కేంద్ర బడ్జెట్ 2019: "మళ్లీ మూలాలకు వెళ్దాం.. జీరో బడ్జెట్ వ్యవసాయం చేద్దాం"

వ్యవసాయం

ఫొటో సోర్స్, apzbnf.in

వ్యవసాయ రంగంలో మళ్లీ మూలాలకు వెళ్లాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో 2019 బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

జీరో బడ్జెట్ వ్యవసాయం వైపు మళ్లాల్సి ఉందని, ఈ విధానం కొత్తది కాదని, అందుకే తిరిగి "మూలాలకు వెళ్లాలి" అని చెబుతున్నానని ఆమె తెలిపారు.

ఈ వ్యవసాయ విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొంత మేర చేపట్టాయని నిర్మల వివరించారు. దీనిని దేశమంతటా విస్తరించాల్సి ఉందన్నారు.

బడ్జెట్ పత్రాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, బడ్జెట్ పత్రాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఈ విధానాన్ని వినూత్న నమూనాలో చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.

జీరో బడ్జెట్ వ్యవసాయం లాంటి చర్యలు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని ఆమె అంచనా వేశారు. సులభ వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), సులభ జీవనం (ఈజ్ ఆఫ్ లివింగ్) అనేవి రైతులకు కూడా వర్తించాలని చెప్పారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

జీరో బడ్జెట్ వ్యవసాయ విధానాన్ని చేపట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.

ఏపీలో కొన్నేళ్ల క్రితం ఇది ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)