బడ్జెట్ 2019 : ఈ 6 విషయాలు తెలిస్తేనే ఈ రోజు బడ్జెట్ అర్థమవుతుంది

కరెన్సీ

ఫొటో సోర్స్, Ravisankar Lingutla

    • రచయిత, మేధావి అరోడా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ పదవీకాలం కొన్ని నెలల్లో ముగియనున్నందున కేంద్రం ఫిబ్రవరి 1న సంప్రదాయం ప్రకారం 'ఓట్ ఆన్ అకౌంట్'కే పరిమితమవుతుందా, లేక ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముందా అనే చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని అటుంచితే, బడ్జెట్ ప్రసంగాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన ఆరు అంశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. ఆర్థిక సంవత్సరం

భారత్‌లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ సంవత్సరానికి (జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు) మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

2. జీడీపీ- స్థూల దేశీయోత్పత్తి

ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని పట్టి చూపే కీలకాంశాల్లో ఇది ఒకటి.

3. ద్రవ్య లోటు

ప్రభుత్వ మొత్తం వ్యయాలు, మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్య లోటు (ఫిస్కల్ డెఫిసిట్) అని వ్యవహరిస్తారు. ద్రవ్య లోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణనలోకి తీసుకోరు.

రూపాయి

4. కరెంటు ఖాతా లోటు

వస్తు, సేవల దిగుమతుల విలువ, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు అంటారు.

5. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు

పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది. ఆదాయపు పన్ను, సంపద పన్ను, కార్పొరేట్ పన్ను- ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు.

పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు. విలువ ఆధారిత పన్ను(వ్యాట్), అమ్మకం పన్ను, సేవా పన్ను, విలాస పన్ను, వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో గత ఏడాది ప్రవేశపెట్టిన జీఎస్‌టీ- పరోక్ష పన్నులకు ఉదాహరణలు.

6. పెట్టుబడుల ఉపసంహరణ

ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని 'పెట్టబడుల ఉపసంహరణ' అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)