నిర్మలా సీతారామన్: బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు.. పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు.. ఐటీ రిటర్న్‌లూ దాఖలు చేయొచ్చు

ఫొటో సోర్స్, Lok Sabha TV
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
- వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు
- బంగారంపై కస్టమ్స్ డ్యూటీ రెండున్నర శాతం పెంపు
- పెట్రోలు ,డీజిల్ పై రూపాయి చొప్పున సుంకం పెంపు
పాన్ కార్డు స్థానంలో ఆధార్ కార్డు
124 కోట్ల మంది భారతీయులకు ఆధార్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డులను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. అంటే.. పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు వాడుకోవచ్చు. కాబట్టి, పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డుతో పన్ను చెల్లించొచ్చు. ఎక్కడెక్కడ పాన్ కార్డు నంబర్ అవసరం అవుతుందో అక్కడక్కడ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వొచ్చు.
మార్కెట్లోకి కొత్త రూపాయి కాయిన్లు
చూడలేని వారు కూడా గుర్తించగల ఒక రూపాయి, రూ. 2, రూ.5, రూ. 10, రూ.20 నాణేలను ఈ ఏడాది మార్చి 7వ తేదీన ప్రధాన మంత్రి విడుదల చేశారు. త్వరలోనే వీటిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం.
ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు.. మహిళల భాగస్వామ్యం లేకుండా సమాజం అభివృద్ధి చెందదు
మహిళల గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘మహిళల స్థితిగతుల్ని బాగు చేయకుండా ప్రపంచం అభివృద్ధి చెందదు. ఒక రెక్కతో పక్షి ఎగరడం సాధ్యం కాదు అని స్వామి వివేకానంద చెప్పారు. మహిళల మెరుగైన భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళల పాత్రను ప్రోత్సహిస్తుంది’’ అని చెప్పారు.
హర్ ఘర్ జల్.. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్
2024 నాటికి గ్రామాల్లోని ప్రతి ఇంటికీ తాగునీటిని నేరుగా అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
జీరో-బడ్జెట్ వ్యవసాయం.. తిరిగి మూలాలకు వెళ్లాలి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ (సులభ వ్యాపారం - సులభ జీవనం) అనేవి రైతులకు కూడా వర్తించాలి.
జీరో-బడ్జెట్ వ్యవసాయం మూలాలకు మనం తిరిగి వెళ్లాలి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి. దేశమంతటా ఈ నమూనాను విస్తరించాలి.
ఇటువంటి చర్యలు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి.
అర్హులైన వారికి 1.95 కోట్ల ఇళ్లు
తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ 1.5 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చామని, మరో 1.95 కోట్ల ఇళ్లు కట్టి ఇస్తామని సీతారామన్ ప్రకటించారు. ఈ ఇళ్లలో విద్యుత్, మరుగుదొడ్డి వంటి సదుపాయాలను కూడా కల్పిస్తామన్నారు.
అందరికీ వంట గ్యాస్
దేశంలో ఉన్న అందరికీ వంట గ్యాస్ సదుపాయం కల్పిస్తామని, ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోకపోతే తప్ప ప్రజలందరికీ వంట గ్యాస్ అందుతుందన్నారు.

ఫొటో సోర్స్, Lok Sabha TV
రైల్వేల్లో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు
దేశంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు పెడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2018 నుంచి 2030వ సంవత్సరం వరకు దేశంలో రైల్వేల అభివృద్ధికి 50 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ప్రతి ఏటా 1.5 నుంచి 1.6 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఇప్పటికే మంజూరు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకే దశాబ్ధాల సమయం పడుతుందని చెప్పారు.
అందుకే రైల్వేలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తాము ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.
‘‘రైల్వేల్లో వేగవంతమైన అభివృద్ధికి, రైల్వే లైన్ల నిర్మాణానికి, రోలింగ్ స్టాక్ ఉత్పత్తికి, ప్రయాణీకులు, సరకు రవాణా సేవల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని ప్రతిపాదిస్తున్నాం’’ అని సీతారామన్ చెప్పారు.
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పార్లమెంటులో కేంద్ర క్యాబినెట్ సమావేశం
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశమైందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పార్లమెంటుకు చేరుకున్న ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రాష్ట్రపతి కోవింద్‌తో నిర్మలా సీతారామన్ భేటీ
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో రాష్ట్రపతి భవన్ లో భేటీ అయ్యారు.
ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ చేతిలో కేంద్ర బడ్జెట్
పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పత్రాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్

ఫొటో సోర్స్, Getty Images
49 ఏళ్లలో తొలిసారి
ఒక మహిళ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం దేశ చరిత్రలో ఇది రెండోసారి. 49 ఏళ్లలో తొలిసారి.
1970వ సంవత్సరంలో ఇందిరాగాంధీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న ఆమె ఆర్థిక శాఖను కూడా తనవద్దే పెట్టుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
- జీఎస్టీలో మార్పుల మతలబు?
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- రూపాయి నోటుకు వందేళ్లు
- వివేకానందుడు చికాగో ప్రసంగంలో ఏం చెప్పారు?
- ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురూ చీఫ్ సెక్రటరీలు అయ్యారు
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- 'ఆర్థిక వ్యవస్థలో వెలుగు కంటికి కనిపించదా?'
- ఈ ఏడాది మోదీ ఏం చేయబోతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








