ఆదాయపు పన్ను కడుతున్న వారు దేశంలో ఎంతమంది? వారు కట్టే పన్ను ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
2017-18 సంవత్సరంలో 6.85 కోట్ల మందికి పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు. వీరిలో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారి సంఖ్య 4,57,56,012. మొత్తంగా రూ. 4,41,255 కోట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2016-17 సంవత్సరంలో ఆదాయపు పన్ను రూపంలో కేంద్ర ఖజానాకు చేరిన మొత్తం రూ.3,64,604.38 కోట్లు.
ఆదాయపు పన్ను రిటర్నుల (అసెస్‌మెంట్ ఇయర్ 2017-18) అంచనాల ప్రకారం... దాఖలైన మొత్తం పన్ను రిటర్నులు 4,98,68,380. మరో 2.04 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయలేదు. కానీ, పన్ను మాత్రం చెల్లించారు. రివైజ్డ్ రిటర్నులతో కలిపి మొత్తం రిటర్నులు 6,85,32,510. ఇందులో వ్యక్తిగత రిటర్నులు 6,43,88,028.

ఫొటో సోర్స్, incometaxindia.gov.in
అసెస్‌మెంట్ ఇయర్ రిటర్నుల్లో పేర్కొన్న మొత్తం ఆదాయం రూ.42,98,264 కోట్లు.
ఈ రిటర్నుల్లో పేర్కొన్న మొత్తం జీతాల రూపంలోని ఆదాయం రూ.15,94,487 కోట్లు. ఇందులో పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.7,17,688 కోట్లు.
మొత్తం పన్ను చెల్లింపుదారులకు గృహాల ఆస్తి నుంచి లభించిన ఆదాయం రూ. 54,578 కోట్లు.
వ్యాపారం ద్వారా తమకు రూ.21,37,661 కోట్లు ఆదాయం వచ్చిందని రిటర్నులు దాఖలు చేసినవాళ్లు పేర్కొన్నారు.
దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా పొందిన ఆదాయం రూ.1,33,367 కోట్లు అని వారు తెలిపారు.
స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా పొందిన ఆదాయం రూ.58,237 కోట్లు అని పేర్కొన్నారు.
వడ్డీల రూపంలో తమకు రూ.1,58,077 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
ఇతర మార్గాల్లో రూ.5,10,633 కోట్ల ఆదాయం లభించిందని సమాచారం ఇచ్చారు.
మొత్తం పన్ను రిటర్నుల్లో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నట్లు పేర్కొన్న రిటర్నుల సంఖ్య 4,87,33,733. వీరు పేర్కొన్న మొత్తం ఆదాయం రూ.1,31,907 కోట్లు.
రూ.500 కోట్లకు పైన ఆదాయం ఉందని పేర్కొన్న రిటర్నుల సంఖ్య 94. వీరు పేర్కొన్న మొత్తం ఆదాయం రూ.1,64,269 కోట్లు.

ఫొటో సోర్స్, incometaxindia.gov.in
వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి...
దాఖలైన మొత్తం రిటర్నులు 4,66,75,114.
వాటిలో పేర్కొన్న మొత్తం ఆదాయం రూ.28,16,839 కోట్లు. అందులో జీతాల రూపంలో లభించిన ఆదాయం రూ.15,94,487 కోట్లు. ఇందులో పన్ను చెల్లించాల్సిన మొత్తం ఆదాయం రూ.2,73,405 కోట్లు.
వీటిలో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నట్లు పేర్కొన్న రిటర్నుల సంఖ్య 4,57,56,012. వీరు పేర్కొన్న ఆదాయం రూ. 1,21,384 కోట్లు.
కేంద్ర ప్రభుత్వానికి 2016-17లో వచ్చిన పన్ను ఆదాయం
మొత్తం పన్ను ఆదాయం రూ. 17,15,822.40 కోట్లు.
అందులో...
కార్పొరేట్ ట్యాక్స్ రూ.4,84,923.86 కోట్లు.
ఇన్‌కమ్ ట్యాక్స్ (ఆదాయంపై పన్ను) రూ. 3,64,604.38 కోట్లు.
సంపదపై పన్ను రూ.185.14 కోట్లు.
కస్టమ్స్ ట్యాక్స్ రూ. 2,25,370.34 కోట్లు.
యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలు రూ. 3,82,094.41 కోట్లు.
సర్వీస్ ట్యాక్స్ రూ. 2,54,498.74 కోట్లు.
ఇవి కూడా చదవండి:
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
- రిటైర్ అయ్యాక జీవితం హాయిగా సాగాలంటే ఏం చేయాలి?
- జీఎస్టీకి ఏడాది.. ఇదీ దాని చరిత్ర
- పీపీఎఫ్ ఖాతాతో ప్రయోజనాలేంటి?
- గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?
- వర్షాలకు, వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి?
- బీమా తీసుకునేటపుడు ఏ విషయాలు పరిశీలించాలి?
- ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య బీమాతో ప్రయోజనాలివీ..
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- ధరల క్యాలికులేటర్: ఇప్పుడు కేజీ 100 - మరి పదేళ్ల కిందట?
- Fact Check: కనీస ఆదాయ పథకం ప్రపంచంలో మరెక్కడా లేదా?
- ప్రజల ఖాతాల్లోకి డబ్బు: ఈ పథకం ఎలా ఉంటుందంటే..
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








