఓవర్లకు 126/0
ఈ ఓవర్లో కేవలం 4 పరుగులే వచ్చాయి.
20 ఓవర్లకు 122/0
20 ఓవర్లకు భారత్ 122 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ 61, కేఎల్ రాహుల్ 57 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
19 ఓవర్లలో 117/0
ఈ ఓవర్లో కేఎల్ రాహుల్ రెండు ఫోర్లు కొట్టాడు.
ఇదే ఓవర్లో రాహుల్ 50 పరుగులు పూర్తయ్యాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
18 ఓవర్లలో 105/0
ఈ ఓవర్లో భారత్ వంద పరుగులు మైలురాయి దాటింది.
కేఎల్ రాహుల్ 44, రోహిత్ శర్మ 57 పరుగులతో ఆడుతున్నారు.
17 ఓవర్లలో 99/0
ఈ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి.
16 ఓవర్లలో 97/0
కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టాడు.
రోహిత్ 52, రాహుల్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
15 ఓవర్లలో 87/0
రోహిత్ శర్మ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.
ఈ ఓవర్లో రోహిత్ సిక్స్ కూడా కొట్టాడు.
14 ఓవర్లలో 78/0
13 ఓవర్లలో 74/0
రోహిత్, రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు.
ఈ ఓవర్లో ఒక్క పరుగే వచ్చింది.
12 ఓవర్లలో 73/0
ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులే వచ్చాయి.
11 ఓవర్లలో 71/0
ఓపెనర్లు రోహిత్ శర్మ 39, కేఎల్ రాహుల్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
10 ఓవర్లలో 69/0
ప్రపంచ కప్ టోర్నీలో మొదటి పవర్ ప్లేలో భారత్ అత్యధిక స్కోరు ఇదే.
ఈ ఓవర్లో రోహిత్ శర్మ ఒక ఫోర్ కొట్టాడు.
9 ఓవర్లలో 59/0
9 వ ఓవర్లో భారత్ స్కోరు 50 పరుగులు దాటింది.
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 52 పరుగులు చేశారు.
ఈ ఓవర్లో వరసగా రెండు ఫోర్లు వచ్చాయి.
8 ఓవర్లలో 47/0
సైఫుద్దీన్ వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్ రెండు ఫోర్లు కొట్టాడు.
7 ఓవర్లకు 36/0...
ఈ ఓవర్లో రోహిత్ శర్మ ఫోర్ కొట్టాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
6 ఓవర్లలో 30/0...
మహమ్మద్ సైఫుద్దీన్ వేసిన ఈ ఓవర్లో రోహిత్ శర్మ మరో సిక్స్ కొట్టాడు.
5 ఓవర్లలో 21/0...
ఈ ఓవర్లో రోహిత్ శర్మకు లైఫ్ వచ్చింది.
ముస్తఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ కొట్టిన షాట్‌ను తమీమ్ ఇక్బాల్ వదిలేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
ఈ క్యాచ్ మిస్ అయినప్పుడు రోహిత్ స్కోరు 9 పరుగులు
4 ఓవర్లలో 14/0
ఈ ఓవర్లో కేఎల్ రాహుల్ బౌండరీ కొట్టాడు.
3 ఓవర్లలో 14/0
మొదటి ఓవర్లోనే భారత్‌కు పది పరుగులు వచ్చాయి.
మొర్తాజా వేసిన తొలి ఓవర్లో రోహిత్ శర్మ సిక్స్ కొట్టాడు.
టీమిండియా జట్టులో రెండు మార్పులు చేసింది. కులదీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్, కేదార్ జాధవ్ స్థానంలో దినేష్ కార్తీక్‌కు చోటిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌కు సెమీస్‌లో చోటు ఖాయం.
ఇప్పటివరకూ టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఐదింటిలో గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉంది.
బంగ్లాతో మ్యాచ్‌లో ఓడినా, భారత్‌కు సెమీస్ అవకాశాలుంటాయి. ఈ నెల 6న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, నాకౌట్స్ చేరుకోవచ్చు. ఒక వేళ అది కూడా ఓడినా, నెట్ రన్ రేట్‌ను మెరుగ్గా కొనసాగించుకుంటే, భారత్ సెమీస్‌కు అర్హత సాధించవచ్చు.
మరో వైపు బంగ్లాదేశ్‌కు ఇది చావో రేవో మ్యాచ్. 11 పాయింట్లతో టేబుల్‌లో ఆ జట్టు ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌తో పాటు పాకిస్తాన్‌తో ఓ మ్యాచ్‌ను ఆ జట్టు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిచినా, ఆ జట్టు సెమీస్ అవకాశాలు మిగతా జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంటాయి.
భారత జట్టులో గాయపడ్డ విజయ్ శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్ చేరాడు. గత మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు అవకాశం దక్కింది. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. తుది-11 ఎవరనేది తెలియాల్సి ఉంది.

ఫొటో సోర్స్, twitter/cricketworldcup
భారత జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, కేదార్ జాధవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.
బంగ్లాదేశ్ జట్టు (అంచనా): మష్రఫ్ మొర్తజా (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, అబూ జాయెద్, లింటన్ దాస్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, మొహమ్మద్ మిథున్, మొహమ్మద్ సైఫుద్దీన్, మొసద్దెక్ హొస్సైన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, రూబెల్ హొస్సైన్, సబ్బీర్ రహ్మాన్, సౌమ్యా సర్కార్, తమీమ్ ఇక్బాల్.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- ప్రపంచకప్-2019లో భారత్‌కు తొలి ఓటమి.. 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం
- పాకిస్తాన్ పనైపోయిందా, లేదా.. సెమీస్ అవకాశాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయంటే..
- 'ఇండియా గెలవాలి... దేవుడా' అని పాకిస్తానీలు ఎందుకు కోరుకుంటున్నారు?
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు... రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)